हैदराबाद: कुकटपल्ली ड्रग्स मामले में आंध्र प्रदेश के दो पुलिस कांस्टेबलों को गिरफ्तार किया गया है। आंध्र प्रदेश के दो पुलिस कांस्टेबल तिरुपति टास्क फोर्स कांस्टेबल गुण शेखर और हेड कांस्टेबल रामचंद्र को तेलंगाना में साइबराबाद एसओटी (स्पेशल ऑपरेशन टीम) पुलिस ने गिरफ्तार किया।
यह घटना हाल ही में हैदराबाद के कुकटपल्ली थाना क्षेत्र में हुई। इस मामले में पुलिस ने करीब 2 करोड़ रुपये कीमत का 820 ग्राम इफेड्रिन (कोकीन में मिला हुआ ड्रग), एक डिजिटल वजन तौलने वाली मशीन और पांच मोबाइल जब्त किए हैं। ड्रग्स को बापटला जिले के अदंकी से हैदराबाद ले जाते समय पकड़ा गया।
पुलिस ने ड्रग रैकेट के मुख्य आरोपी के रूप में गुण शेखर की पहचान की है। पुलिस ने बताया कि इस गिरोह में कुल सात सदस्य हैं, जिनमें से गुण शेखर और एक अन्य व्यक्ति फरार हैं। अन्य पांच ड्रग तस्करों की पहचान भी बापटला जिले के अदंकी निवासी के रूप में की गई है। पुलिस फिलहाल इस बात की जांच कर रही है कि शेखर ने इफेड्रिन ड्रग किसे सप्लाई किया है। इस मामले के संबंध में अधिक जानकारी जुटाने के लिए जांच की जारी है
यह भी पढ़ें-
Kukatpally Drugs Case: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అరెస్టు
హైదరాబాద్ : కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అరెస్టయ్యారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర అనే ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్లను తెలంగాణలోని సైబరాబాద్ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో సుమారు రూ. 2 కోట్ల విలువైన 820 గ్రాముల ఎఫిడ్రిన్ (కొకైన్‌తో కలిపిన డ్రగ్), ఒక డిజిటల్ వెయిట్ మిషన్, ఐదు మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడ్డారు.
గుణ శేఖర్‌ను ఈ డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులున్నారని, వీరిలో గుణ శేఖర్‌తో పాటు మరో వ్యక్తి అప్పన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు కూడా బాపట్ల జిల్లా అద్దంకి చెందిన వారిగా గుర్తించారు. గుణ శేఖర్ ఈ ఎఫిడ్రిన్ డ్రగ్‌ను ఎవరికి సరఫరా చేశాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. (ఏజెన్సీలు)
