T20 : टीम इंडिया की अच्छी शुरुआत, कप्तान सूर्यकुमार का आक्रामक अर्धशतक, श्रीलंका 43 रनों से पराजित

हैदराबाद : श्रीलंका दौरे पर टीम इंडिया की शुरुआत अच्छी रही है. कप्तान सूर्यकुमार यादव (58) के आक्रामक अर्धशतक के बाद गेंदबाजों के शानदार प्रदर्शन से शनिवार को यहां पहले टी20 अंतरराष्ट्रीय में श्रीलंका को 43 रन से हराकर तीन मैचों की सीरीज में 1-0 से बढ़त हासिल कर ली है. सूर्यकुमार और ऊपरी क्रम के बल्लेबाजों की बदौलत भारत ने सात विकेट पर 213 रन का विशाल स्कोर खड़ा किया.

इस बड़े लक्ष्य का पीछा करने उतरी श्रीलंकाई टीम को दोनों ओपनर बल्लेबाजों ने अच्छी शुरूआत दिलाई. लेकिन इसके बावजूद टीम 19.2 ओवर में 170 रन पर सिमट गई. टीम के लिए सलामी बल्लेबाज पाथुम निसांका ने 79 रन की अर्धशतकीय पारी खेली. निसांका (48 गेंद, सात चौके, चार छक्के) ने पहले विकेट के लिए कुसल मेंडिस (45 रन) ने 84 रन की साझेदारी बनाई. फिर उन्होंने कुसल परेरा के साथ दूसरे विकेट के लिए 56 रन के बीच साझेदारी देखने को मिली. पर भारतीय गेंदबाजों ने लगातार झटके देकर प्रतिद्वंद्वी टीम को पूरे ओवर नहीं खेलने दिये.

भारत को पहली सफलता अर्शदीप सिंह ने नौवें ओवर में मेंडिस को आउट करके दिलाई. इसके बाद अक्षर पटेल ने 38 रन देकर निसांका और परेरा के विकेट झटके. वही रियान पराग ने 1.2 ओवर में महज पांच रन देकर तीन विकेट हसिल किये जबकि रवि बिश्नोई और मोहम्मद सिराज को भी एक–एक विकेट मिला.

संबंधित खबर-

इससे पहले सलामी बल्लेबाज यशस्वी जायसवाल (40 रन) और शुभमन गिल (34 रन) के अच्छी शुरूआत करने के बाद सूर्यकुमार (26 गेंद, आठ चौके, दो छक्के) और विकेटकीपर बल्लेबाज ऋषभ पंत (49 रन) ने तीसरे विकेट के लिए 76 रन की साझेदारी से भारत को मजबूत स्कोर तक पहुंचाया.भारत की टी20 कप्तान के कप्तान बनाये जाने के बाद सूर्यकुमार ने अपने पहले मैच में 26 गेंद की पारी में आठ चौके और दो छक्के जड़े. इस दौरान उन्होंने अपना 20वां अर्धशतक जमाया.

पंत (33 गेंद, छह चौके, एक छक्का) को शुरू में थोड़ी परेशानी हुई, लेकिन इसके बाद वह अपने अर्धशतक के करीब पहुंचे लेकिन एक रन से चूक गये.बल्लेबाजी का न्योता मिलने के बाद जायसवाल और शुभमन गिल (16 गेंद, छह चौके, एक छक्का) ने पहले विकेट के लिए 74 रन की भागीदारी निभाकर अच्छे स्कोर की नींव रखी. श्रीलंका के लिए मथीशा पाथिराना ने चार विकेट जबकि मदुशंका, असिथा फर्नांडो और हसारंगा ने एक एक विकेट लिये. (एजेंसियां)

తొలి టీ20లో శ్రీలంక చిత్తు

హైదరాబాద్ : శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. తొలి టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన భారత జట్టు టీ20 సిరీస్‌ను ఘనంగా మొదలుపెట్టింది. శనివారం పల్లెకెల్ వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకను 43 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 213/7 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్(58) కెప్టెన్సీకి ఇన్నింగ్స్‌కుతోడు పంత్(49), జైశ్వాల్(40), గిల్(34) సత్తాచాటారు. అనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 స్కోరుకే ఆలౌటైంది. ఓపెనర్లు నిశాంక(79), కుసాల్ మెండిస్(45)అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు.

