हैदराबाद : छत्तीसगढ़ के बीजापुर के नेशनल पार्क के जंगलों में सुरक्षाबलों और माओवादियों के बीच मुठभेड़ हुई है। मीडिया में प्रसारित और प्रकाशित खबरों के मुताबिक, इस मुठभेड़ में माओवादी कमांडर पापा राव मारा गया। इसके साथ ही जवानों ने एक अन्य माओवादी को मार गिराया है।

वहीं घटनास्थल से दो एके47 राइफल भी बरामद किए गए हैं। एसपी जितेंद्र यादव ने बताया कि अभी मुठभेड़ जारी है। आपको बता दें कि माओवादियों के मौजूदगी की सूचना पर डीआरजी जवानों ने ऑपरेशन लॉच किया।
Also Read-
పాపారావు ఎన్ కౌంటర్
హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్‍లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‍లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‍గా ఉన్న మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ మోంగు మరణించారు. పాపారావు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు.
ఛత్తీస్‍గఢ్‌లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకడిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్‍లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉంది. దీంతో గత కొంతకాలంగా ‘ఆపరేషన్ పాపారావు’ పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్ గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి.
ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పాపారావు దళం సంచరిస్తోందన్న సమాచారం మేరకు బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ నేతృత్వంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), CoBRA దళాలు ఇవాళ తెల్లవారుజామున జాయింట్ కూబింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో జరిగిన భీకర కాల్పుల్లో పాపారావుతో పాటు మరో మావోయిస్టు మరణించారు. పాపారావుపై కోటి రూపాయల వరకు రివార్డు ఉంది. కాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)
