हैदराबाद: माओवादी पार्टी को एक और बड़ा झटका लगा है। तेलंगाना के डीजीपी शिवधर रेड्डी के सामने 20 माओवादियों ने आत्मसमर्पण कर दिया है। माओवादी पार्टी के तेलंगाना समिति के सदस्य कंकणाला राजी रेड्डी, उसकी पत्नी एडलूरी ईश्वरी उर्फ रेमा, और माओवादी पार्टी के गेरिला लिबरेशन आर्मी के चीफ बर्से देवा उर्फ सुक्का सहित 20 माओवादियों ने आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने वालों में पीएलजीए फर्स्ट बटालियन से 10, टीएससी से 3, एसएसजेडबी से 2 और दंडकारण्य स्पेशल जोन कमेटी (दक्षिण और पश्चिम बस्तर डीवीसी) से 5 माओवादी शामिल हैं।
इनसे 48 माउंटेड एमएलजी हथियार बरामद किए गए हैं। बर्से देवा ने अपने पास के 20 लाख रुपये स्टेट स्पेशल इंटेलिजेंस ब्यूरो (एसआईबी) को सौंप दिए हैं। आत्मसमर्पण करने वाले माओवादियों को आज दोपहर डीजीपी कार्यालय में मीडिया के सामने पेश किया गया। ऑपरेशन कगार के बाद तेलंगाना में यह सबसे बड़ी हथियार आत्मसमर्पण है।

इस अवसर पर डीजीपी शिवधर रेड्डी ने कहा कि माओवादी पार्टी को यह एक बड़ा झटका है। पीएलजीए बटालियन पूरी तरह से ढह गई है। पीएलजीए बटालियन में सभी रैंक के 400 से अधिक लोग थे, लेकिन अब केवल 66 लोग बचे हैं। कंकणाल राजी रेड्डी के आत्मसमर्पण के साथ, तेलंगाना स्टेट कमेटी लगभग पूरी तरह ढह गई है और वर्तमान में स्टेट कमेटी में केवल एक व्यक्ति बचा है।
डीजीपी ने आगे कहा कि ऐसा माना जा रहा था कि माओवादी पार्टी में अब तक 55 सदस्य अलग-अलग पदों पर काम कर रहे हैं, लेकिन हाल ही में सरेंडर करने वालों से मिली जानकारी के मुताबिक, अभी सिर्फ़ 17 ही माओवादी पार्टी में हैं। उन्होंने कहा कि सेंट्रल कमेटी में चार, स्टेट कमेटी में पाँच, डिविजनल कमेटी मेंबर में तीन, एरिया कमेटी मेंबर में चार और सिर्फ़ एक PMS है। इन सभी ने मुख्यमंत्री रेवंत रेड्डी के कहने पर तेलंगाना सरकार की तरफ़ से दिए गए रिहैबिलिटेशन से आकर्षित होकर सरेंडर किया।
Also Read-
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ, డీజీపీ ఎదుట బర్సీ దేవా మావోయిస్టుల సరెండర్, కంకణాల రాజిరెడ్డి…
హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డిఎదుట 20 మంది మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి ఆయన సతీమణి అడ్లూరి ఈశ్వరి అలియాస్ రేమతో పాటు మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ బర్సే దేవా అలియాస్ సుక్కతో పాటు మొత్తం 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ ఫస్ట్ బెటాలియన్ నుంచి 10 మంది, టీఎస్‍సీ నుంచి 3, ఎస్ఎస్‌జెడ్‌బీ నుంచి 2, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (దక్షిణ & పశ్చిమ బస్తర్ డీవీసీ) నుంచి 5 మంది ఉన్నారు.
వీరి నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్‌జీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద ఉన్న రూ. 20 లక్షలను బార్సె దేవా స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)కి అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులను ఇవాళ మధ్యాహ్నం డీజీపీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఆయుధ లొంగుబాటు ఇదే కావడం విశేషం. అలాగే డీజీపీ శివధర్‌రెడ్డి నేతృత్వంలో అదిపెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖను కేంద్ర హోంశాఖ ప్రశంసించింది. కాగా, రేపు మరో 20 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీకి ఇది భారీ ఎదురుదెబ్బ, పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కొలాప్స్ అయిందన్నారు. పీఎల్‌జీఏ బెటాలియన్‌లో అన్ని ర్యాంకులతో కలిపి 400 మందికి పైగా ఉండేవారని, కానీ ఇప్పుడు 66 మంది వరకు మాత్రమే ఉన్నారన్నారు. కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ సరెండర్‌తో తెలంగాణ స్టేట్ కమిటీ ఆల్ మోస్ట్ కొలాప్స్ అయిపోయిందని, ప్రస్తుతం స్టేట్ కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారన్నారు.
మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు ఇప్పటివరకు 55 మంది ఉన్నారని భావించామని, కానీ తాజాగా లొంగిపోయిన వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రం నుంచి నుంచి కేవలం 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని తెలిపారు. ఇందులో కేంద్ర కమిటీలో నలుగురు, స్టేట్ కమిటీలో ఐదుగురు, డివిజనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ఏరియా కమిటీ మెంబర్లు నలుగురు, పీఎంఎస్ ఒక్కరు మాత్రమే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసం పట్ల ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు. (ఏజెన్సీలు)
