हैदराबाद: तेलंगाना में लोकसभा चुनाव का अहम पड़ाव मतदान प्रक्रिया खत्म हो गई है। चुनाव कार्यक्रम जारी होने के 25 दिनों तक चले प्रचार-प्रसार के फलस्वरूप आज मतदाताओं ने अपना फैसला ईवीएम मशीनों में कैद कर दिया। हालाँकि, देश में चल रहे आम चुनावों के तहत, कुछ छिटपुट घटनाओं को छोड़कर, चौथे सत्र में तेलंगाना के 17 संसदीय क्षेत्रों के साथ-साथ सिकंदराबाद छावनी उपचुनाव के लिए मतदान शांतिपूर्ण रहा है।
सुबह सात बजे से ही बूथों पर मतदाताओं की कतार लग गयी। धूप होने के कारण मतदाताओं ने सुबह ही बड़ी संख्या में मतदान केंद्रों पर अपने मताधिकार का प्रयोग किया, लेकिन दोपहर में मतदान में थोड़ी कम रही है। हालांकि मतदान के आखिरी घंटों में मतदान का प्रतिशत बढ़ा है। इसके चलते बड़ी संख्या में मतदाता कतारों में खड़े पाये गए। मतदान सुबह 7 बजे से शाम 6 बजे तक आयोजित किया जाना चाहिए, लेकिन आखिरी समय में मतदाताओं की बड़ी कतारें होने के कारण मतदान अधिकारियों ने एक महत्वपूर्ण निर्णय लिया। अधिकारियों ने बताया कि छह बजे तक लाइन में लगे सभी मतदाताओं को वोट देने का मौका दिया जायेगा। चुनाव आयोग के अधिकारियों ने कहा कि जो मतदाता छह घंटे के भीतर मतदान केंद्र पर आए, उन्हें टोकन दिया गया और मतदान करने का मौका दिया गया। उन्होंने कहा कि हर व्यक्ति को मतदान करने का मौका दिया जाएगा, चाहे कितनी भी रात हो।
कुछ समस्याग्रस्त क्षेत्रों में मतदान चार बजे समाप्त हो जाएगा, जबकि अन्य सभी स्थानों पर छह बजे तक कतार में लगे सभी मतदाताओं को अपने मताधिकार का प्रयोग करने का अवसर दिया गया। मालूम हो कि पहले भी विधानसभा चुनाव में अधिकारियों ने छह बजे तक लाइन में लगे मतदाताओं को वोट डालने का मौका दिया था। इस बीच राज्य में दोपहर एक बजे तक 40.38 प्रतिशत और तीन बजे तक 52.34 प्रतिशत मतदान दर्ज किया गया। शाम 5 बजे तक 61.16 फीसदी मतदान हुआ। मतदान प्रतिशत बढ़ेगा क्योंकि कतार में खड़े लोगों को वोट देने का मौका दिया गया है। हालाँकि, अधिकारियों का अनुमान है कि संभावना है कि मतदान का प्रतिशत नाटकीय रूप से बढ़ेगा क्योंकि कई क्षेत्रों में मतदाता बड़े पैमाने पर कतार में खड़े हैं। मतदान प्रतिशत की पूरी जानकारी मंगलवार रात तक मिलने की संभावना है। हालाँकि, अब तक उपलब्ध जानकारी के अनुसार, भुवनगिरि में सबसे अधिक मतदान दर्ज किया गया है, जबकि हैदराबाद में हमेशा की तरह सबसे कम मतदान दर्ज किया गया है।
संबंधित समाचार-
तेलंगाना के 13 विधानसभा क्षेत्रों- महबुबाबाद, पेद्दापल्ली, वरंगल, खम्मम परिधि के सिरपुर, आसिफाबाद, चेन्नूर, बेल्लमपल्ली, मंचिरयाला, मंथनी, भूपालपल्ली, मुलुगु, पिनापाका, भद्राचलम, कोत्तागुडेम, अश्वरावपेट और इल्लंदु के अशांत क्षेत्रों में मतदान समाप्त हो गया है। लोकसभा निर्वाचन क्षेत्र. अधिकारियों ने कतार में लगे लोगों को शाम चार बजे तक मतदान करने की अनुमति दी। राज्य भर के शेष 106 विधानसभा क्षेत्रों में शाम 6 बजे तक मतदान समाप्त होने के बाद भी कतार में खड़े मतदाताओं को मौका दिया गया। नतीजे 4 जून को जारी किए जाएंगे।
संसद क्षेत्रों के अनुसार मतदान प्रतिशत (6 घंटे तक) इस प्रकार हैं-
आदिलाबाद- 69.81, पेद्दापल्ली- 63.86, करीमनगर- 67.67, निज़ामाबाद- 67.96, जहीराबाद- 71.91, मेदक- 71.33, मलकाज़गिरि- 46.27, सिकंदराबाद- 42.48, हैदराबाद- 39.17, चेवेल्ला- 53.15, महबूबनगर- 68.40, नगरकर्नूल- 66.53, नलगोंडा- 70.36, भुवनगिरि- 72.34, वरंगल- 64.08, महबुबाबाद- 68.60, खम्मम- 70.76 प्रतिशत मतदान हुआ।
