Congress Backstabs Telangana: KTR Calls Budget a ‘40% Commission Scam
Broken Promises & Rising Debt: KTR Tears Into congress Budget
From Zero Jobs to Ignored Farmers – KTR Lists Congress Budget Failures
BRS to Fiercely Oppose ‘Anti-People Budget’ That Buries Telangana’s Welfare
Hyderabad: BRS Working President KTR has slammed the Congress government’s latest budget, calling it a complete betrayal of Telangana’s people who are left with “zero gains.” He described it as a mirror reflecting Chief Minister Revanth Reddy’s inefficiency, incompetence, and administrative failure, accusing the government of drowning the hopes of four crore people who trusted and voted for them. KTR criticized the Congress for puncturing the wheel of progress built over a decade under BRS rule, alleging that their sole focus is sending “bags of money” to Delhi rather than fulfilling promises made to Telangana. He labeled it a “40% commission budget” that prioritizes political greed over people’s welfare, vowing that BRS will fiercely oppose this “anti-people budget.”
KTR pointed out that the much-hyped six guarantees, promised within 100 days, have been reduced to nothing. After Deputy CM Bhatti Vikramarka’s hour-and-a-half speech, it became clear that these guarantees are a hollow chant of “Govinda Govinda.” The Congress, he said, buried its own affidavit—once equated to the Bhagavad Gita—after winning votes with false promises. Telangana’s poor, women, farmers, and elderly awaited the budget with hope, but promises like Rs 2,500 monthly for women under Mahalakshmi, Rs 4,000 pensions for the elderly, and “tula of gold” remain unmentioned, leaving these groups shocked and disappointed.
The budget’s financial mismanagement drew sharp criticism. While the BRS government borrowed Rs 4.17 lakh crore over 10 years, Congress amassed Rs 1.6 lakh crore in just one year, with no new projects or schemes to justify it. KTR mocked their “trillion-dollar economy” claim, saying they don’t even know how many zeros that entails, yet seem set on a “trillion-dollar debt.” He blamed Revanth Reddy’s negative policies and politics for a Rs 73,000 crore drop in state revenue, questioning why Bhatti Vikramarka’s “realistic budget” failed to meet expectations when the CM himself admits to this shortfall.
KTR accused Congress of backstabbing every section of society. Over 100 auto drivers committed suicide due to the free bus scheme, yet the promised Auto Drivers’ Welfare Board is absent from the budget, leaving eight lakh auto drivers statewide in distress. Rahul Gandhi’s assurances of a board for gig workers like Swiggy and Zomato employees and two lakh jobs in the first year remain unfulfilled, with unemployed youth laughing at the government’s claims of issuing appointment letters for BRS-era notifications. Weavers, who got Rs 1,200 crore under KCR, have been slashed to Rs 370 crore. Government employees, promised more than KCR’s 73% fitment, find no mention of PRC or five pending DAs. Farmers’ loan waivers are incomplete, with Congress dodging BRS’s challenge to prove 100% implementation in a single village. The Rs 12,000 aid for farm laborers is another broken promise, despite claims of starting it—KTR challenged them to show one village where it’s been delivered, saying he’s ready for any punishment if proven wrong.
Marginalized communities have been cheated too. The caste census underrepresented BCs, while promises of sheep for Yadavs, 25% reservation in wine shops for Gouds, and Rs 12 lakh under Ambedkar Abhaya Hastam for Dalits were ignored. Hyderabad, under Revanth Reddy’s municipal oversight, has become a “ruined city” with pending works piling up. Government hospitals lack basic medicines, and existing Gurukuls falter—83 students have died—yet the government boasts of new schools, which KTR called shameful.
KTR alleged that Congress’s priority is “Moosi lootification” to funnel funds to Delhi, escalating from a 20% to a 40% commission regime. He claimed they plan to distribute Rs 6,000 crore to Congress workers like “jaggery and dal,” but warned that people won’t tolerate Telangana’s wealth being handed over. “This isn’t youth development; it’s Telangana’s destruction,” he said. While farmers commit suicide, the government shamelessly organizes beauty contests and brags about it in the budget. KTR demanded they stop sending bags to Delhi and focus on farmers’ distress.
The BRS leader called this a budget that buries welfare and erases development’s address. In 10 years, BRS borrowed Rs 40,000 crore annually, while Revanth Reddy’s one-year Rs 1.6 lakh crore debt has yielded nothing new, with more borrowing targeted. KTR quipped, “If a lizard ripens, it becomes a chameleon; if a chameleon ripens, it becomes Revanth Reddy.” He warned that Congress is more dangerous than the coronavirus, leaving no power supply or progress in its wake. The decade-strong economic foundation laid by BRS has crumbled in one year of Congress rule, plunging Telangana’s economy from the skies to the abyss, for which he held the party accountable.
