हैदराबाद: तेलंगाना में विभिन्न सड़क हादसों में तीन लोगों की मौत हो गई, जबकि नौ लोग गंभीर रूप से घायल हो गये है।
मिली जानकारी के अनुसार, मेडचल जिले के कीसरा आउटर रिंग रोड पर रविवार को एक भीषण सड़क हादसा हो गया। इस दुर्घटना में दो लोगों की मौत हो गई और आठ अन्य गंभीर रूप से घायल हो गए।
घाटकेसर की ओर से आ रही एपी 09 बीयू 0990 बेंज कार नियंत्रण खोकर ओआरआर सर्कल के पास डिवाइडर से टकराकर मीरपेट की ओर से आ रही टीएस 05 यूसी 4666 टाटा विस्टा से टकरा गई।
इस हादसे में दो की मौके पर ही मौत हो गई और आठ अन्य गंभीर रूप से घायल हो गए। सूचना मिलने पर मौके पर पहुंची पुलिस ने मामला दर्ज कर लिया है और जांच कर रही है। मृतकों का विवरण अभी पता नहीं चल पाया है।
दूसरी ओर मुनगाल मंडल के मुकुंदापुरम गांव के पास राष्ट्रीय राजमार्ग 65 के पास रविवार को सड़क हादसे में एक व्यक्ति की मौत हो गई, जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। बाइक पर जा रहे गनी (65) को पीछे से तेज रफ्तार कार ने टक्कर मार दी। हादसे में गनी की मौके पर ही मौत हो गई। उसका साथी लतीफ गंभीर रूप से घायल हो गया। पुलिस मामले की छानबीन कर रही है।
కీసర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
మేడ్చల్ జిల్లా కీసర అవుటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
ఓఆర్‌ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్‌కేసర్ నుంచి వస్తున్న ఏపీ 09 బీయూ 0990 బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్‌పేట్ నుంచి వస్తున్న టీఎస్ 05 యూసీ 4666 అనే నెంబర్ గల టాటా విస్టా ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ఎనిమిది మంది కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు 65వ జాతీయ రహదారిపై మంగల్ మండలం ముకుందాపురం గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న గని (65)ని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గని అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సహచరుడు లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)