రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండిఏ తదితర అన్ని విభాగాలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయాలి
ప్రారంభానికి సిద్దంగా యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు
నిర్మాణంలో మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, బసవేశ్వర తదితర ఆత్మగౌరవ భవనాలు
తుది దశలో ప్రభుత్వం నిర్మించే ఆత్మగౌరవ భవనాల టెండర్ ప్రక్రియ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో 41 కుల సంఘాలకు కోకాపేట్, ఉప్పల్ బగాయత్లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాలు 95.25 కోట్లు
బిసి ఆత్మగౌరవ భవనాల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ క్షేత్రస్థాయి సమీక్ష
హాజరైన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీసీ సంఘాల నేతలు, ముఖ్య శాఖల అధికారులు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాల పురోగతిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ సముదాయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు.
రెవెన్యూ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల పనులను పర్యవేక్షిస్తూ అత్యంత త్వరలో అన్ని పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి సమాంతరంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ పనులను పూర్తిచేయాలని భవనాలు నిర్మించుకునే ప్రతి సంఘానికి సంపూర్ణ సహకారం అందజేయాలన్నారు మంత్రి గంగుల.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేలకోట్ల విలువైన స్థలాలను హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేట్, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో బీసీలకు కేటాయించారని, వీటి నిర్మాణంలో సైతం ఆయా కుల ఏక సంఘాల ట్రస్టులకే తమ ఆత్మగౌరవం ప్రతిఫలించేలా కట్టుకోవడానికి అప్పగించామన్నారు, మొత్తం 87.3 ఎకరాల్లో 95.25 కోట్లతో 41 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను కేటాయించామని, కోకాపేటలో యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యాయని, మిగతా భవనాల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని వేగంగా అందజేస్తూ వాటిని సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, బసవేశ్వర భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని మిగతా ఫస్ట్లు సైతం భూమి పూజలు చేసుకున్నాయని, ప్రభుత్వం నిర్మించే భవనాలు సైతం టెండర్లు చివరి దశలో ఉన్నాయన్నారు మంత్రి గంగుల కమలాకర్.
మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం తుదిరూపుపై కసరత్తు
అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరుకాపు సంఘం నేతలతో కలిసి 5ఎకరాలు, 5కోట్లతో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం డిజైన్లను పరిశీలించిన మంత్రి గంగుల నిర్మాణంలో పలు సూచనలను సూచించారు. మున్నూరుకాపుల ఆత్మగౌరవం ప్రతిఫలించడంతో పాటు భవిష్యత్తులో అన్ని అవసరాలు తీరేవిదంగా ఎంకే టవర్లను నిర్మించాలని, ఇందులో రిక్రియేషన్, లైభ్రరీ, వసతి సధుపాయాలతో పాటు పంక్షన్ హాళ్ తదితర నిర్మాణాలుండాలని మంత్రి, ఎంపీ సూచించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, బీసీ సంక్షేమ శాఖ జేడి చంద్రశేఖర్, డీడీలు సంద్య, విమలాదేవి, వాటర్ వర్క్ డీఈ నరహరి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ వెంకన్న, కోకాపేట్ ఎమ్మార్వో రాజశేఖర్ రెడ్డి, హెచ్ఎండిఏ అధికారి ప్రవీణ్, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.