हैदराबाद : धूप की आग में तेलंगाना जल रहा है। भीषण गर्मी से लोग तिलमिल रहे है। ऐसे लग रहा है कि मानो आकाश से सूरज आग उगल रहा है या अग्नि के गोले गिर रहे हैं। तेलंगाना में शनिवार को 46.8 डिग्री तापमान के साथ रिकॉर्ड दर्ज किया है। जगित्याला और करीमनगर जिलों में अधिकतम तापमान 46.8 डिग्री दर्ज किया गया। इसके साथ ही नलगोंडा, नारायणपेट, निज़ामाबाद, मंचिरयाला और पेद्दापल्ली जिलों में तापमान 46 डिग्री दर्ज किया गया।

सुबह 10 बजे से ही चिलचिलाती धूप में लोग बाहर निकलने से डर रहे हैं। आईएमडी ने चेतावनी दी है कि ऐसे हालात 6 मई तक रह सकते हैं। हैदराबाद आईएमडी ने तेलंगाना में भयंकर गर्म हवाएं जारी रहने की चेतावनी जारी की है। 10 जिलों में ऑरेंज अलर्ट जारी है। धूप की तीव्रता अधिक होने के कारण लोगों को सतर्क रहने की सलाह दी गयी है. मौसम विभाग ने चेतावनी दी है कि जब तक जरूरी न हो घरों से बाहर न निकलें।
संबंधित खबर-
నిప్పుల కుంపటి, జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు టెంపరేచర్ నమోదు
హైదరాబాద్ : తెలంగాణ మండిపోయింది. సూర్యుడు భగభగతో అల్లాడిపోయారు జనం. ఆకాశం నుంచి ఎండ కాస్తుందా లేక నిప్పులు పడుతున్నాయా అన్నట్లు వణికిపోయారు. 46.8 డిగ్రీలు ఉష్ణోగ్రతతో తెలంగాణ రాష్ట్రం రికార్డులు బద్దలు కొట్టింది. 2024, మే 4వ తేదీ శనివారం జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా 46.8 డిగ్రీలు టెంపరేచర్ నమోదు అయ్యింది. అందుకు ఏ మాత్రం తీసిపోకుండా నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యింది.
ఉదయం 10 గంటల నుంచే మండే ఎండలతో జనం బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఇలాంటి పరిస్థితులు మే 6 వరకు కొనసాగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. ఎండల తీవ్రత ఎక్కవ ఉండటంతో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీ ప్రజల నెత్తిన మరో బాంబు పేల్చింది విపత్తుల నిర్వహణ సంస్థ
అసలే మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజల నెత్తిన మరో బాంబు పేల్చింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆదివారం (మే 5వ తేదీ) 30మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 247మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. సోమవారం ( మే 6వ తేదీ )15మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 69మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తరు వరకు 247మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.

ఇదిలా ఉండగా శనివారం భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5 డిగ్రీలు, కడప జిల్లా కాలసపాడులో 46.4డిగ్రీలు, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు.ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు.
వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయకూడదని సూచించారు.
ఊటీలో ఎండలు
ఊటీలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. అక్కడ ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29న 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 1న కూడా సాధారణ ఉష్ణోగ్రత కంటే 5.1 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. ఇది 1986 ఏప్రిల్ 29 న 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని.. మళ్లీ 38 ఏళ్ల తర్వాత 29 డిగ్రీల టెంపరేచర్ నమోదు కావడంతో ఆ రికార్డ్ బద్దలయ్యిందని అధికారులు వెల్లడించారు.

మరో వైపు ఏపీలో ఆదివారం (మే 5వ తేదీ) 30మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 247మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరన శాఖ తెలిపింది. సోమవారం ( మే 6వ తేదీ )15మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 69మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తరు వరకు 247మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. (ఏజెన్సీలు)