బ్యాటర్లు భారీ స్కోరు అందిస్తే.. బౌలర్లు తమ పాత్ర నిర్వర్తించారు. భారత బౌలింగ్‌లో విలవిలలాడిన లంక జట్టు 19.2 ఓవర్లలో ఆలౌటైంది. అయితే, శ్రీలంక జట్టుకు దక్కిన ఆరంభం మాత్రం భారత జట్టును ఆందోళన పెట్టిందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు నిశాంక(79), కుసాల్ మెండిస్(45) జట్టుకు మెరుపు ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు వీరు 84 పరుగులు జోడించారు. మెండిస్ అవుటైనా క్రీజులో పాతుకపోయిన నిశాంక జట్టును పోటీలో ఉంచాడు. ఒక దశలో 14 ఓవర్లలో శ్రీలంక 140/1తో మెరుగైన స్థితిలో నిలిచింది.

ఆలస్యంగా పుంజుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత లంక జట్టును బెంబేలెత్తించారు. అక్షర్ 15వ ఓవర్‌లో నిశాంక దూకుడుకు బ్రేక్ వేయడంతోపాటు కుసాల్ పెరీరా(20)ను అవుట్ చేయడంతో ఆ జట్టు పతనం మొదలైంది. ఆ తర్వాత కెప్టెన్ అసలంక(0), షనక(0), హసరంగ(2) నిరాశపర్చడంతో ప్రత్యర్థి ఓటమి ఖాయమైంది. ఆఖరి ఓవర్ వేసిన రియాన్ పరాగ్ ఆ ఓవర్‌లో, తీక్షణ(2), మధుశంక(0)లను అవుట్ చేయడంతో శ్రీలంక ఆట ముగిసింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్, అక్షర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, రవి బిష్ణోయ్‌లకు చెరో వికెట్ దక్కింది.

అంతకుముందు భారత టాపార్డర్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ ఈ దూకుడుకు శ్రీకారం చుట్టారు. వీరు ఎడాపెడా బౌండరీలు బాదడంతో జట్టుకు అదిరిపోయే ఆరంభం దక్కింది. పవర్ ప్లేలో వీరు ఏ బౌలర్‌ను వదలకుండా చితక్కొట్టడంతో 5.5 ఓవర్లలోనే భారత్ 74/0 స్కోరుతో నిలిచింది. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. 6వ ఓవర్‌లో ఆఖరి బంతికి గిల్(34) క్యాచ్ అవుటవ్వగా ఆ తర్వాతి ఓవర్‌లో తొలి బంతికే జైశ్వాల్(40) వెనుదిరిగాడు.

జైశ్వాల్, గిల్‌లను అవుట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎంతో సేపు లేదు. కెప్టెన్ సూర్యకుమార్ బౌలర్లపై పిడుగల్లే పడ్డాడు. అతనికి పంత్ సహకరించాడు. మధుశంక బౌలింగ్‌లో వరుసగా 6, 4,4 కొట్టి ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టిన సూర్య క్రీజులో ఉన్నంత సేపు బాదేశాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే అతను తన 20వ టీ20 హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. సూర్య బాదుడుతో భారత్ 13.1 ఓవర్లలోనే 150 పరుగులతో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది.

ఆ తర్వాత కాసేపటికే సూర్య(58) వెనుదిరగగా అప్పటివరకు నిదానంగా ఆడిన పంత్ గేర్ మార్చాడు. మరోవైపు, పతిరణ వరుస వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. పాండ్యా(9), రియాన్ పరాగ్(7), రింకు సింగ్(1) నిరాశపర్చగా మరో ఎండ్‌లో పంత్ మాత్రం బౌండరీలు కొట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన పంత్(49) కూడా పతిరణ బౌలింగ్‌లోనే అవుటవ్వగా అప్పటికే స్కోరు 200 దాటింది. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4 వికెట్లతో సత్తాచాటగా హసరంగ, మధుశంకలకు చెరో వికెట్ దక్కింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X