“తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు పాపాలకు పాపాల భైరవుడు కెసిఆరే కారణం”

హైదరాబాద్ : తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు, కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి, పంటల నిర్వహణను పట్టించుకోకపోవడం వంటి అన్ని పాపాలకు పాపాల భైరవుడు కెసిఆరే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గతంలో కెసిఆర్‌ చేసిన తప్పుల వల్లనే తెలంగాణ ప్రజలు, రైతులు ఇబ్బందిపడుతున్నారని విమర్శించారు. పంట నష్టానికి రూ.25 వేలు డిమాండ్‌ చేస్తున్న కెసిఆర్‌, ఆయన ప్రభుత్వ హయాంలో ఎంత నష్టంపరిహారం చెల్లించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్‌లోని మగ్ధూం భవన్‌లో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, పశ్మపద్మ, బాలనర్సింహాతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.

కరువు ,వరదల, నష్టం ప్రకృతిపైన ఆధారపడి ఉన్నదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ కరువు అని కెసిఆర్‌ చెబుతున్నారన్నారు. రూ.300ల కోట్లు రైతులకు ఇచ్చామని హరీశ్‌రావు చెబుతున్నారని, కానీ 10 శాతం కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2014 నుండి ఆ మూల, ఈ మూల తప్పితే నష్టపరిహారమే ఇవ్వలేదన్నారు. ‘తైబందీ’ విధానాన్నే కెసిఆర్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు.రైతాంగాన్ని, తెలంగాణను మోసం చేసిన చరిత్ర కెసిఆర్‌ది అని విమర్శించారు.

కెసిఆర్‌ పాలనలో 2014 నుండి 2018 వరకు పూర్తి స్థాయి కరువు ఉన్నదని, ఈ కాలంలో రూ.5వేల కోట్ల నుండి రూ.6 వేల కోట్ల వరకు పంట నష్టం జరిగిందని, 2017లో వరదలు అధిక వర్షాలతో 12లక్షల ఖరీఫ్‌ పంట, 5 లక్షల ఎకరాల రబీ పంట నష్టం జరిగిందని వివరించారు. 2023లో 12 లక్షల ఖరీఫ్‌, 5 లక్షల రబీ పంట నష్టం జరిగిందని, ప్రస్తుతం అన్ని రకాల పంటలకు 10 లక్షల ఎకరాలకు నష్టం జరిగిందని తెలిపారు.

జూన్‌ 1 నుండి సెప్టెంబర్‌ 30 వరకు కృష్ణా బేసిన్‌లో 1033 మిల్లీ మీటర్లు వర్షం పడిందని, జూరాల, శ్రీశైలం,చ నాగార్జన సాగర్‌కు పై నుండి చుక్కనీరు రాలేదని, వచ్చిన చుక్కనీరు కూడా రాయలసీమ లిప్ట్‌కు, లేదా పోతిరెడ్డి పాడుకు పోయాయని వివరించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్‌ అంశంలో బిఆర్‌ఎస్‌ పోరాటం చేయలేదని, ఆ సమయంలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి సిఎంగా ఉంటే, ప్రస్తుత బిఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ తర్వా త రాయలసీమ ఎత్తిపోతలను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, తద్వారా ప్రస్తుతం కృష్ణా బేసిన్‌ ఎండిపోవడానికి ప్రధాన కారణమన విమర్శించారు.

నిరుపయోగంగా కేంద్ర నిధులు

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులలో రాష్ట్ర వాటా కింద మ్యాచింగ్‌ ఫండ్స్‌ను చెల్లించపోవడంతో కేంద్ర కేటాయింపులను కూడా గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉపయోగించలేదని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. 2021- రూ.449 కోట్లు , 2022- రూ.472 కోట్లు , 2023- రూ.495 కోట్లు, 2024 521 కోట్లు, 2024 రూ. 546 కోట్లు , మొత్తం కేంద్రం నుండి రావాల్సిన మొత్తం రూ. 2483 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ ఫండ్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.150 కోట్లు, 157 కోట్లు, 165 , రూ. 173,.రూ.182 కోట్లు మొత్తాన్ని చెల్లించలేదన్నారు. ఫలితంగా కేంద్ర నిధులను ఉపయోగించలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను ఉపయోగించునేలా రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ ఫండ్స్‌ను చెల్లించి, ఆ నిధులను వాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కోరారు. పది లక్ష ల ఎకరాలకు ముందుగా ప్రతి ఎకరాకూ రూ.10వేల చొప్పన తక్షణమే విడుదల చేయాలని కోరారు.

‘తైబందీ’ని పట్టించుకోని కెసిఆర్‌

ఉన్న నీటిని లెక్కవేసి, వాటిని సాగు, వ్యవసాయ రంగాలకు షిఫ్ట్‌ పద్ధతిలో పంపిణీ చేసేలా ‘తై బందీ’ విధానాన్ని కెసిఆర్‌ మర్చిపోయారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. నవంబర్‌లో కొద్ది కొద్ది నీటిని రైతులు వాడుకున్నారని,ఖమ్మం, పాలేరు, వైరా లాంటి ప్రాంతాల్లో రైతులు నీటి కోసం రొడ్డెక్కితే, అప్పటికీ మిగిలిన నీటిని ఆ రైతులకు వదిలేశారని వివరించారు. ఇది ఎవరి పాపమని ప్రశ్నించారు.నీటి నిర్వహణ కాంగ్రెస్‌తో కావడం లేదని, తనతో గొప్పగా అవుతుందని చెబుతున్న కెసిఆర్‌, గతంలోనే తైబందీ నిర్వహణ చేసి ఉంటే, ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదా అని నిలదీశారు.

