హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై అనుచితంగా మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో బొక్క బొర్లా పడ్డా నీవు.. తెలంగాణకు వచ్చి పెద్ద డైలాగులు కొడుతున్నావు అని నడ్డాను ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
“కేంద్రం కంటే మేం చాలా ముందున్నాం. చాలా ఎత్తున ఉన్నాం. మా పథకాలు బాగా లేకుంటే మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు. రైతుబందు, మిషన్ భగీరథ, కాకతీయ, మూగజీవాల కోసం 1962, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపీ కొట్టలేదా? పథకాలు మావి పబ్లిషిటీ మీది. మీవి నకిలీ పథకాలు. చెప్పేది ఎక్కువ.. చేసేది తక్కువ. బరితెగించి మాట్లాడే సంస్కృతి మానాలని కోరుతున్నాను. ఒక చేత్తో అవార్డులు ఇస్తారు. గల్లీలో వచ్చి తిడుతుంటారు. అవార్డు రాని డిపార్ట్‌మెంట్ లేదు. అవార్డు రాని నెల లేదు. అవార్డు రాని రంగం లేదు. అవార్డు రాని రంగం ఏదో చెప్పాలి. ఢిల్లీలో అవార్డులు.. గల్లీలో రాజకీయ విమర్శలు. పని చేయకపోతే మీరు ఎందుకు అవార్డులు ఇస్తున్నారు. ఇన్ని అవార్డులు తెలంగాణకు ఎందుకు వచ్చాయి. ఇక తెలంగాణకే అన్ని అవార్డులు వస్తుండటంతో భవిష్యత్‌లో అవార్డులను రద్దు చేస్తరేమో అనే అనుమానం ఉంది. వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండి, కేవలం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు”, అని హరీశ్‌రావు పేర్కొనారు.
గురువారం కరీంనగర్ సభలో ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడలేదు. సొల్లు పురాణం మాట్లాడిపోయిండు. మునుగోడులో ఓడిన తర్వాత కూడా జ్ఞానోదయం కాలేదు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోవాలి. నడ్డా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి ఎప్పుడు నిర్మిస్తారు. మునుగోడులో వేసిన ఆ శిలాఫలకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మేం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న అధికారంగా నిర్వహిస్తాం అని అంటున్నారు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. స్క్రిప్టు రాసిచ్చిన వారు అది కూడా చెప్పలేదా? అప్‌డేట్ కావాలని నడ్డాకు సూచిస్తున్నాం అని హరీశ్‌రావు అన్నారు.
మంత్రి టి. హరీష్ రావు మాట్లాడిన ముఖ్యాంశాలు…
..కరీంనగర్ సభ లో నడ్డా బీజేపీ నయవంచన ను నగ్నం గా ప్రదర్శించారు
..బీ ఆర్ ఎస్ కు వి ఆర్ ఎస్ అట
..వి ఆర్ ఎస్ అంటే ఏమిటీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీం
..అంటే స్వచ్చందంగా విరమణ చేయడం
..అంటే బీ ఆర్ ఎస్ కు మేము విఆర్ ఎస్ ప్రకటిస్తే తప్ప ఓటమి ఉండదని నడ్డా ఒప్పుకుంటున్నారు
..ప్రాస కోసం పాకు లాడితే పాట్లు తప్పవు
..అడ్డ గోలుగా హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన మీరా మాకు నీతులు చెప్పేది
..అకౌంట్ల లో 15 లక్షలు వేస్తామన్నారు ఏమైంది
..నల్ల ధనం వాపస్ తెస్తా అన్నారు ఏమైంది
..రూపాయి విలువ పెంచుతామన్నారు ఏమైంది.. అదో పాతాళానికి నెట్టారు
…మీ హామీల అమలు పై శ్వేత పత్రం ప్రకటిస్తారా
..రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదు పెట్టుబడి రెట్టింపు చేశారు
…కోట్ల కొద్ది కొలువులు అన్నారు లక్షల కొద్ది డబ్బులు అన్నారు ఏమయ్యాయి
