స్వాతంత్రం పొందటమే కాదు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే
ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

హైదరాబాద్ : భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని విడుదల చేశారు. ఎందరో మహోన్నత వ్యక్తుల పోరాటం, త్యాగాలు, పట్టుదల ఫలితంగానే ఈ రోజు మనం స్వాతంత్ర్యంగా జీవిస్తుమన్నారు.
భారత స్వాతంత్ర పోరాటం కుల, మత, వర్గాలన్నింటికీ అతీతంగా జాతి యావత్తును ఒక్క తాటిపై నిలిపిందన్నారు. మనను బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందేలా చేసేందుకు ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని చెప్పారు. వారి పోరా టం కారణంగానే మనమంతా స్వపరిపాలనతో ఆత్మగౌరవంగా జీవిస్తున్నామన్నారు.

అలుపెరగని పోరాటంతో స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వాన్ని అందించిన మహానీయులను నిత్యం స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. ఆ పోరాటాన్ని, త్యాగాలను పట్టుదలను స్మరించుకుంటూ జాతి ఆశలను కొనసాగించాలని కోరారు. స్వాతంత్ర్యం పొందటమే కాదు… దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు.
Also Read-