యాసంగి పంట నిర్వహణ పంటల విధానాన్ని ఎవరు పట్టించుకోలేదని, యాసంగిలో నీటి తక్కువగా ఉంటుందని, తద్వారా ఆరు తడి పంటల వైపు వెళ్లాలని, కానీ వరి పంటకే నీరు ఎక్కువగా వదిలారని, వరి ధాన్యగారం మోజులో గత ప్రభుత్వం చిన్న పంటలను వదిలేసిందని, తద్వారా విదేశాల నుండి పప్పులను దిగుమితి చేసుకునే దుస్థితికి వచ్చామని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు 30 లక్షల టన్నులు కూరగాయాలు అవసరమతే, 20లక్షల టన్నులు మాత్రమే పంటలు పండుతున్నాయన్నారు. యాసంగి పంటల విధానాన్ని రూపకలప్పన చేయకపోవడం కెసిఆర పాపం అని అన్నారు.

నాడు సిపిఐ ఎంఎల్‌ఎను తీసుకెళ్లలేదా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కోసం జాతీయ పార్టీల్లో మొట్టమొదటి సారి పోరాటం చేసిన పార్టీ సిపిఐ అని, అటువంటి సిపిఐకి చెందిన ఎంఎల్‌ఎను గత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తీసుకెళ్లిందని కూనంనేని సాంబశివ రావు ప్రశ్నించారు. మునుగోడులో బిఆర్‌ఎస్‌కు సహాయం చేస్తే ఆ పార్టీకి కనీసం కృతజ్ఞత ఉండాలి కదా? అని మండిపడ్డారు. ఫిరాయింపులపై ఇప్పుడు కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు. పాపాల ఊబిలో పడిన కెసిఆర్‌ను పైకి లేపేందుకు ఎవ్వరూ లేరన్నారు.

డబ్బు, సెంటిమెంట్‌ ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు పనిచేయడం లేదిన, ఆ పార్టీకి కార్యకర్తలు లేకపోగా ఏ సామాజిక వర్గ అండ కూడా లేదని విమర్శించారు. అధికారం కోల్పయిన తర్వాత ఆయా రాజకీయ పార్టీలు కనీసం తమ స్థాయిలో కూడా నిలబడలేవన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించడం లేదని, తక్షణమే రాజీనామా చేయాలనే చట్టం ఉండాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పరిపూష్టి చేయాలని కోరారు.

పోటీపై నిర్ణయం జాతీయ పార్టీకి అప్పగింత

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై సిపిఐ జాతీయ నాయకత్వానికి అప్పగించామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కాళేశ్వరం, కృష్ణా బేసిన్‌ పంటలు దెబ్బతినేందుకు పాపం కెసిఆర్‌ దేనని మండిపడ్డారు. పంటల బీమా పథకం నుండి గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బయటకికివస్తే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో చేరిందన్నారు.

ఎన్‌డిఎకు 270 సీట్లు రాడమే కష్టం : సయ్యద్‌ అజీజ్‌ పాషా

రాజ్యసభ మాజీ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా ఇండియా కూటమికి దేశ వ్యాప్తంగా మంచి సానుకూల వాతావరణం నెలకొన్నదన్నారు. నాలుగువందలకుపైగా స్థానాలు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్న ఎన్‌డిఎ కూటమికి కనీసం 270 స్థానాలు కూడా రావడం కష్టసాధ్యమేనని వ్యాఖ్యానించారు. ‘ఇండియా’ కూటమి ఐక్యతగా వెళ్తే మరింత మంచి ఫలతాలు వస్తాయని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని, జార్ఖండ్‌ మాజీ సిఎంను జైల్లో పెట్టడంతో సానుభూతి ఉన్నదన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సిఎఎ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. గుజరాత్‌, హర్యానా , ఢిల్లీలో దాదాపూ పూర్తి స్థానాలు దక్కించుకున్న బిజెపి, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న స్థానాలను ఎలా దక్కించుకుంటుందన్నారు. పశ్చిమ భారతంలో మహారాష్ట్రలో ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ పార్టీలపై సానుభూతి నెలకొన్నదని, ఇవన్నీ చేస్తుంటే అబ్‌కీ బార్‌ 400 పార్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

కెసిఆర్‌వి ముసలి కన్నీరు : చాడ

చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నాయని కెసిఆర్‌ ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. 2014లో కెసిఆర్‌ సిఎం అయినా తర్వాత 2015లో రైతుల ఆత్మహత్యల పంరంపర జరిగితే, ఆయన కనీసం పరామర్శిచంలేదని విమర్శించారు.రైతుఆత్మహత్యల నివారణపై రైతు, వామపక్షాలు, ఆందోళన చేపట్టాయని, బస్సు యాత్ర నిర్వహించిన విషయాన్ని గుర్తుకు చేశారు.

కరువు సహాయక చర్యల్లో భాగంగా రైతులకు రూ.25వేలే కాదని ఎంత ఇచ్చిన రైతులకు తక్కువేనని, కానీ సిఎం గా ఉన్నప్పుడు రైతులకు కెసిఆర్‌ ఎంత ఇచ్చారని నిలదీశారు. సిపిఐ చేసిన పోరాట ఫలితంగా ఏర్పడిన మిడ్‌ మానేరులో నీళ్లు ఉండడంతోనే పూర్తిగా నీటి నిల్వకు అవకాశం ఉన్నదన్నారు. పాలకులు స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలకు, కరువుకు సంబంధించి నివారణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉండేదన్నారు. ఫార్టీ ఫిరాయింపులకు బారులు తెరిచిందే కెసిఆర్‌ అని అన్నారు. ఫిరాయింపుల చట్టం విష కోరలు లేని నాగు లాగా ఉన్నదని ఎద్దేవా చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X