…మేము మేనిఫెస్టో లో చెప్పినవి చేయనివి చేశాము
..మిషన్ భగీరథ ను మేనిఫెస్టో లో పెట్టకున్నా అమలు చేసిన దమ్మున్న నేత కేసీఆర్
..ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా మేము కల్యాణ లక్ష్మి అమలు చేయలేదా
..రైతు బంధు రైతు బీమా మేనిఫెస్టో లో పెట్టకున్నా అమలు చేయడం లేదా
…కేసీఆర్ కిట్ ఎన్నికల హామీ కాకున్నా అమలు చేయడం లేదా
…ఈ పథకానికి కేంద్రం అవార్డు కూడా ఇచ్చింది
…ప్రభుత్వ ఆస్పత్రుల్లో 66 శాతం డెలివరీ లు జరుగుతున్నాయి.. దీనికి కూడా కేంద్రం అవార్డు వచ్చింది
..తల్లి మరణాలు తగ్గినందుకు కేంద్రం అవార్డు ఇచ్చింది
…ప్రతి నిమిషం కేసీఆర్ పేదల కోసం ఆలోచిస్తారు… బీజేపీ మాత్రం ఎలా గోతులు తీయాలో ఆలోచిస్తుంది
…వెన్ను పోట్లు మాత్రమే బీజేపీ కి తెలుసు
…ఆపద మొక్కులు మాత్రమే బీజేపీ కి తెలుసు
..నడ్డా సొంత రాష్ట్రం లో బీజేపీ ఓడిపోయి బొక్కా బోర్లా పడింది
..ఇంట గెలిచి నడ్డా రచ్చ గెలవాలి
.సాలు దొర సెలవు దొర అని చిల్లర మాటలను ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతారా
..నడ్డా.. నీ సొంత అడ్డా హిమాచల్ లో బీజేపీ ని గెలిపించుకోలేక బొక్కా బోర్లా పడ్డావ్
..ఇంట గెలవలేదు ..రచ్చ గెలుస్తావా..
…మునుగోడు తీర్పు తో కూడా బుద్ది రాలేదా
..మునుగోడు లో ఫ్లోరిసిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతా అని ఆరోగ్య మంత్రిగా శిలాఫలకం వేసి పత్తా లేకుండా పోయావ్.. నువ్వా మా హామీల గురించి మాట్లాడేది
…శిలా ఫలకం వెక్కిరిస్తోంది చూడండి
…తెలంగాణ కు కేంద్రం చేసిన ఓ మంచి పని ఏమైనా ఉందా .ఏం లేదు కనుకే చెప్పలేదా
..ఎంత సేపు సొల్లు పురాణం తప్ప నిజాలు లేవు
… ప్రగల్భాలు తప్ప బీజేపీ తెలంగాణ కు చేసింది ఏమీ లేదు
…సెప్టెంబర్ 17 ను అదికారికంగా జరిపింది నడ్డా కు తెలియదా
..నడ్డా పాత స్క్రిప్ట్ ను చదివారా.. ఆప్ డేట్ కారా
..తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఇక్కడ జరుగుతున్న విషయాల పై కనీస అవగాహన ఉండాలి కదా
…ధరణి పోర్టల్ గురించి అడ్డమైన మాటలు మాట్లాడారు
.ధరణి వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలి
…తెలంగాణ ఏ అంశం లో చూసినా ముందుంది
..దేశం ఏ అంశం లో చూసినా వెనకబడి ఉంది
….ఉట్టి కేగనమ్మ స్వర్గానికి ఎగినట్టు అని వచ్చిరాని భాషలో బీ ఆర్ ఎస్ నుద్దేశించి నడ్డా మమ్మల్ని హేళన చేసి మాట్లాడారు
…మేము ఉట్టి కెగర లేదని ఎవరు చెప్పారు
…ఉట్టి కే కాదు అన్నిటి లో మీ కన్నా ఆకాశమంత ఎత్తున ఉన్నాం
..రైతు బంధు ముందు వచ్చిందా పీఎం కిసాన్ సమాన్ ముందు వచ్చిందా
…మిషన్ భగీరథ ముందు వచ్చిందా హార్ ఘర్ జల్ ముందు వచ్చిందా
..మేము ఉట్టి కేగక పోతే మా పథకాలు ఎందుకు కాపీ కొట్టారు
…పథకాలు మావి.. పబ్లిసిటీ మీదా
…నడ్డా పార్టీ వి నకిలీ పథకాలు
…బరి తెగించినట్టుగా బీజేపీ బేషర్మ్ మాటలు మాట్లాడుతోంది
..తెలంగాణ కు అవార్డులు రాని రంగం ఏదైనా ఉందా నడ్డా
..చేత్తో అవార్డులు ఇస్తూ నోటి తో అవహేళనలా
..అవార్డు లేని నెల లేదు.. అవార్డు రాని రంగం ఉందా
..ఢిల్లీ లో అవార్డులు గల్లీ లో విమర్శలా
..నడ్డా ఇది కేసీఆర్ గడ్డా.. మాట్లాడే ముందు నిజాలు తెలుసుకో
..హమారా హిందీ కంజోర్ హోగా మగర్ హం కామ్ దార్ హై.. ఇమాం దార్ హై… బీజేపీ వాలే కంజోర్ హై దేశ్ కో కంజోర్ బనా దియే..
