హైదరాబాద్ : బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రదేశ్ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్, తెలంగాణ హిందీ జర్నలిస్టు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హిందీ దివాస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.
కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రభుత్వ సలహాదారు హార్కర్ వేణుగోపాల్ రావు, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డాక్టర్ చిన్నా రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతు రావు, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, తాహెర్, రాజేష్ కుమార్ అగర్వాల్, సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతూ 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని దేశ అధికార భాషగా ప్రకటించిందని గుర్తుచేశారు. హిందీ భాష దేశ సమగ్రతకు బలమైన పునాదిగా నిలిచిందని తెలిపారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు కోట్లాది భారతీయులను కలిపే వంతెనగా హిందీ భాష నిలిచిందన్నారు. మన దేశం అనేక భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన విశాల గంగోత్రి అని పేర్కొన్నారు.
ఇది కూడ చదవండి-
గ్లోబలైజేషన్ ప్రభావంతో ఇంగ్లీష్ ప్రాధాన్యం పెరిగినా, హిందీ తన స్థానాన్ని కోల్పోలేదు. “దేశ భాషలందు తెలుగులెస్స” అన్న నానుడిని ఉటంకిస్తూ, తెలుగు తో పాటు హిందీ నేర్చుకోవడం, మాట్లాడడం, దాని వాడకాన్ని పెంపొందించడం ద్వారా జాతీయ ఐక్యతకు తోడ్పడాలి. భాషలు, మాండలికాలకు వారధిగా నిలిచేది హిందీ భాషే. తెలంగాణ లౌకికవాదానికి పెట్టింది పేరని.. అభివృద్ది , సంక్షేమం పరంగా దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు.
आपका तहेदिल से आभार
पुरस्कार प्राप्ति के बाद अरविंद यादव ने सोशल मीडिया में किये गये एक पोस्ट में लिखा है कि जिस शख़्सियत ने मुझे पत्रकारिता का पहला अवसर दिया और जिस अख़बार से मेरे पत्रकार-जीवन की शुरुआत हुई, उसी के मुख्य संपादक स्वर्गीय विनय वीर जी के नाम पर स्थापित पुरस्कार पाना मेरे लिए आनंद और गर्व का विषय है। हिंदी दिवस पर विनय वीर स्मारक पुरस्कार प्राप्त करना मेरी खुशी को दोगुना कर गया। 1996 से 2002 तक मैंने हिंदी मिलाप के लिए कार्य किया- रिपोर्टिंग, संपादन से लेकर मुख्य पृष्ठ तैयार करने तक की जिम्मेदारी निभाई। मात्र बाईस वर्ष की उम्र में पहले पन्ने की खबरें और लेआउट तय करने जैसी महत्वपूर्ण जिम्मेदारी पाना, मेरे जीवन की सबसे बड़ी उपलब्धियों में से एक है। विनय वीर जी को विनम्र श्रद्धांजलि। ‘हिंदी मिलाप’ की पूरी टीम को मेरा नमन। तेलंगाना के सभी हिंदी पत्रकारों को हार्दिक शुभकामनाएं। विपमा वीर जी का तहेदिल से आभार।