BRS stands firm against this budget, which KTR said is a conspiracy to loot public money for party workers while ignoring people’s hardships—from auto drivers to farmers, all have been deceived. The party demands accountability and a shift from Delhi-centric corruption to addressing Telangana’s real needs.
Also Read-
ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్
ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు
6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం
అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్
ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్
ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే దృష్టి
ప్రజల కష్టాలు పైన ధ్యాస లేని బడ్జెట్- ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర
ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే
ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు టార్గెట్ గా ఉన్న బడ్జెట్
ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి అసమర్థతకు, చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని కాంగ్రెస్ నిలువునా ముంచిందని విమర్శించారు. పదేళ్ల ప్రగతి రథచక్రానికి పంచర్ చేసిన బడ్జెట్ ఇదని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడం పైననే బడ్జెట్ లో దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెను ముప్పులా ఉన్న 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ ను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేదలు, ఆడబిడ్డలు, రైతులు, రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ భట్టి విక్రమార్క గారి గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత ఆరు గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అనే మాటకు పాతర వేశారు. నెలకు 2500 రూపాయలు ఇస్తామని ఏ మహిళలకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇప్పుడు ఆ మహిళలంతా ఈ బడ్జెట్ను చూసి షాక్ అయ్యారు. వంద రోజుల్లో 4000 రూపాయల పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన వృద్ధులకు నిరాశ మిగిలింది. ఏ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీల గురించి బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రస్తావించ లేదు.
6 గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి దేవుని ముంగట పెట్టి ఆ ఆఫిడవిట్లే తమకు భగవద్గీత తో సమానమని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు ఆ హామీలకు పాతర వేశారు. తుల బంగారం దిక్కులేదు. నెలకు 2500 రూపాయల మహాలక్ష్మి దిక్కులేదు. నెలకు 4000 రూపాయల పెన్షన్ ఊసే లేదు. కెసిఆర్ గారి ప్రభుత్వంలో నేతన్నకు పెద్దపీట వేస్తూ చేనేతకు పెట్టిన బడ్జెట్ 1200 కోట్ల రూపాయలు. కానీ ప్రస్తుత బడ్జెట్లో వారికి కేవలం 370 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఫ్రీ బస్సుతో ఓవైపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ వారికి హామీ ఇచ్చిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు గురించి ఈ బడ్జెట్లో అతీగతి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. స్విగ్గి,జొమాటో లాంటి గిగ్ వర్కర్ల కోసం ఒక బోర్డు పెడతామని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు వారి గురించి కూడా ఒక మాట లేదు. 73% ఫిట్మెంట్ లొ కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తే వారికి ఇంకా ఎక్కువ న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చి వారి గురించి బడ్జెట్లో ఒక మాట కూడా చెప్పలేదు. పిఆర్సి గురించి కానీ పెండింగ్లో ఉన్న ఐదు డిఏ ల గురించి కానీ ఒక మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించలేదు.
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని దారుణంగా మోసం చేసింది. యాదవ సోదరులకు ఇస్తానన్న గొర్ల గురించి ఈ ప్రభుత్వం బడ్జెట్లో పట్టించుకోలేదు. వైన్ షాపుల్లో 25% రిజర్వేషన్ ఇస్తానని గౌడ్ అన్నలకు ఇచ్చిన హామీని ఈ బడ్జెట్లో పట్టించుకోలేదు. అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 12 లక్షలు దళితులకు ఇస్తామని గొప్పగా చెప్పుకొని దళితులకు వెన్నుపోటు పొడుస్తూ ఈ బడ్జెట్లో అంబేద్కర్ అభయ హస్తం గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో హామీ ఇచ్చారు. కానీ ఇవాళ నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదు. కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, చేసిన రిక్రూట్ మెంట్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఈ ప్రభుత్వం ఇస్తూ తమ ఘనతగా చెప్పుకుంటుంటే నిరుద్యోగులు నవ్వుకుంటున్నారు.
నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్లో లేదు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాలనే నడపలేని అసమర్ధులు 83 పైచిలుకు గురుకుల విద్యార్థులు చచ్చిపోతే ఏమి చేయలేని అసమర్ధులు కొత్త స్కూళ్లు కడతామని బిల్డప్ ఇవ్వడం సిగ్గుచేటు. ఇవాళ హైదరాబాద్ మహానగరం అద్వాన నగరంగా మారింది. మున్సిపల్ శాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి అసమర్థతతో పనులన్నీ పెండింగ్లో పడిపోయాయి. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే కనీసం గోలీలు ఇచ్చే దిక్కులేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ట్రిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ట్రిలియన్ డాలర్లు అప్పు మాత్రం చేసేలాగా ఉన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో నాలుగు లక్షల 17 వేల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆరోజు కాంగ్రెస్ నేతలు కారు కూతలు కూశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క సంవత్సరంలో లక్ష 60 వేల కోట్లు చేసింది . ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.
