కిషన్ రెడ్డికి లండన్‌లో సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం

  • అట్టహాసంగా ‘మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • తొమ్మిదేళ్లలో మోదీ సర్కారు చేసిన కార్యక్రమాలను వివరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

లండన్: న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డికి.. ఘన స్వాగతం లభించింది.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ – యూకే విభాగం ఆధ్వర్యంలో విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఢోల్ వాద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, ఆరతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని దీపప్రజ్వలనతో కేంద్రమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను, ఈ సందర్భంగా భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను వివరించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను పూర్తిచేయడం, విదేశాల్లో వారికి సరైన గౌరవం లభించేలా మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్‌లెన్స్’ విద్యార్థులైన యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం అధ్యక్షుడు శ్రీ కుల్‌దీప్ షెకావత్, ప్రధానకార్యదర్శి శ్రీ సురేశ్ మంగళగిరి, OFBJP-UK సభ్యులు, భారత సంతతికి చెందిన పలువురు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న పలు ముఖ్యమైన రైళ్లు

  • తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా.. పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లను పూర్తిచేయాలన్న కిషన్ రెడ్డి సూచనకు అంగీకరించిన రైల్వే మంత్రిత్వ శాఖ
  • రైళ్ల స్టాప్‌‌లు, రైళ్ల వివరాల వెల్లడి- త్వరలోనే అమలుకానున్న మార్పులు

న్యూఢిల్లీ: సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్ల ను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై.. కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేసిన సూచనకు.. రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది.

తనకు వచ్చిన డిమాండ్లపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కొంతకాలం క్రితం రైల్వేమంత్రి శ్రీ అశ్విణి వైష్ణవ్ ను కలిసి వివరించారు. ఆయా స్టేషన్లలో.. వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్.. తాజాగా ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ.. ఆయా రైల్వేస్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లు అధికారికంగాప్రకటించారు.

తెలంగాణలో.. బెల్లంపల్లి, సిర్పూర్-కాగజ్‌నగర్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో… ఆంధ్రపదేశ్‌లో.. పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X