हैदराबाद : भारत और श्रीलंका के बीच तीन मैचों की टी20 सीरीज़ का पहला मैच शनिवार को खेला जाएगा। टीम इंडिया श्रीलंका दौरे पर टी20 और वनडे सीरीज़ खेलने के लिए मौजूद है। इस दौरे के ज़रिए टीम इंडिया के सीनियर खिलाड़ी मैदान पर वापस लौटेंगे।
हालांकि, इस सीरीज़ से पहले भारतीय तेज़ गेंदबाज़ मोहम्मद सिराज चोटिल हो गए। सिराज को अभ्यास के दौरान पैर में चोट लगी हाय अब तक सिराज को लेकर कोई जानकारी सामने नहीं आई है कि वह टी20 सीरीज़ के पहले मुकाबले में खेलेंगे या नहीं।
बता दें भारत और श्रीलंका के बीच खेला जाने वाला पहला टी20 मुकाबला की शुरुआत शाम 7 बजे से होगी। मैच पल्लेकेले के पल्लेकेले इंटरनेशनल स्टेडियम में खेला जाएगा। टी20 सीरीज़ के तीनों ही मैच पल्लेकेले इंटरनेशनल स्टेडियम में ही होंग।
यह भी पढ़ें-
भारत और श्रीलंका के बीच अब तक 29 टी20 इंटरनेशनल मुकाबले खेले जा चुके हैं। इन मैचों में टीम इंडिया ने 19 में जीत दर्ज की, जबकि श्रीलंका सिर्फ 9 जीत ही अपने नाम कर सकी है। वहीं दोनों के बीच एक मुकाबला बेनतीजा रहा है।
इससे पहले भारत और श्रीलंका के बीच टी20 सीरीज़ जनवरी 2023 में खेली गई थी। इस सीरीज़ में भारत ने 2-1 से जीत अपने नाम की थी। हालांकि तब भारत ने सीरीज़ घरेलू सरज़मीं पर खेली थी। वहीं इस बार की सीरीज़ श्रीलंका में खेली जाएगी। (एजेंसियां)
భారత VS శ్రీలంక : నేడు శ్రీలంకతో తొలి టీ20
హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమ్ ఇండియా తొలిసారిగా ఓ టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. వరల్డ్ చాంపియన్ హోదాలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు ఆడబోతున్నది. ఈ సిరీస్‌తోనే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బాధ్యతలు చేపట్టబోతుండటం మరో ప్రత్యేకత. హెడ్ కోచ్‌గా గంభీర్, కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు ఈ సిరీస్ తొలి పరీక్ష కానుంది. మరి, వాళ్లిద్దరు తమ ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తారో చూడాలి.
Also Read-
తొలి టీ20కి తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై సందిగ్ధం నెలకొంది. వికెట్ కీపర్ స్థానానికి రిషబ్ పంత్, సంజూ శాంసన్ పోటీలో ఉన్నారు. శాంసన్‌కు అవకాశాలు రావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే, శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే చాన్స్ ఉంది. పంత్ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, 5వ స్థానం కోసం రింకు సింగ్, శివమ్ దూబె, రియాన్ పరాగ్ మధ్య పోటీ నెలకొంది. టీమ్ మేనేజ్‌మెంట్ రింకూకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అక్షర్ పటేల్‌తోపాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే చాన్స్ ఉంది. సుందర్‌ను పక్కనపెడితే పేస్ ఆల్‌రౌండర్ కోటాలో దూబెను తీసుకోవచ్చు.
ఇటీవల జింబాబ్వే పర్యటనలో రియాన్ పరాగ్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్‌లో సిరాజ్ కాలుకి గాయమైంది. తొలి టీ20కి అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. అతను దూరమైతే ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్‌లలో ఒక్కరికి చోటు దక్కొచ్చు. శ్రీలంక స్టార్ బౌలర్లు నువాన్ తుషారా, దుష్మంత చమీరా సిరీస్‌కు దూరమవడం ఆ జట్టుకు భారీ లోటే.
శ్రీలంక జట్టు నిలకడలేమి సమస్య ఎదుర్కొంటుంది. ఓపెనర్ నిశాంక, కెప్టెన్ అసలంక, కామిందు మెండిస్, కుసాల్ మెండిస్ జట్టు బ్యాటింగ్ దళంలో కీలకంగా ఉన్నారు. ఆల్‌రౌండర్ హసరంగ బ్యాటుతో, బంతితో కీలక పాత్ర పోషించే అవకావం ఉంది. ఇక, పేస్ సంచలనం పతిరణ భారత బ్యాటర్లకు సవాల్ విసిరొచ్చు. అతనిలా సత్తాచాటే మరో పేసర్ లేకపోవడం శ్రీలంకకు ప్రతికూలంశమే.
టీ20ల్లో శ్రీలంకపై టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇరు జట్లు 29సార్లు తలపడితే.. భారత్ 19 మ్యాచ్‌లు నెగ్గింది. శ్రీలంక 9 మ్యాచ్‌ల్లో గెలుపొందగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో ఐదింట భారత్ నెగ్గగా.. శ్రీలంక రెండు మ్యాచ్‌లను తన ఖాతాలో వేసుకుంది.
పల్లెకెల్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 185. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది. ఈ స్టేడియంలో 23 టీ20లు జరగగా అందులో 8 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. చేజింగ్ జట్టు 12 సందర్భాల్లో నెగ్గింది. (ఏజెన్సీలు)