Road Accident: आंध्र प्रदेश के नहीं, हैदराबाद के हैं मृतक, మృతులు ఆంధ్రప్రదేశ్‌ కాదు, హైదరాబాద్‌కు చెందినవారు

हैदराबाद: मध्य प्रदेश के जबलपुर जिले में आज सुबह सड़क हादसे में सात लोगों की मौके पर ही मौत हो गई। मिली जानकारी के अनुसार, हैदराबाद के नाचाराम से कुछ श्रद्धालु एक मिनी बस में प्रयागराज में जारी कुंभ मेले में गए थे। वापसी में जबलपुर जिला मुख्यालय 65 किमी दूर सिहोरा कस्बे के बाहरी इलाके में विपरीत दिशा से आ रहे एक ट्रक ने मिनी बस को जोरदार टक्कर मार दी।

जबलपुर कलेक्टर दीपक कुमार सक्सेना ने बताया कि हादसे में मिनी बस में सवार सात लोगों की मौके पर ही मौत हो गई। घटनास्थल पर पहुंचे जबलपुर एसपी ने घटनास्थल का निरीक्षण किया। बाद में शवों को पोस्टमार्टम के लिए निकटतम सरकारी अस्पताल में भर्ती किया।

हालाँकि, दुर्घटना में शामिल बस के पंजीकरण के आधार पर पुलिस ने शुरू में सोचा था कि पीड़ित आंध्र प्रदेश के होंगे। लेकिन पुलिस ने खुलासा किया कि शवों के साथ मिले सबूतों के आधार पर सभी मृतकों की पहचान हैदराबाद शहर के नाचाराम निवासियों के रूप में की गई है। मृतकों के नामों का अभी तक खुलासा नहीं किया गया है। इसके बारे में पूरी जानकारी अभी तक नहीं पाई है।

Also Read-

మృతులు ఆంధ్రప్రదేశ్‌ కాదు, హైదరాబాద్‌కు చెందినవారు

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం పాలైన విషాదం ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని నాచారం నుంచి కొంతమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళాకు మినీ బస్సులో వెళ్లారు. అయితే, తిరుగు ప్రయాణంలో బజల్‌పూర్ జిల్లా కేంద్రానికి 65 కి.మీ. దూరంలో ఉన్న సిహోరా పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా జబల్‌పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జబల్‌పూర్‌ ఎస్పీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ప్రమాదానికి గురైన బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీకి చెందిన వారు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులంతా హైదరాబాద్ నగరంలోని నాచారం వాసులుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతుల పేర్ల వివరాలను ఇంత వరకు వెల్లడించ లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X