తెలంగాణలో ముగిసిన పోలింగ్, నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం
హైదరాబాద్ : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి 25 రోజుల పాటు సాగిన ప్రచారపర్వానికి ఫలితంగా ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈరోజు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తం చేశారు. అయితే దేశంలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడుతలో తెలంగాణలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ నిర్వహించగా కొన్ని చెదురు ముదురు ఘటనలు తప్ప అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బూతులకు క్యూ కట్టారు. ఎండ కారణంగా ఉదయం పూట ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా మధ్యాహ్నం సమయంలో కొంత సన్నగిల్లింది. కాగా పోలింగ్ ముగిసే చివరి గంటల్లో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. సాధారణంగా అయితే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా చివరి సమయంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్లలో బారులు తీరటంతో పోలింగ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటేసే అవకాశం ఇచ్చినట్టు ఈసీ అధికారులు తెలిపారు. ఎంత రాత్రి అయినా అందరు ఓటేసే వారకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియగా మిగతా అన్ని స్థానాల్లో ఆరు గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లందరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. గతంలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే 6 గంటల వరకు లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటేసే అవకాశాన్ని అధికారులు కల్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 40. 38 శాతం పోలింగ్ నమోదు కాగా 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఇక క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించనుండటంతో ఈ ఓటింగ్ శాతం పెరగనుంది. అయితే చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు లైన్లలో బారులు తీరటంతో ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి పోలింగ్ శాతంపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న సమచారం మేరకు భువనగిరి స్థానంలో అత్యధిక పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా ఓటింగ్ నమోదై ఎప్పటిలాగే హైదరాబాద్ చివరిలో ఉంది.
రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందుల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగియగా లైన్లలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పించారు. (ఏజెన్సీలు)
పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా పోలింగ్ శాతం (6 గంటల వరకు)
ఆదిలాబాద్- 69.81, పెద్దపల్లి- 63.86, కరీంనగర్- 67.67, నిజాామాబాద్- 67.96, జహీరాబాద్- 71.91, మెదక్- 1.33, మల్కాజ్ గిరి- 46.27, సికింద్రాబాద్- 42.48, హైదరాబాద్- 39.17, చేవెళ్ల- 53.15, మహబూబ్‌నగర్- 68.40, నాగర్ కర్నూల్- 66.53, నల్గొండ- 70.36, భువనగిరి- 72.34, వరంగల్- 64.08, మహబూబాబాద్- 68.60, ఖమ్మం- 70.76.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99శాతం పోలింగ్ నమోదైంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.