…నెలకు లక్ష కోట్ల రూపాయల అప్పు చేస్తున్న ఘనత మోడీ సర్కారు ది ..అప్పుల గురించి మమ్మల్ని అంటారా
..ఇప్పటి దాకా కోటి కోట్ల రూపాయల అప్పులు చేసింది మోడీ ప్రభుత్వం
…దేశ తలసరి ఆదాయం తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం డబుల్
…బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎందుకు పెరగడం లేదు
…సొంతగా ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్
…దేశాన్ని అప్పుల కుప్ప గా మార్చింది బీజేపీ కాదా
..28 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పుల్లో 23 వ స్థానం లో ఉంది .కింది నుంచి ఆరో స్థానంలో ఉంది
…పార్లమెంటు లో ఇచ్చిన సమాధానం ఇది
..కేంద్ర ప్రభుత్వ frbm నిబంధనల వల్లే ఉద్యోగుల వేతనాల్లో కొంత ఆలస్యం కావచ్చు
..దేశం లో అత్యధిక వేతనాలు ఇస్తుంది తెలంగాణే
..గుజరాత్ లో ఉద్యోగుల జీతాలు తెలంగాణ ఉద్యోగుల జీతాలు పోలుస్తూ త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తాం
..కేంద్రం నుంచి కోతలు విధిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు
..gst రూపం లో తెలంగాణ నుంచి కేంద్రానికి పోయింది ఎక్కువ.. మాకు ఇచ్చింది తక్కువ
…కిషన్ రెడ్డి gst బకాయిలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు
..కరోనా సమయం లో gst నష్ట పరిహారం కొంత తెలంగాణ కు వచ్చింది
…వేరే రాష్ట్రాలకు తెలంగాణ కన్నా ఎక్కువ నష్టపరిహారం వచ్చింది
..తెలంగాణ ప్రజల మనసులు గెలవాలంటే కేంద్రం నుంచి నిధుల వరద పారించండి
…గుజరాత్ కు ఇచ్చిన నిధుల పై శ్వేత పత్రం ప్రకటిస్తారా
..గుజరాత్ కిచ్చినట్టు తెలంగాణ కు ఎందుకు నిధులు ఇవ్వరూ..
..ఆర్థిక సంఘం తెలంగాణ కు ఇవ్వమన్న 5 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వరు కిషన్ రెడ్డి ..
…రాష్ట్రానికి అన్నీ ఆపుతూ ఏం చేయలేదు అని బురద జల్లుతారా .ఇది కుట్ర కాదా
..మోడీ ని అమిత్ షా ను మేము నడ్డా కన్నా ఎక్కువ తిట్టొచ్చు
..పంచ్ డైలాగులు సినిమా డైలాగు లు కాదు బీజేపీ నుంచి తెలంగాణ కు కావాల్సింది
..ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి
..బీజేపీ వి కుమ్మక్కు రాజకీయాలు అందరికీ అర్థమయ్యాయి
..తెలంగాణ కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేశారో చెప్పాలి
…తెలంగాణ కు బీ ఆర్ ఎస్ యే శ్రీరామ రక్ష
..భవిష్యత్ లో బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణ కు వస్తే ప్రిపేర్ అయి రావాలి