HYDRA : हैदराबाद आपदा प्रतिक्रिया और संपत्ति निगरानी और सुरक्षा, करेगी यह कार्य

हैदराबाद: सीएम रेवंत रेड्डी ने अधिकारियों को हैदराबाद आपदा प्रतिक्रिया और संपत्ति निगरानी और संरक्षण (HYDRA) को एक मजबूत प्रणाली बनाने का निर्देश दिया है। इसके लिए प्रक्रियाएं बनाने का सुझाव दिया गया है। सरकार ने ग्रेटर हैदराबाद के भीतर सरकारी संपत्तियों की सुरक्षा के लिए हाइड्रा की स्थापना की है। पूर्ववर्ती प्रवर्तन, सतर्कता और आपदा प्रबंधन विभाग का नाम बदलकर हाइड्रा कर दिया गया है और प्रमुख जिम्मेदारियां सौंपी गई हैं। शुक्रवार को सीएम रेवंत ने सचिवालय में वरिष्ठ अधिकारियों के साथ समीक्षा बैठक की। इस मौके पर उन्होंने अधिकारियों को निर्देश दिये कि हाइड्रा विभाग की कार्यप्रणाली कैसी होनी चाहिए। उन्होंने कहा, “हम ग्रेटर हैदराबाद के भीतर सरकारी भूमि, तालाबों और नहरों की सुरक्षा और अवैध निर्माणों को रोकने के लिए हाइड्रा की स्थापना कर रहे हैं।”

रेवंत ने सुझाव दिया कि तदनुसार, प्रवर्तन, सतर्कता और आपदा प्रबंधन विभाग को पुनर्गठित किया जाना चाहिए। हाइड्रा का दायरा प्राकृतिक आपदाओं के दौरान राहत और पुनर्वास गतिविधियों तक ही सीमित नहीं होना चाहिए बल्कि सरकारी संपत्तियों की सुरक्षा भी होनी चाहिए। हाइड्रा को ओआरआर तक आपदा प्रबंधन के साथ-साथ सार्वजनिक भूमि, तालाबों और नहरों के रखरखाव की जिम्मेदारी सौंपी जानी चाहिए। कहीं भी अतिक्रमण की शिकायत मिले तो अतिक्रमण हटाने का अधिकार होना चाहिए। यदि नियमों का पालन किए बिना फ्लेक्सी एवं होर्डिंग्स लगाए गए हैं तो उन्हें हटाया जाए, यातायात प्रबंधन, पेयजल एवं विद्युत आपूर्ति की भी जिम्मेदारी सौंपी जाए। हाइड्रा को बढ़ते शहर की जरूरतों के अनुरूप लोगों को व्यापक सेवाएं प्रदान करने के लिए डिजाइन किया जाना चाहिए। उन्होंने कहा कि यह विंग आपदा प्रबंधन अधिनियम के तहत काम करेगी। हाइड्रा को जीएचएमसी, एचएमडीए, जल बोर्ड, सतर्कता, यातायात, बिजली और पुलिस विभागों के साथ समन्वय में काम करना चाहिए।

सीएम रेवंत ने अधिकारियों को निर्देश दिया कि हाइड्रा विभाग कैसे काम करेगा, इसके लिए प्रस्ताव तैयार करें। नये विभाग में किस स्तर के अधिकारी हों? कितने स्टाफ की आवश्यकता है? किन-किन विभागों से प्रतिनियुक्ति पर अधिकारी लिये जायें? पर स्पष्ट प्रस्ताव तैयार करें हाइड्रा को ओआरआर तक जीएचएमसी के साथ मिलकर 2 हजार वर्ग किलोमीटर क्षेत्र में काम करना होगा। कार्य के विभाजन को सक्षम करने के लिए शहर में मौजूदा क्षेत्रों की तर्ज पर डिवीजनों की स्थापना की जानी चाहिए। यदि आवश्यक हो तो हाइड्रा को विशेष धनराशि आवंटित करने के मुद्दे पर भी विचार किया जाना चाहिए। विधानसभा की बैठकों के दौरान एक मसौदा तैयार किया जाना चाहिए। उन्होंने कहा कि जीएचएमसी के तहत अनाधिकृत होर्डिंग, फ्लेक्सी हटाने और जुर्माना वसूलने की जिम्मेदारी भी हाइड्रा को सौंपी जानी चाहिए। नहरों, तालाबों और सरकारी स्थानों पर अतिक्रमण करने पर सख्त कार्रवाई की जाए। बैठक में सीएस शांतिकुमारी, नगर निगम प्रशासन के प्रधान सचिव दानकिशोर, जीएचएमसी आयुक्त आम्रपाली, जीएचएमसी ईवीडीएम आयुक्त रंगनाथ, सीएमओ के प्रधान सचिव शेषाद्रि और सीएम के विशेष सचिव अजित रेड्डी ने भाग लिया।

यह भी पढ़ें-

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)

హైదరాబాద్ : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న ఎన్​ఫోర్స్​మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై శుక్రవారం సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా విభాగం విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్​పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘అందుకు అనుగుణంగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్​మెంట్​విభాగాన్ని పునర్‌‌‌‌ వ్యవస్థీకరించాలి. కేవలం ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ, పునరావాస చర్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే విధంగా హైడ్రా పరిధి ఉండాలి. ఓఆర్ఆర్​వరకు విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలను హైడ్రాకే అప్పగించాలి. ఎక్కడైనా కబ్జాలు జరిగినట్టు ఫిర్యాదు వస్తే ఆక్రమణలు తొలిగించే అధికారం ఉండాలి. నిబంధనలు పాటించకుండా ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడితే తొలగించడం, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్​సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసే బాధ్యతలనూ అప్పగించాలి. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలి” అని రేవంత్​ సూచించారు. ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ పరిధిలోనే పని చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పని చేయాలని.. అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధివిధానాలు ఉండాలని సూచించారు.

హైడ్రా విభాగం ఎలా పని చేస్తుందనే దానిపై ప్రపోజల్స్ తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ‘‘కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులు ఉండాలి? ఎంత మంది సిబ్బంది అవసరం? ఏయే విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్​పై తీసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన ప్రపోజల్స్ రెడీ చేయండి. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుంది. పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో డివిజన్లు ఏర్పాటు చేయాలి. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలి” అని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, జరిమానాల వసూలు బాధ్యత కూడా హైడ్రాకు బదలాయించాలని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X