హైదరాబాద్ : కాలేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డి ఎస్ ఏ) ఐచ్చిన నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై జలసాధన సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.
నీళ్లు, నిధులు నియామకాలపైనే తెలంగాణ ఉద్యమం జరిగి రాష్ట్రం ఏర్పాటు అయిందని, కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అవినీతియే లక్ష్యంగా పాలన జరిగిందన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా విధ్వంసం చేశారని విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన అవినీతి పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు.
Also Read-
ఇరిగేషన్ మంత్రితో పాటు ముఖ్యమంత్రి వద్దకు నిపుణులను తీసుకెళ్లి చేపట్టాల్సిన చర్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి విజయ రామారావు, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్, ఇంజనీరింగ్ నిపుణులు హాజరయ్యారు.
