कुकटपल्ली सहस्रा हत्याकांड: क्रिकेट बैट की चोरी करने आया नाबालिग आरोपी और…!?

हैदराबाद: कुकटपल्ली में सनसनी फैलाने वाली दस साल की बच्ची सहस्रा की हत्या के मामले का पुलिस ने खुलासा कर दिया है। पुलिस ने पुष्टि की है कि इस दरिंदगी का आरोपी उसी इलाके में रहने वाला 15 साल का दसवीं कक्षा का छात्र है। चोरी की सुनियोजित योजना बनाकर घर में घुसे लड़के को सहस्रा ने रोक लिया। इसके चलते उसने उसकी हत्या कर दी। इसी क्रम में इस हत्या मामले में सनसनीखेज बातें सामने आई हैं।

कुकटपल्ली के संगीतनगर में रहने वाले कृष्णा और रेणुका दंपत्ति की बेटी सहस्रा (10) की इसी महीने की 18 तारीख को हत्या कर दी गई थी। स्कूल की छुट्टी होने के कारण सहस्रा घर पर थी और जब उसके पिता दोपहर के भोजन के लिए घर आए तो वह खून से लथपथ मिली। यह मामला पुलिस के लिए एक बड़ी चुनौती बन गया है। कोई सबूत न मिलने पर लगभग 300 लोगों से पूछताछ की गई, लेकिन कोई नतीजा नहीं निकला। हालाँकि, पुलिस को शक था कि हत्या के पीछे कोई जान-पहचान वाला व्यक्ति हो सकता है। उन्होंने पिता पर शक होने पर उससे भी पूछताछ की। लेकिन कोई फायदा नहीं हुआ।

हालाँकि, एक स्थानीय सॉफ्टवेयर कर्मचारी की एक छोटी सी सूचना के आधार पर हत्यारे को गिरफ्तार कर लिया गया। सहस्रा की हत्या वाले दिन, उस लड़के ने देखा कि कृष्णा दंपत्ति और उनका बेटा बाहर गए हैं और वह उनके अपार्टमेंट की छत से कूदकर सहस्रा के घर क्रिकेट बैट चुराने पहुँचा। टीवी देख रहे सहस्रा ने दरवाज़ा ठीक से बंद नहीं किया था। इसलिए वह चुपके से अंदर घुस गया। जैसे ही वह बैट ले रहा था, लड़की ने उसे देख लिया और चीखकर उसे पकड़ लिया। जब लड़की ने अपने माता-पिता को बताने की धमकी दी, तो लड़का डर गया और उसने उसे धक्का दिया, उसका गला घोंट दिया और फिर अपने साथ लाए चाकू से उसकी हत्या कर दी। फिर उसने घर में रखी हुंडी तोड़ दी और उसमें से पैसे लेकर भाग गया।

हत्या से तीन दिन पहले, आरोपी लड़के ने इंटरनेट पर चोरी करने और अगर कोई उसे रोकने की कोशिश करे तो भागने के तरीके खोजे थे। उसने ये सब एक कागज़ पर भी लिख लिया था। उस योजना में उसने लिखा था, “पहले घर में जाओ, फिर गैस का पाइप काटो, घर में ताला लगाओ और भाग जाओ। मिशन पूरा हुआ।”

सैकड़ों सीसीटीवी फुटेज खंगालने के बावजूद पुलिस को अपराधी का कोई सुराग नहीं मिला। इससे मामला और उलझ गया। इसी क्रम में जिस अपार्टमेंट में आरोपी रहता था, वहाँ के एक सॉफ्टवेयर कर्मचारी ने पुलिस को बताया कि उसने हत्या वाले दिन एक लड़के को दीवार फांदकर अपार्टमेंट में घुसते देखा था। उस जानकारी के आधार पर पुलिस ने जाँच शुरू की और उसी इलाके के एक स्कूल में पढ़ने वाले लड़के की पहचान की। जाँच के दौरान, लड़के ने अपना अपराध कबूल कर लिया। उसने बताया कि उसने फ्रिज पर इस्तेमाल किया चाकू और खून से सनी टी-शर्ट वॉशिंग मशीन में छिपा दी है।

