हैदराबाद: समाज में किस पर विश्वास करें या नहीं, मुश्किल होता जा रहा है। साथ ही असली और नकली चीज की पहचान कर पाना भी कठिन होता जा रहा है। इसी का सहारा लेकर कुछ लोग पैसे कमाने के लिए नए-नए तरीके अपना रहे हैं। ये लोग पैसे के लिए कुछ भी कर रहे हैं।
इसी क्रम में निर्मल जिले में कुछ बदमाशों ने एक कुत्ते को मार डाला और उसे हिरण का मांस बताकर महंगे दाम पर बेच दिया। पालतू कुत्ते को मारे जाने की घटना से से हड़कंप मच गया।
विलंब से मिली जानकारी के अनुसार, लक्ष्मणचंदा मंडल केंद्र के एक घर में पालतू कुत्ते को दो बदमाशों ने चुराकर ले गये। इसके बाद बेरहमी से उसकी हत्या कर दी और उसे हिरण का मांस बताकर स्थानीय लोगों को महंगे दामों पर बेच दिया।
इसी बीच उसी गांव निवासी आनंद ने स्थानीय थाने में शिकायत दर्ज कराई कि किसी ने उसका पालतू कुत्ता चुरा लिया है। इस मामले की जांच में जुटी पुलिस ने आसपास लगे सीसीटीवी फुटेजों को खंगाला और कुत्ते को ले जाने वाले बदमाशों की पहचान की।
पोट्टपल्ली (के) गांव निवासी युवक श्रीनिवास और चामनपल्ली गांव निवासी वरुण ने मिलकर कुत्ते को चुराकर ले गए। जब पुलिस ने दोनों को हिरासत में लिया और कुत्ते के ठिकाने के बारे में पूछा तो सच्चाई का खुलासा हुआ। बदमाशों ने बताया कि कुत्ते को मारकर हिरण के मांस क बताकर महंगे दाम पर बेच दिया।
पुलिस ने दोनों आरोपियों के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है। इस बीच कुत्ते के मांस को हिरण का मांस समझकर खरीदने/खाने वाले अपनी स्थिति को लेकर चिंतित हैं। यह जानकर वे परेशान है कि उन्होंने कुत्ते का मांस खाया है। वे निकटतम अस्पतालों में कूच कर रहे हैं।
కుక్కను చంపి జింక మాంసం అంటూ అమ్మకం, తిన్న వాళ్ళు ఆస్పత్రులకు పరుగులు
హైదరాబాద్: సమాజంలో ఎవరిని నమ్మాలో ఏది నిజమో తెలియటం లేదు. డబ్బుల కోసం జనాలను కొత్త కొత్త పద్ధతుల్లో బురిడీ కొట్టిస్తున్నారు. జనాల నుంచి డబ్బులు గుంజెందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అయితే నిర్మల్ జిల్లాలో ఓ ఇద్దరు ప్రబుద్ధులు ఓ కుక్కను చంపి దాన్ని జింక మాంసం అంటూ విక్రయించారు. అది కూడా ఓ పెంపుడు కుక్కను చంపేయటం ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది.
లక్ష్మణచందా మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను దొంగిలించిన ఇద్దరు దుండగులు అతి క్రూరంగా దాన్ని చంపేసి విలువైన జింక మాంసం అంటూ మాయమాటలు చెప్పి స్థానికులకు ఎక్కువ ధరకు అమ్మేశారు.
అయితే ఈ ఘటన ఎలా వెలుగు చూసిందంటే అదే గ్రామానికి చెందిన ఆనంద్ వ్యక్తి తన పెంపుడు కుక్కను ఎవరో దొంగిలించారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాలను గమనించారు. దీంతో కుక్కను ఎత్తుకెళ్లిన వాళ్లను పోలీసులు గుర్తించారు.
పొట్టపెల్లి (కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో పాటు చామన్‌పల్లి గ్రామానికి చెందిన వరుణ్ ఇద్దరు యువకులు కుక్కను ఎత్తుకెళ్లారు. వీళ్లిద్దరిని పట్టుకుని కుక్క ఎక్కడా అని ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టారు. కుక్కను చంపేసి జింక మాంసం పేరుతో అమ్మేసినట్టు వెల్లడించారు.
దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే జింక మాంసం అని చెప్పగానే నమ్మి కుక్క మాంసం కొన్న వారు తమ పరిస్థితేంటని ఆందోళన చెందుతున్నారు. కుక్క మాంసం తిన్నమాని తెలియటంతోనే తిన్నవాళ్లంతా దగ్గర్లోని ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. (ఏజెన్సీలు)