Hyderabad : విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాందీ

హైదరాబాద్ : 8వ తేదీన హైదరాబాద్ లో జరిగే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు ఏఐసీసీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాందీ విచేస్తున్న తరుణంలో సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు గురువారం నాడు గాంధీ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది.

టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, నిరంజన్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, హైదరాబాద్ సీనియర్ నాయకులు అనిల్ యాదవ్, సమీర్ ఉల్లా, ghmc ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్, నీలిమ, మెట్టు సాయి కుమార్, నిజాం, ఫిరోజ్ ఖాన్, నూతి శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

టీపీసీసీ నాయకుల బృందం సరూర్ నగర్ స్టేడియం సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా శ్రీకాంత చారి విగ్రహం వద్ద నేతలు సమావేశమయ్యి అక్కడ నుంచి సరూర్ నగర్ స్టేడియం కు వెళ్లారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి తదితర నాయకుల బృందం వెళ్లారు.

ఈనెల 8 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియం లో నిర్వహించే నిరుద్యోగ నిరసన సభ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి గారు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఆత్మహత్య యత్నం చేసిన కౌలు రైతును పరామర్శించిన కాంగ్రెస్ కిసాన్ సెల్ బృందం

మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న మధిర నియోజకవర్గం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కౌల్ రైతు చెక్కల లక్ష్మయ్య ను టిపిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకట అన్వేష్ రెడ్డి గారు,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారి సతీమణి అమ్మా ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి మల్లు నందిని విక్రమార్క గారు, టీపీసీసీ సభ్యులు వడ్డే నారాయణ రావు,కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు దాసరి దానియేలు, చింతకాని మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు కొప్పుల గోవింద రావు బృందం ఖమ్మం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నందు పరామర్శించి ఆయన ఆరోగ్యం గురుంచి డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు.

ఆత్మహత్య యత్నానికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు, 6 ఎకరాలు పొలం కౌలు కి తీసుకొని మొత్తం మొక్కజొన్న పంట సాగుచేయగా గత నెలలో వచ్చిన వడగండ్ల వాన గాలి దుమరానికి పంట మొత్తం నాసినం అయినది ముఖ్యమంత్రి ఇస్తా అన్న ఎకరానికి 10 వేల నష్ట పరిహారం కూడా అందలేదు, చేత్తోకొచ్చిన మొక్కజొన్న పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోయి న అని, కౌలు పెట్టుబడి అధికం కావడం తో ఎలా ఈ అప్పులు తీర్చాలని మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అని వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ బృందానికి తెలియజేశారు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మీలాంటి వారు సమస్యల పరిష్కారం కోసమే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు అని రైతులు ఎవరూ అధైర్య పడొద్దు అని వారికి ధైర్యం చెప్పారు.

లక్ష్మయ్య ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి ప్రభుత్వమే కారణం. కౌలు రైతులకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. లక్ష్మయ్య బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X