Revanth Reddy & Congress’ False Propaganda Defeated By Maharashtra People: KTR

National Parties Are Not in a Position to Form State Governments

This Election Proves That the Coalition Era Will Continue

Congress Lost Strength to Stop BJP, Only Regional Forces Will Stop BJP

KTR Comments on Congress’ Defeat in Elections and Results in Maharashtra, Jharkhand

BRS Working President K.T. Rama Rao (KTR) stated that the people of Maharashtra have noticed the betrayal Congress with the people of Telangana in implementing the poll promises and rejected the Congress. Despite spending ₹300 crore of Telangana taxpayers’ money on false advertisements, the public in Maharashtra did not believe Congress’ lies.

KTR criticized Congress for its contradictory claims, pointing out that while it promised ₹3,000 in Maharashtra, it failed to deliver ₹2,500 to 1.6 crore women in Telangana. He remarked that the people of Maharashtra rejected these false promises and lies. He also advised Telangana chief minister Revanth Reddy to stop spreading false propaganda and focus on fulfilling the promises made to the people of Telangana.

KTR added that Congress’ promises in Maharashtra, which it failed to deliver in Telangana, exposed its double standards. Despite spending ₹300 crore of public money on advertisements, the people of Maharashtra were not deceived. He also pointed out the hypocrisy in Congress’ stance on Adani, labeling him a fraud in Maharashtra while maintaining business ties with him in Telangana.

Congress’ Decline in Maharashtra and Jharkhand

KTR highlighted that Congress faced complete rejection by the people in Maharashtra. In Jharkhand, Congress could not independently form a government and had to rely on the regional party JMM. He noted that this inability to independently form state governments demonstrates Congress’ diminishing political strength.

Rise of Regional Parties will continue – KTR

KTR emphasized that the future of Indian politics belongs to regional parties. He noted that the Maharashtra and Jharkhand election results reflect the growing dissatisfaction with national parties like BJP and Congress and highlight the importance of respecting regional aspirations.

He congratulated Hemant Soren of the JMM for his victory in Jharkhand, emphasizing that the growing prominence of regional forces is crucial for federalism and the development of states. He remarked that the election results in both Maharashtra and Jharkhand demonstrate that people will stand by regional forces when national parties attempt to suppress them.

KTR concluded by expressing optimism about the continued rise of strong regional leaders like KCR, who prioritize development and federalism. He stated that such leaders will play a significant role in shaping the future of the country while ensuring the growth and development of states.

Also Read-

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని మహారాష్ట్ర ప్రజలు గమనించారు- కేటీఆర్

తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మలేదు.

ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా…మహారాష్ట్రలో 3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ హామీలు అమలు చేశామంటూ మహారాష్ట్రలో చెప్పిన అబద్దాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్ధాలు, అసత్యాలు మాని ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలి

ఈ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలహీనమవుతుంది.

దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే శక్తి లేదు.

2024 లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైన సంకీర్ణశకం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.

ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ పార్టీ నేతలను అణిచివేసే కుట్ర చేస్తే ప్రజలు ఎలా అండగా ఉంటారో ఝార్ఖండ్ ప్రజలు చూపించారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఓటుతో బుద్ధి చెప్తామని ఝార్ఖండ్ ఓటర్లు తేల్చిచెప్పారు.

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం, ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్లకు అభినందనలు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు సాగలేదన్నారు.

మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ. 3000 రూపాయలు ఇస్తామని నయవంచన చేసే కుట్రను ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు.

తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. మీ ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, ఛాపర్లు అన్ని కూడా కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని విమర్శించారు. మహారాష్ట్రలోఅదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని కేటీఆర్ అన్నారు.ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే పని మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కి కేటీఆర్ సలహా ఇచ్చారు.

రానున్నది ప్రాంతీయ పార్టీల శకమే

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, ప్రాంతీయ ఆస్తిత్వాలను చులకనగా చూసిన బీజేపీ రెండు జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల నాటి నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని గుర్తు చేశారు. భవిష్యత్ లోనూ ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయమన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవని కేటీఆర్ చెప్పారు. జాతీయ పార్టీలకు అడ్డుగా నిలబడి రాష్ట్రాల అస్తిత్వం, అభివృద్ధి కోసం పోరాటం చేసే పార్టీలను వేధిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతామని జార్ఖండ్ ప్రజలు నిరూపించారన్నారు. హేమంత్ సోరెన్ ను వేధించిన కేంద్రానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. జార్ఖండ్ లో ఘన విజయం సాధించిన జార్ఖండ్ ముక్తి మోర్చా కు, ఆ పార్టీ అధ్యక్షులు హేమంత్ సోరెన్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ప్రాంతీయ పార్టీలతో అండతోనే మహారాష్ట్రలో బీజేపీ గెలు పు

మహారాష్ట్రలోనూ బీజేపీ గెలిచేందుకు ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ లే కీలకమయ్యారన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధి ఆ తీర్పు దోహదం చేస్తుందని చెప్పారు.

కాంగ్రెస్ చేతగాని తనంతోనే బీజేపీ పురోగతి

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీన పడుతుందని కేటీఆర్ చెప్పారు. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుంది అని భావించినప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రజల మనసులను ఆ పార్టీ గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేలిపోయిందన్నారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగానీ, అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతుందని చెప్పారు.

ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు…బీజేపీ తక్కువ కాదన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్లుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసిన ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు.

తెలంగాణ భవిష్యతు బి ఆర్ ఎస్ దే….మహారాష్ట్ర, జార్ఖండ్ రెండు రాష్ట్రాల ఎన్నికల పలితాలు రెండు జాతీయ పార్టీలపట్ల పెరుగుతున్న వ్యతిరేకత స్పష్టం చేశాయి, ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ప్రభుత్వాలను ఏర్పర్చలేవనే సత్యాన్ని చాటిచెప్పాయి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వేధిస్తున్న విషయం తీవ్రమైన ప్రభావం పలితాలలో కనిపించింది, బీజేపీ కి వ్యతిరేకంగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికి సమర్థవంతంగా ఉపయోగించుకోవడం లో కాంగ్రెస్ చతికిల పడింది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది, జార్ఖండ్ లో జేఎంఎం గెలుపు చారిత్రిక విజయం, హేమంత్ సోరెన్ ను అక్రమంగా అరెస్ట్ చేయడం, ఆదివాసి ల పట్ల జార్ఖండ్ తో పాటు ఛతీస్గడ్ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు గిరిజనులకు ఆగ్రహాన్ని తెప్పించాయి, జార్ఖండ్ అటవీ ప్రాంతాన్ని అదానీ, అంబానీ కి అప్పచెప్పడానికి , అత్యంత విలువైన మైనింగ్ గనుల కోసం ఆదివాసీలను అడవి నుండి గెంటేసే కుట్ర ను కొనసాగకుండా జేఎంఎం ను గెలుపించారు, ప్రజల ఆకాంక్షలను సరైన రీతిలో ఆవిష్కరించేది ప్రాంతీయ పార్టీలే నని పలితాలు రుజువు చేశాయి…దేవిప్రసాద్, మాజీ కార్పొరేషన్ చైర్మన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X