47 బిలియన్ కోట్ల పెట్టుబడులు… 30 లక్షల ఉద్యోగాలు (More News From BRS)

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన

పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో పెట్టుబడులు

గ్రామస్థాయి కార్యకర్తను గుర్తించి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్

కష్టపడి పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో బిక్షపతియే నిదర్శనం

ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కవిత

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మఠం బిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుడైన బిక్షపతికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ…. కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి బిక్షపతి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన బిక్షపతిని గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పెద్ద మెజారిటీతో గెలిపించడానికి బిక్షపతి చేయుత, పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. కాబట్టి పరిశ్రమల శాఖలోని ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ముఖ్యమైనదని స్పష్టం చేశారు.

ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని, ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని బిక్షపతికి కవిత సూచించారు.


కాంగ్రెస్ పార్టీ అంటూ అధికారంలోకి వస్తే కోతలు…వాతలే

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటూ అధికారంలోకి వస్తే కోతలు…వాతలే నని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండానే బుడ్డర్ ఖాన్,పేపర్ పులి నోటి నుండి బహిర్గతం అయ్యాయని ఆయన చెప్పారు.ఎనిమిది గంటల విద్యుత్ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండాలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటూ పిసిసి నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాసపురం రైతువేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్ పి టి సి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి కన్వినర్ కట్టా సతీష్ స్థానిక సర్పంచ్ రమ్యా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్ సరఫరా అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదని ఆయన తేల్చిచెప్పారు. అదీ నిజమే అయినప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు పరచడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు. ఛత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కేవలం ఏడూ గంటలు మాత్రమే నన్నారు.పైగా అక్కడి ప్రభుత్వం విద్యుత్ ను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వ్యవసాయానికి మూడు గంటల నుండి ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా అనేది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఎజెండాయో నని ఆయన తెలిపారు. ఆ ఎజెండాయో బుడ్డర్ ఖాన్ నోటి నుండి బయటకు వచ్చిందన్నారు.అదే పార్టీకీ చెందిన పేపర్ పులి నోటినుండి ఉచిత విద్యుత్ కొన సాగిస్తామని అయితే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని అన్న మాటలు కుడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రూపొందించుకున్న రహస్య ఎజెండాలోనేవే నన్నారు.

అదే నిజం అయితే ఫించన్ లను మళ్ళీ 200 లకు కుదించి కళ్యాణలక్ష్మీ/షాది ముబారక్ లకు మంగళం పాడి రైతు బంధు ,రైతు బీమా పధకాలు ఎత్తివేసినట్లే నని ఆయన ప్రజలను హెచ్చరించారు.బూతులతో బుడ్డర్ ఖాన్ తాను మాట్లాడిన మాటలను కప్పి పుచ్చుకుంటూ అబద్దాలు చెబుతున్నారన్నారు.అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టె కుట్రలకు కాంగ్రెస్ పార్టీ తెర లేపిందని ఆయన ఆరోపించారు. జరుగుతున్న అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని ఆయన చెప్పారు.


హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా వేద ర‌జ‌ని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం.. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మఠం బిక్షపతి కి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

——————–

వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే హెచ్చరించాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి

పోలీసు అధికారులతో పాటు రెస్క్యూ టీమ్స్ ని సిద్ధం చేసుకోవాలి

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

సమస్యలు వుంటే వెంటనే ప్రజా ప్రతినిధులు అధికారులను సంప్రదించాలి

వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లను పెట్టండి

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే ఖాళీ చేయించండి

మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఐదు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సిపి, ఎస్పీ లతో టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశా నిర్దేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో గత 24 గంటలల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఐదు జిల్లాల ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సిపి, ఎస్పీ, ఇతర అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త చార్యలను ఆ జిల్లాల కలెక్టర్లు మంత్రులు ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి, ఇతర ప్రజా ప్రతినిధులకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్, ఆరంజ్ అలెర్ట్ వుందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వెంటనే అధికారులకు తెలియచేయాలని, అలాగే తగిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను ఎమ్మేల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ సమయంలో ఏ సమస్య వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండి సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్ల లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X