హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేసినారు.


మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి తన రాజీనామాను ఆమోదించాలని కల్వకుంట్ల కవిత కోరినారు. తాను అందుబాటులో లేను అని రేపు మరోసారి ఫోన్ లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు చెప్పినారు.
Also Read-
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందజేసిన తెలంగాణ జాగృతి నాయకులు.. లేఖను తీసుకొని రిసీవ్డ్ కాపీ అందజేసిన భవన్ సెక్రటరీ.
