హైదరాబాద్ : టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ జరపతలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహాధర్నా’’ పేరిట దీక్ష చేస్తారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు.