‘हिडमा का आखिरी पत्र’ सोशल मीडिया में वायरल, जानें क्या है उसमें खास बातें

हैदराबाद/विजयवाडा: हैदराबाद/विजयवाड़ा: माओवादी नेता हिडमा की मुठभेड़ में एक और अहम मोड़ सामने आया है। सोशल मीडिया पर ‘हिडमा का आखिरी पत्र’ शीर्षक से एक पत्र वायरल हो रहा है। आंध्र प्रदेश पुलिस अधिकारियों ने कहा कि उन्हें इस पत्र की जानकारी नहीं है। वायरल पत्र में हिडमा ने कहा है कि वह पुलिस के सामने आत्मसमर्पण करना चाहता है। खबर है कि हिडमा ने बस्तर के एक पत्रकार को पत्र लिखकर अपने विचारों और फैसलों के बारे में बताया है। ऐसी खबरें हैं कि उसने 10 नवंबर को पत्रकार को पत्र लिखा है।

हिडमा के प्रचार हो रहे पत्र में हिडमा ने कहा, “मैं हथियार छोड़ने के बारे में सोच रहा हूँ। मैं आंध्र प्रदेश आना चाहता हूँ। मुझे समिति से बात करनी है और तय करना है कि मैं कहाँ आत्मसमर्पण करूँगा। अगर पुलिस हमारी सुरक्षा की गारंटी देती है, तो मैं आत्मसमर्पण करने के लिए तैयार हूँ। हम जल्द ही हिंदी के साथ-साथ तेलुगु में भी एक ऑडियो संदेश भेजेंगे। हथियार डालने से पहले हमें कुछ मुद्दों पर चर्चा करनी होगी। आत्मसमर्पण करने वाले माओवादी नेता सोनू और सतीश अवसरवादी हैं। हम दीर्घकालिक जनयुद्ध के पथ पर अडिग हैं। सोनू और सतीश ने कुछ अन्य कार्यकर्ताओं को धोखा देकर आत्मसमर्पण करवाया। उन्होंने माओवादी पार्टी लाइन को तोड़-मरोड़ कर पेश किया। उनके द्वारा लगाए गए सभी आरोप भी झूठे हैं। इस बात का कोई सबूत नहीं है कि माओवादी शीर्ष नेता महाशिवडु और नंबाला केशव राव ने अपनी वीरतापूर्ण मृत्यु से पहले कहा था कि उन्हें हथियार डाल देने चाहिए और शांति वार्ता के लिए तैयार हो जाना चाहिए। सोनू और सतीश ने गलत बातों पर विश्वास करके आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने वाले अन्य माओवादी कार्यकर्ताओं को पुनर्विचार करना चाहिए। अगर वे जनहित के दृष्टिकोण से काम करते हैं, तो वे क्रांतिकारी पार्टी में लौट सकते हैं।”

ज्ञातव्य है कि कल (मंगलवार) आंध्र प्रदेश पुलिस ने मारेडुमिल्ली में कई शीर्ष माओवादी नेताओं को मुठभेड़ में मार गिराया है। इस मुठभेड़ में हिडमा मारा गया। इसी क्रम में विजयवाड़ा, एलुरु, काकीनाडा और अन्य क्षेत्रों में पुलिस ने बड़ी संख्या में माओवादियों को गिरफ्तार किया है। माओवादी ने अभी तक इस मुठभेड़ पर कोई प्रतिक्रिया नहीं दी है।

इसी संदर्भ में आंध्र प्रदेश पुलिस ने माओवादी मुठभेड़ पर महत्वपूर्ण टिप्पणी की। उन्होंने सुझाव दिया कि माओवादियों को जीवन की मुख्यधारा में शामिल हो जाना चाहिए। उन्होंने स्पष्ट किया कि वे माओवादियों की गतिविधियों को अवश्य रोकेंगे। आंध्र प्रदेश पुलिस ने कहा कि मुठभेड़ में मारे गए लोगों के शव पोस्टमॉर्टम के लिए उनके परिवारों को सौंप दिए जाएँगे।

यह भी पढ़ें-

హిడ్మా చివరి లేఖ సోషల్ మీడియాలో వైరల్

హైదరాబాద్ /విజయవాడ : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఆ సమాచారం తమకు తెలియదని ఏపీ పోలీసు అధికారులు తెలిపారు. తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్లు తెలుస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లోని ఓ జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాసినట్లు సమాచారం. నవంబరు 10వ తేదీన జర్నలిస్టుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

‘నా ఆయుధాలు విడిచి పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడ లొంగిపోవాలన్నది కమిటీతో మాట్లాడి నిర్ణయించాల్సి ఉంది. మా భద్రతకు పోలీసులు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది. లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సోను, సతీశ్‌లు అవకాశవాదులు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో అచంచలంగా ఉన్నాం. సోను, సతీశ్ కొంతమంది ఇతర కేడర్లను మోసం చేసి కొంతమంది లొంగిపోయేలా చేశారు. మావోయిస్టు పార్టీ లైన్‌ను వక్రీకరించారు. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధం. వీరమరణం పొందే ముందు మావోయిస్టు అగ్రనేతలు మహాశివుడు, నంబాల కేశవ్‌రావు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పినట్లుగా ఎలాంటి ఆధారం లేదు. సోను, సతీశ్‌లు తప్పుడు విషయాలను నమ్మి లొంగిపోయారు. లొంగిపోయిన ఇతర మావోయిస్టు కేడర్లు పునరాలోచించాలి. ప్రజాహిత దృక్పథంతో పనిచేస్తే విప్లవ పక్షంలోకి తిరిగి రావచ్చు’ అని హిడ్మా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, నిన్న(మంగళవారం) మారేడుమిల్లిలో ఏపీ పోలీసులు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లోనే హిడ్మా మరణించారు. ఈ క్రమంలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు భారీగా పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.

ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. మావోయిస్టుల చర్యలను తప్పనిసరిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని ఏపీ పోలీసులు పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X