हैदराबाद: माओवादियों ने रविवार को आंध्र प्रदेश के एजेंसी इलाकों में बंद का आह्वान किया है। माओवादी पार्टी ने इस बारे में एक अहम बयान जारी किया है। माओवादियों के बंद के आह्वान के बाद एजेंसी इलाकों में पुलिस को अलर्ट कर दिया गया है।
APSRTC ने शनिवार रात से भद्राचलम, पडेरू, गुट्टेडू, वाई रामावरम और दूसरे इलाकों में जाने वाली बस सर्विस बंद कर दी हैं। पुलिस ने जनप्रतिनिधियों और बड़े अधिकारियों को एजेंसी इलाकों में न जाने की चेतावनी दी है।
Also Read-
Maoists Bandh : ఏజెన్సీ లో పోలీసుల అలర్ట్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం, పాడేరు, గుత్తేడు, వై రామవరం, తదితర ప్రాంతాలకు శనివారం రాత్రి నుంచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపి వేసింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ క్రమంలో మావోయిస్టుల చర్యలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. మావోయిస్టుల చర్యలను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిచెందారు. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్ అయ్యారు. భద్రత బలగాల చర్యలను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే ఆదివారం బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచింది. (ఏజెన్సీలు)
