हैदराबाद : तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) के पेपर लीक मामले में एक अहम घटनाक्रम सामने आया है। पेपर लीक मामले में ईडी मैदान में उतरी है। मुख्य आरोपी प्रवीण और राजशेखर रेड्डी के बयान दर्ज करने के लिए नामपल्ली कोर्ट में याचिका करके अनुमति मांगी गई।
ग्रुप वन प्रीलिम्स का पेपर पहले ही लेकर विदेशों से आकर परीक्षा लिखी गई। ईडी इन आरोपों की जांच कर दी है। इस बीच, टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने ईडी से शिकायत की कि इस मामले में करोड़ों रुपये की हेराफेरी की गई। ईडी को शक है कि इस मामले में मनी लॉन्ड्रिंग हुई है। साथ ही, ईडी ने शंकर लक्ष्मी पर ध्यान केंद्रित किया, जिन्हें एसआईटी गवाह के रूप में नामित किया गया।
संदेह है कि प्रश्नपत्र उसके कंप्यूटर से लीक हुआ था, जो गोपनीय खंड का संरक्षक है। ईडी ने टीएसपीएससी के शंकर लक्ष्मी और सत्यनारायण को नोटिस जारी किया है। ईडी ने नोटिस में कहा कि वह बुधवार और गुरुवार को सुनवाई में हाजिर हों।
दूसरी ओर एसआईटी अधिकारी मंगलवार को पेपर लीक मामले की रिपोर्ट सील्ड कवर में तेलंगाना हाईकोर्ट को सौंपेगी रिपोर्ट में क्या है, इसे लेकर संस्पेंस बना हुआ है।
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం, ఈడీ రంగంలోకి దిగింది
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖల చేశారు.
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్‌ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగలపై ఈ డి విచారణ ప్రారంభించింది. కాగా ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. కాగా ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే సిట్ సాక్షిగా పేర్కొన్న శంకర్ లక్ష్మిపై ఈడి ప్రధాన దృష్టి సారించింది.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. శంకర్ లక్ష్మి తో పాటు టీఎస్పీఎస్సీ కి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఈడి పేర్కొంది.
మరోవైపు పేపర్ లీక్ కేసు నివేదికను మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించనున్న సిట్ అధికారులు. ఆ నివేదికలో ఏముందనేది సస్పెన్స్ ఉంది. (ఏజెన్సీలు)