20% కమిషన్ పాలన దేశానికి సిగ్గుచేటు. 6 గ్యారంటీల అమలను పక్కనపెట్టి ఢిల్లీకి మూటలు పంపడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. మూసి లూటిఫికేషన్ మాత్రమే రేవంత్ ప్రథమ ప్రాధాన్యం. ఆ లూటిఫికేషన్ ద్వారానే ఢిల్లీకి మూటలు పంపుతున్నారు. ఏ ఒక్క ఊర్లోనైనా వందకు వందశాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే మా శాసన సభ్యత్వాలను వదులుకుంటామని చేసిన చాలెంజ్ కు ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు. కోటిమంది రైతు కూలీలకు 12000 ఇస్తామని హామీ ఇచ్చి దాని గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ బడ్జెట్లో మాత్రం దాన్ని ప్రారంభించామని చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క గ్రామంలోనైనా రైతు కూలీలు తమకు ₹12,000 వచ్చాయని చెప్తే ఏ శిక్ష కైనా సిద్ధం. నిన్నటిదాకా 20% కమిషన్ గా ఉన్న ప్రభుత్వాన్ని, 40 శాతం కమిషన్ ప్రభుత్వంగా మార్చి ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది.
రేవంత్ తెలివి తక్కువ తనం వల్ల ప్రభుత్వ అసమర్ధ వల్లనే 73 వేల కోట్ల ఆదాయం పడిపోయింది. రేవంత్ రెడ్డి నెగిటివ్ పాలసీస్, నెగిటివ్ పాలిటిక్స్ వలన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గింది. మీడియా ముందు రంకెలు వేసే రేవంత్ రెడ్డి అంకెలు ఎందుకు ఆగమయ్యాయో చెప్పాలి. తమ బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంది. నేల విడిచి సాము చేయలేదని , గాల్లో మేడలు కట్టడం లేదని గత బడ్జెట్లో భట్టి గారు గొప్పగా చెప్పుకున్నారు. కానీ బడ్జెట్ ఎందుకు అంచనాలకు చేరుకోలేకపోయింది. 73 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి ఎందుకు చెప్తున్నారో బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలి. నమ్మి ఓటేసిన పాపానికి నాలుగు కోట్ల మందిని ముంచిన బడ్జెట్ ఇది. పదేళ్ల ప్రగతి రథచక్రాన్ని పంచర్ చేసిన బడ్జెట్ ఇది. రేవంత్ రెడ్డి అసమర్థతకు చాతకానితనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గట్టిగా పడ్డ పునాది కాంగ్రెస్ ఒక సంవత్సరం పాలనలోనే బీటలు వారింది. ఆకాశం నుంచి పాతాళానికి ఆర్థిక వ్యవస్థ కూరుకుపోతున్నది. ఇందుకు కాంగ్రెస్ పార్టీని బాధ్యత తీసుకోవాలి.
ఆనాడు మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ నేతలు రంకెలు వేసి నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క సంవత్సరంలోనే 1,60,000 కోట్ల అప్పుచేసి ఒక్క కొత్త ప్రాజెక్టు ఒక కొత్త పథకాన్ని కూడా ప్రారంభించలేదు. మళ్లీ లక్షల కోట్ల అప్పుకు ఈ బడ్జెట్లో టార్గెట్ పెట్టుకున్నారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందనేది పాత సామెత. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుందనేది కొత్త సామెత. కాంగ్రెస్ ఉంది అంటేనే కరెంటు ఉండదు. కాంగ్రెస్ కరోనా వైరస్ కంటే ప్రమాదం. కాంగ్రెస్ పాలనలో సంక్షేమానికి సమాధి. అభివృద్ధి అడ్రస్ గల్లంతు. ప్రజలకు ఇచ్చిన హామీలకు గోరి కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం 6000 కోట్ల రూపాయలను పప్పు బెల్లం లాగా పంచి పెట్టాలని అనుకుంటున్నారు.
తెలంగాణ సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ కార్యకర్తలకు 6000 కోట్లు ఇవ్వడం యువ వికాసం కాదు తెలంగాణ వినాశనం. ఇప్పటికైనా ఢిల్లీకి మూటలు పంపే అలవాట్లు మానుకొని రైతుల ఆత్మహత్యల మీద దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం అందాల పోటీలు పెడుతుంది. ఆ విషయాన్ని కూడా బడ్జెట్లో చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ ను మేము వ్యతిరేకిస్తున్నాం.