డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్ : జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్

“ప్రీతి చాలా ధైర్యవంతురాలు ఇలా ఎందుకు చేసిందో, జరిగిందో తెలీదు. ఈ ఘటన అత్యంత బాధాకరం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. దోషులు ఎవరైనా సరే, వదిలేది లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాము అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము. సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ప్రీతి ఘటన పై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయిస్తున్నారు. కారకులైన వారిని కటిన శిక్షిస్తాము.

ప్రీతి మృతి చాలా బాధాకరం. ప్రీతి ఆసుపత్రి లో చేరినప్పటినుండి ప్రతి సమాచారాన్ని నేను తెల్సుకుంటున్నాను. సీఎం కేసీఆర్, కేటీఆర్ లు కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రీతి కుటుంబ సభ్యులకు నేను అండగా ఉంటా. ప్రభుత్వం తరపున పది లక్షలు… నేను, నా కార్యకర్తల నుండి 20 లక్షలు ఇప్పిస్తా. ప్రీతి సోదరుడు, సోదరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. ప్రీతి మృతి ని కూడా ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయి.

Related News:

శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతి మంచిది కాదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సానుభూతి, సహానుభూతి ఉండాలి పైగా ఆమె అమ్మాయి. ప్రభుత్వం ఇంకా ఏమి చేయాలో ప్రతిపక్షాలు చెబితే బాగుంటుంది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు ఏమి చేస్తున్నారు చెప్పండి. ప్రీతి చావుతో కూడా రాజకీయం చేయడం కంటే నీచం ఇంకా ఏముంటుంది? ప్రీతి కుటుంబం నా కుటుంబం. నా బిడ్డ పేరు కూడా ప్రీతి. నేను ఈ కుటుంబానికి అండగా ఉంటాను.”

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్

“ప్రీతి మృతి అత్యంత దురదృష్టకరం, బాధాకరం. ప్రీతి ఘటన పట్ల సీఎం కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారు తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సంఘటన పై దర్యాప్తు జరుగుతుంది దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రీతి మృతి చెంది వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉంటే కొందరు రాజకీయం చేయాలని చూడడం శోచనీయం.

ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా నిరోధించాలో ఆలోచన చేయాలి తప్ప, రాజకీయం చేయడం సరికాదు. ప్రీతి పై విషప్రయోగం చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు గారు ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశారు, దోషులను కఠినంగా శిక్షిస్తాం. ప్రీతి చాలా ధైర్యవంతురాలు, కష్టపడి చదివి డాక్టర్ అయి ప్రజలకు సేవలు అందించాలని అనుకుంది కానీ ఇలా జరగడం దురదృష్టకరం.

నా కుమారుడు కూడా ఒక డాక్టర్, ప్రీతి ఎంత కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోగలుగుతాము. నేను ఒక తల్లిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, తప్పకుండా దోషులను శిక్షిస్తాం. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X