हैदराबाद: नए साल के मौके पर तेलंगाना में शराब की जमकर बिक्री हुई है। शनिवार को 215 करोड़ 74 लाख रुपये की सरकार को आमदनी हुई। शराबा की बिक्री में कमी के बावजूद कीमतों में बढ़ोतरी की वजह से रेवेन्यू बहुत ज्यादा इजाफा हुआ। तेलंगाना के 19 शराब डिपो से 2 लाख 17 हजार 444 पेटी शराब और 1 लाख 28 हजार 455 पेटी बियर की बिक्री हुई। अकेले हैदराबाद में 37 करोड़ 68 लाख की आमदनी हुई।
హైదరాబాద్ : న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. నిన్న ఒక్కరోజే రూ. 215 కోట్ల 74 లక్షల ఆదాయం వచ్చింది. అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా భారీగా ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డీపోల నుంచి 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు అమ్ముడవగా లక్షా 28 వేల 455 కేసుల బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి. కేవలం హైదరాబాద్ లోనే 37కోట్ల 68 లక్షల ఆదాయం వచ్చింది.
శనివారం అర్థరాత్రి దాటినా మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో భారీగా ఆదాయం వచ్చింది. ఇక మరోవైపు 2022 సంవత్సరంలో 34 వేల కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 30వరకు ఈ సేల్స్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మద్యం అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో రంగారెడ్డి, సెకండ్ ప్లేస్ లో హైదరాబాద్, థర్డ్ ప్లేస్ లో నల్గొండ జిల్లాలు నిలిచాయి. (Agencies)