हैदराबाद: इंडियन प्रीमियर लीग 2023 के फाइनल मैच नहीं खेला जा सका। मैच को लेकर चल रही सारी हलचल पर अब विराम लग गया है। अहमदाबाद में बारिश रुक रुक कर हो रही है। भारी बारिश की वजह से नहीं खेला जा सका अब इसे कल यानी 29 मई सोमवार को रिजर्व डे में खेला जाएगा।

आज टॉस भी नहीं कराया जा सका। मैच रेफरी जवागल श्रीनाथ ने दोनों टीम के कप्तान और कोच से मैदान पर मिलकर इस बात की जानकारी दी।
खबरें आ रही है कि फाइनल मैच को लेकर करोड़ों का सट्टा लगा है। आईपीएल की शुरुआत के बाद से पुलिस ने हैदराबाद के तीनों कमिश्नरेट में कई सट्टेबाजी गिरोहों को गिरफ्तार किया है। इस सीजन में अब तक रु. 4.4 करोड़ कैश जब्त किया गया। 54 लोगों को गिरफ्तार किया गया। बड़ी संख्या में मोबाइल फोन और लैपटॉप जब्त किए गए हैं। नगर पुलिस ने चेतावनी दी है कि इस संदर्भ में सट्टेबाजी करने पर सख्त कार्रवाई की जाएगी।
अगर कल भी बारिश के कारण मैच रद्द होता है तो लीग चरण में जीत के आधार पर विजेता का फैसला किया जाएगा। मौजूदा चैंपियन गुजरात टाइटंस, जो 10 जीत के साथ तालिका में शीर्ष पर है, को विजेता घोषित किया जाएगा। इसके साथ ही दूसरे नंबर पर मौजूद सीएसके को उपविजेता से संतोष करना होगा।

హైదరాబాద్: ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు వరణుడు కోలుకోలేని షాకిచ్చాడు. గత నాలుగు గంటలుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మొదట వరుణుడు అభిమానులతో దాగుడు మూతలు ఆడాడనే చెప్పుకోవాలి. 9:10 నిమిషాల సమయంలో వర్షం ఆగిపోగా మైదాన సిబ్బంది కవర్లను తొలగించారు. కాసేపు ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉందని గుర్తించారు.
దీంతో అరగంట సమయం పట్టొచ్చని మరోసారి పిచ్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆపై ఆట కొనసాగాలే సిబ్బంది కృషి చేస్తుండగా వర్షం మళ్లీ మొదలైంది. అలా మొదలైన వర్షం చివరకు ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేశారు.
ఒకవేళ రేపు కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో విజయాలు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు. దాంతో, రెండో స్థానంలో ఉన్న సీఎస్కే రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పలు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 4.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 54 మంది అరెస్ట్ చేశారు. భారీగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. (ఏజెన్సీలు)