సమ్మెకు అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజి వైస్ ఛాన్సలర్ ప్రొ కే. సీతారామ రావు మద్దతు
ఓపెన్ యూనివర్సిటీలో కొనసాగుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల నిరవధిక సమ్మె
హైదరాబాద్ : యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరుతూ వినూత్నరూపంలో డా బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని కాంట్రాక్టు అధ్యాపకులు సమర్పించారు. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజి వైస్ ఛాన్సలర్ ప్రొ కే. సీతారామ రావు మద్దతు ప్రకటించి కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ క్రమబద్దీకరణను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కోరారు.
యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం కొనసాగింది. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘము అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు.
క్రమబద్దీకరణ ప్రకియ చేపట్టేలోపు యూజీసీ పే స్కేల్ (బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3 శాతం ఇంక్రిమెంట్) ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘము సలహాదారులు డా.కె నర్సింలు, డా. కాసం విజయ్, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డా. మఖ్ధూం మొహియుద్దీన్, డా. నాగిళ్ల రామకృష్ణ, కాంట్రాక్టు అధ్యాపకులు డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, డా.విజయ ఉషశ్రీ , డా. సిద్ధాంతి అరుణ, నర్సయ్య భట్టు, డా. కురుమేటి దయాకర్, బి. రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Also Read-
Strike Of Contract Teachers. Petition submitted to Dr B R Ambedkar statue
Former Vice Chancellor of Ambedkar Open University Prof K Seetharama Rao supports
Hyderabad : In an innovative move, contract teachers at Ambedkar Open University presented a petition to the statue of Constitution maker and Bharat Ratna Dr B R Ambedkar, demanding regularization of contract teachers working in universities. Former Vice Chancellor of Ambedkar Open University Prof K Seetharama Rao expressed support and urged the government to immediately take up the fair demand of contract teachers and regularize them.
The indefinite strike launched by contract assistant professors at Ambedkar Open University continued on Thursday, demanding regularization of contract teachers in universities, as per the call given by the State Joint Action Committee. Ambedkar Open University Contract Teachers Association President Dr. K. Avinash, General Secretary Dr. M. Kishore said that the state government should respond positively and regularize the contract teachers working in the universities.
They asked the government to provide job security by giving UGC pay scale (basic, DA, HRA, 3 percent increment) before the regularization process is undertaken. Open University Contract Teachers Association Advisors Dr. K. Narsimlu, Dr. Kasam Vijay, Joint Secretary Dr. P. Radhakrishna, Treasurer Dr. Y. Kumar, Executive Committee Members Dr. Makhdhoom Mohiuddin, Dr. Nagilla Ramakrishna, Contract Teachers Dr. Padala Lakshman, Dr. Sunil Kumar, Dr. Vijaya Ushasri, Dr. Siddhanthi Aruna, Narsayyya Bhattu, Dr. Kurumeti Dayakar, B. Raja Goud and others participated.