पुलिस को पता चला कि आरोपी ने बहुत चालाकी से काम लिया। पहले भी, वह सहस्रा की जन्मदिन पार्टियों में शामिल हुआ था और उसे केक भी खिलाया था। जब पुलिस जाँच करने आई, तब भी उसने पुलिस को यह कहकर गुमराह करने की कोशिश की कि सहस्रा ने हत्या के समय घर से चीखें सुनी थीं और वह “पापा, पापा” कहकर चिल्लाई थी। सहस्रा के छोटे भाई के साथ उसी स्कूल में दसवीं कक्षा में पढ़ने वाला आरोपी स्कूल जाने के बजाय क्रिकेट खेलता था। वह हॉरर वेब सीरीज़ और क्राइम फ़िल्में देखकर समय बिताता था। जब उसकी नज़र सहस्रा के छोटे भाई के महंगे बैट पर पड़ी, तो वह उसे चुराने गया और सहस्रा की हत्या कर दी।

Also Read-

కూకట్‌పల్లి సహస్ర హత్య కేసు: క్రికెట్ బ్యాట్ చోరీకి వచ్చి…

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అదే ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేయడానికే ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు.. తనను చూసిన బాలిక అడ్డురావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివసించే కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్ర (10) ఈ నెల 18న హత్యకు గురైంది. పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్న సహస్ర, తండ్రి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దాదాపు 300 మందిని ప్రశ్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే, ఈ హత్య వెనుక ఉన్నది తెలిసినవారే అయి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. తండ్రిపై అనుమానంతో అతడ్ని కూడా విచారించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

అయితే స్థానికంగా ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న సమాచారం హంతకుడు పట్టుబడేలా చేసింది. సహస్ర హత్య జరిగిన రోజు కృష్ణ దంపతులు, వారి కుమారుడు బయటికి వెళ్లినట్లు గమనించిన బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేసేందుకు తమ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి సహస్ర ఇంటికి చేరుకున్నాడు. టీవీ చూస్తున్న సహస్ర తలుపులు సరిగ్గా వేసుకోకపోవడంతో రహస్యంగా లోపలికి ప్రవేశించాడు. బ్యాట్‌ తీసుకొని వెళ్తుండగా బాలిక అతడిని చూసి కేకలు వేయడంతోపాటు పట్టుకుంది. అమ్మానాన్నలకు చెబుతానని బెదిరించడంతో భయపడిన బాలుడు ఆమెను తోసేసి, గొంతు నులిమి, ఆపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి పొడిచి హతమార్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న హుండీ పగలగొట్టి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

హత్యకు మూడు రోజుల ముందు నుంచే నిందితుడైన బాలుడు దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలను ఇంటర్నెట్‌లో వెతికాడు. అంతేకాకుండా వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడు. ఆ ప్లాన్‌లో “మొదట ఇంట్లోకి వెళ్లాలి తర్వాత గ్యాస్‌ పైపు కట్‌ చేసి, ఇంటిని లాక్‌ చేసి పారిపోవాలి మిషన్‌ డన్‌” అని రాసుకున్నాడు.

వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా నేరస్థుడి ఆనవాళ్లు లభించలేదు. దీంతో కేసు చిక్కుముడి పడింది. ఈ క్రమంలో నిందితుడు ఉండే అపార్ట్‌మెంట్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్య జరిగిన రోజు ఒక బాలుడు గోడ దూకి అపార్ట్‌మెంట్‌లోకి రావడం చూశానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో పోలీసులు విచారణ ప్రారంభించి అదే ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదువుతున్న ఆ బాలుడిని గుర్తించారు. విచారణలో బాలుడు నేరం అంగీకరించాడు. తాను వాడిన కత్తిని ఫ్రిజ్‌పై, రక్తపు మరకలు ఉన్న టీ-షర్ట్‌ను వాషింగ్‌ మెషీన్‌లో దాచిపెట్టానని ఒప్పుకున్నాడు.

నిందితుడు అత్యంత తెలివిగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. గతంలో సహస్ర పుట్టినరోజు వేడుకలకు హాజరై కేకు కూడా తినిపించాడు. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు కూడా హత్య జరిగిన సమయంలో సహస్ర ఇంట్లోనుంచి కేకలు వినిపించాయని, డాడీ, డాడీ అని అరిచిందని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కాగా సహస్ర తమ్ముడు చదివే స్కూల్‌లోనే పదో తరగతి చదువుతున్న నిందితుడు సరిగ్గా స్కూల్‌కు వెళ్లకుండా ఎప్పుడూ క్రికెట్ ఆడుతుండేవాడు. హారర్ వెబ్‌ సిరీస్‌లు, క్రైమ్ మూవీస్ చూస్తూ టైంపాస్ చేసేవాడు. అతడి కన్ను సహస్ర తమ్ముడి ఖరీదైన బ్యాట్‌పై పడగా దాన్ని దొంగలించడానికి వెళ్లి బాలిక ప్రాణం తీశాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X