‘सागर-सोर’ का लोकार्पण समारोह संपन्न

हैदराबाद : बुधवार को तेलंगाना सारस्वत परिषद, हैदराबाद के भव्य प्रेक्षागृह में विख्यात सहस्रावधानी पद्मश्री डॉ. गरिकिपाटि नरसिम्हाराव की तेलुगु विश्वकाव्य ‘सागर-घोषा’ के हिंदी अनुवाद ‘सागर-सोर’ का लोकार्पण समारोह संपन्न हुआ। इस कार्यक्रम की अध्यक्ष डॉ. अहिल्या मिश्र ने की।

इस अवसर पर मूल रचनाकार पद्मश्री डॉ. गरिकिपाटि नरसिम्हाराव, प्रोफेर ऋषभदेव शर्मा, अनुवादकद्वय डॉ. टी.सी. वसंता और डॉ. आर. सुमनलता, विशिष्ट अतिथि डॉ. एम. रंगय्या, डॉ. मुरलीकृष्णा, डॉ. सुरभि दत्, डॉ. सी. कामेश्वरी तथा अन्य विद्वान उपस्थित थे।

सहस्रावधानी पद्मश्री डॉ. गरिकिपाटि नरसिम्हाराव की सहजता भी उतनी ही मोहक है जितनी उनकी विद्वत्ता। इस अवसर पर दोनों अनुवादकों का किरीट और वस्त्राभूषण से सम्मान किया गया।

‘సాగర్-సోర్’ విమోచన

హైదరాబాద్ : ప్రముఖ సహస్రావధాని పద్మశ్రీ డా.గరికిపాటి నరసింహారావు రచించిన తెలుగు మహాకావ్యం ‘సాగర్-ఘోష’ హిందీ అనువాదం ‘సాగర్-సోర్’ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లోని గ్రాండ్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు డాక్టర్ అహల్యా మిశ్రా.

ఈ సందర్భంగా మూల సృష్టికర్త పద్మశ్రీ డా.గరికిపాటి నరసింహారావు, ప్రొ.రిషభదేవ్ శర్మ, డా.టి.సి. వసంత మరియు డాక్టర్ ఆర్. సుమనలత, విశిష్ట అతిథులు డా.ఎం. రంగయ్య, డా. మురళీకృష్ణ, డా. సుర్భి దత్, డా. సి. కామేశ్వరి తదితర పండితులు పాల్గొన్నారు.

సహస్రావధాని పద్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు పాండిత్యం ఎంత మనోహరమైనది. అనువాదకులిద్దరినీ ఆయన కిరీట్ మరియు వస్త్రభూషణ్ తో సత్కరించారు.

నళిని ఎర్ర గారి అనుభవం

బుధవారం నాడు సాయంత్రం చాలా అద్భుతంగా గడిచింది. సుమన్ లత రుద్రావఝ్ఝల గారి ఆహ్వానం మేరకు వారి పుస్తకావిష్కరణ సభకు వెళ్ళాను. అక్కడికెళ్ళాక తెలిసింది అది తెలుగు వారు నిర్వహిస్తున్న హిందీ సాహిత్య సభ అని. నిజంగా చాలా ఆనందం కలిగింది.

ఏం పుస్తకం అంటారా?

పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహరావుగారు రచించిన విశ్వకావ్యం సాగరఘోష ను మన తెలుగింటి ఆడపడుచులు శ్రీమతి టి సి వసంతగారు మరియుశ్రీమతి రుద్రావఝ్ఝల సుమన్ లతగారు సంయుక్తంగా హిందీలోకి అనువదించారు.

పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాదులోని తెలంగాణా సారస్వత పరిషద్ హాలులో శ్రీగరికపాటి నరసింహారావుగారి చేతులమీదుగా జరిగింది.

కార్యక్రమానికి ప్రముఖ హిందీ రచయిత్రులు శ్రీమతి అహల్యా మిశ్రాగారు, మరియు సురభిదత్ గారు,
దక్షిణభారత హిందీ ప్రచారసభ పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ రిషభ్ శర్మగారు, ప్రముఖ తెలుగు హిందీ అనువాదకులు M రంగయ్యగారు, అతిథులుగా, శ్రీ కస్తూరి మురళీకృష్ణగారు గౌరవ అతిధులుగా విచ్చేసారు.

పద్యరూపంలో ఉన్న కావ్యాన్ని అనువదించడం చాలా కష్టంతో కూడుకున్నదని వక్తలందరూ అభిప్రాయపడ్డారు.

T.C. వసంతగారు: మనకందరికీ సుపరిచితులైన శ్రీమతి సమ్మెట ఉమాదేవిగారి రేలాపూల పుస్తకాన్ని,
శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవలను, మరియు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మిగారి నవలను, హిందీలోకి అనువదించారని తెలిసింది. ఎంత చక్కగా హిందీలో సంభాషించారో నాకు చాలా నచ్చింద

రుద్రావఝ్ఝుల సుమన్ లతగారు: చాలా అమాయకంగా, ప్రేమగా నా కథలకు కామెంట్ పెడుతుంటే తెగ సంబరపడిపోతూ అందరిలాగే ఒక స్నేహితురాలని భావించాను.

కానీ మొదటిసారి బుక్స్ ఎగ్జిబిషన్ లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో సుమన్ లత గారి గురించి విన్నప్పుడు
కొంత గిల్టీగా, ఎంతో ఆనందించడమే కాకుండా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇంత గొప్ప వ్యక్తి నాకు స్నేహితురాలు కదా అని.

అన్నమయ్య కీర్తనలను హిందీలోకి తర్జుమా చేసారట, అలాగే విష్ణు సహస్రనామాలకు హిందీలో తాత్పర్యం రాసారు. అంతేకాదు తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు , తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు హిందీ వ్యాఖ్యాతగా ఉండేవారట.

విశాఖపట్టణంలోని కాలేజీలో వారి తల్లిదండ్రులు మరియు అత్తమామల పేరు మీద పతకాలను, నగదు బహుమతులను గత 30 సంవత్సరాలుగా ఇస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వారి భర్త స్మృతి గా
బంగారు పతకాన్ని ఈసంవత్సరంనుండి ఆయన శిష్యులతో కలిసి విద్యార్థులకు ఇస్తున్నారు. సన్నగా నాజుకుగా ఉండే ఈవిడ కంఠం మటుకు ఖంగుమని మ్రోగింది.

కార్యక్రమ వ్యాఖ్యాతగా శ్రీమతి చుండూరు కామేశ్వరి గారు వారి మధురమైన కంఠంతో చక్కని సరళమైన పదాలతో ఎంతో శ్రావ్యంగా ప్రేక్షకులను అలరించారు. గరికపాటి వారు సతీసమేతంగా వసంత గారిని మరియు సుమన్ లత గారిని శాలువాలతో, పట్టుచీరలతో, బంగారు ఉంగరాలతో సత్కరించడం ఎంతో ముదావహం.

రచయిత్రులిరువురు కూడా గరికపాటి గారి దంపతులను సన్మానించారు. గరికపాటి వారు కంచుకంఠంతో చదివిన కావ్యంలోని పద్యాలను ప్రేక్షకులు విని ఆనందించారు. అందరూ తెలుగువారే నిర్వహించిన హిందీసాహిత్య సభ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ధన్యవాదాలు సుమన్ లతగారు ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X