“పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం”

-కేసీఆర్ నియంత పాలనను వ్యతిరేకించేవాళ్లంతా బీజేపీలోకి రావాలని కోరుకుంటున్నాం

-బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యమున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే

-ఈటల సహా బీజేపీలో అందరి లక్ష్యం ఒక్కటే…

-వాళ్లు పొంగులేటిని కలిస్తే తప్పేముంది?

-బీజేపీ శక్తివంతమైన పార్టీ

-రాష్ట్ర ప్రజలంతా బీజేపీపట్ల నమ్మకంతో ఉన్నారు

-జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం

-మండుటెండలో సమ్మె చేస్తున్నా మానవత్వం లేదా?

-సమ్మె చేయడానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గం

-జేపీఎస్ లకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటాం

-జేపీఎస్ లను సస్పెండ్ చేస్తే మీపక్షాన మేం రోడ్డెక్కుతాం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టీకరణ

హైదరాబాద్ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పాలనను వ్యతిరేకించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునేవాళ్లంతా బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ తో విబేధాలున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు.

‘‘మీడియా ఎన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నలేసినా, ఎన్ని విబేధాలు స్రుష్టించాలనుకున్నా నెరవేరదు. మేమంతా ఒక్కటే. మా అందరి లక్ష్యం ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని స్థాపించడమే మా ధ్యేయం’’అని పునరుద్ఘాటించారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ సహా పార్టీ నేతలు ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

కరీంనగర్ లో గత 7 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులు మండుటెండలో గొడుగులు పెట్టుకుని సమ్మె చేస్తున్న సమాచారం అందుకున్న బండి సంజయ్ హుటాహుటిన వారి వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. వారితో కలిసి కొద్దిసేపు కూర్చున్నారు.

• ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సహా కొందరు నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలుస్తున్నారనే సమాచారం మీకుందా?మీలో విబేధాలున్నట్లు వార్తలొస్తున్నాయి… దీనిపై మీరేమంటారు? అని అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ…‘‘ సమాచారం ఇవ్వాలని ఏముంది? నా ఫోన్ మిస్ అయిన విషయం మీకు తెలుసు కదా… అయినా మా అందరి లక్ష్యం ఒక్కటే. మాలో విబేధాల్లేవు. అందరం కలిసి కట్టుగా ఉంటాం. నాకు కొందరు తెలిసినోళ్లు ఉంటారు. వాళ్లు కూడా తెలిసిన లీడర్ల వద్దకు వెళ్లి కలుస్తారు. అందులో తప్పేముంది? అన్నీ నేనొక్కడినే చేయాలి. ముందుకుసాగాలనేది మంచి పద్దతి కాదు కదా’’అని అన్నారు.

• కరీంనగర్ నుండి కూడా చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తున్నారట కదా… ఆపరేషన్ జరుగుతోందట కదా అని అడిగిన ప్రశ్నకు ‘‘ఎవరో రావాలని బీజేపీ ఎదురు చూడటం లేదు. బీజేపీ శక్తివంతమైన పార్టీ. ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. బీఆర్ఎస్ ను అడ్డుకునే దమ్ము ధైర్యమున్న పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టే మాకు అండగా ఉంటున్నరు. రాబోయేది బీజేపీ రామరాజ్యమే‘‘అని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని, కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్లంతా మళ్లీ వెళ్లేది బీజేపీలోకేనని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనపట్ల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాలు నచ్చి బీజేపీలో చేరాలనుకునే వారిని ఆహ్వానిస్తామని చెప్పారు.
‘‘
• అంతకుముందు జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సమ్మెకు బండి సంజయ్ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వీళ్ల సమ్మె పూర్తిగా న్యాయబద్దమైనది. గ్రామాల అభివ్రుద్ధిలో, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్ర కీలకం. రాష్ట్రానికి అనేక అవార్డులు రావడం వెనుక వీరి శ్రమ ఉంది‘‘అని అన్నారు.

• ‘‘నావల్లనే అవార్డులు వస్తున్నాయని జబ్బలు కొట్టుకొంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వాస ఘాతకుడు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి చదివిస్తే కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరితే ప్రొబేషనరీ పేరుతో 4 ఏళ్లు జాప్యం చేయడం దుర్మార్గం. అసెంబ్లీ వేదికగా జూనియర్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయం. కార్యదర్శులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో చాలామంది కార్యదర్శులు చనిపోయారు. అట్లాంటి వాళ్లను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు? న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కార్యదర్శులను ఎందుకు పట్టించుకోవడం లేదు? సీఎం మొండి వైఖరివల్లే ఈ దుస్థితి‘‘అని దుయ్యబట్టారు.

• ‘‘జూనియర్ కార్యదర్శులు ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఫక్తు టీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చేసే పోలీస్ ఆయన. ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తుంటే అనుమతి ఇవ్వడానికి ఆయనకున్న అభ్యంతరం ఏంది? అనుమతి అడిగితే జూనియర్ కార్యదర్శులను బెదిరిస్తున్నారు. వీళ్లను చూడండి. మండుటెండలో సమ్మె చేస్తుంటే కనీసం మానవత్వం లేదా? సమ్మె హక్కుని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తావ్? కుటుంబాలను వదిలి వెట్టి చాకిరి చేస్తున్న కార్యదర్శుల బాధలను కనీసం పట్టించుకోకుండా బెదిరించడం దుర్మార్గం’’అని మండిపడ్డారు.

• ‘‘ఇప్పటికైనా సీఎం మొండి వైఖరికి పోకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి. జూనియర్ కార్యదర్శులకు బీజేపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం వాళ్లను సస్పెండ్ చేస్తే వాళ్ల తరపున బీజేపీ ఉద్యమిస్తుంది. మేం రోడ్లపైకి వస్తే కేసీఆర్ కు చుక్కలు చూపిస్తాం’’అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X