“ఆఫీసుకు వస్తున్నారు తప్ప… ప్రభుత్వ లక్ష్యం కోసం పనిచేయడం లేదు”

ఎస్సీ సంక్షేమ శాఖ రివ్యూ మీటింగ్ లో అధికారుల తీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం.

ఆఫీసుకు వస్తున్నారు తప్ప..ప్రభుత్వ లక్ష్యం కోసం పనిచేయడం లేదు

నాలుగు సంవత్సరాలు గడిచిన నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయలేదు-కొప్పుల ఈశ్వర్

ప్రభుత్వ అధికారుల పని తీరుపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాదులోని డి.ఎస్.ఎస్ భవనంలో శనివారం సాయంత్రం జరిగిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప మధ్యలో నిలిపి వేయడం ఏమిటని అడిగారు. ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేసినందుకు సహకరించాలి తప్ప, బాధ్యత లేకుండా వ్యవహరించ వద్దన్నారు. ఏ ఏ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వం ప్రారంభించిన పనులు, కమ్యూనిటీ హాల్లో భవన నిర్మాణాలు ఎమ్మెల్యేల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి పూర్తి అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంటుందన్నారు.

నిధులు లేవన్న సాకుతో పనులు నిలిపివేస్తే ప్రయోజనం ఏమి ఉంటుందని అన్నారు, ఇప్పటికైనా అయ్యో నియోజకవర్గ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినట్లయితే వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తారని మంత్రి చెప్పారు. చిన్న చిన్న పనులు చేపట్టెందుకు కాంట్రాక్టర్లు దొరకరని.. స్థానిక సర్పంచ్, జడ్పిటిసి, ఎంపిటిసి లేదా లోకల్ లీడర్ల సహాయంతో పూర్తి చేయించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ పనితిరు పైన మంత్రి సమీక్షించారు. నెలలో ఒకటి రెండు సార్లు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు.

వసతి గృహల్లో కిచన్, స్టోర్ రూము లు పరిశీలించాలన్నారు కొప్పుల ఈశ్వర్. వసతి గృహల్లో ఉంటున్న విద్యార్థులకు సరైన వసతులు ఉన్నాయా లేదో ఎప్పటికప్పుడు తెలుసు కుంటుండాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్ షిప్పుల గురించి అధికారులను అడిగి తెలుసు కున్నారు. విద్యా వైద్య రంగం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరె విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశం లో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అడిషనల్ కమిషనర్ ఉమా దేవి, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X