तेलंगाना और आंध्र प्रदेश में भारी से अति भारी बारिश, जनजीवन अस्त-व्यस्त, अनेक जिलों में छुट्टी घोषित

हैदराबाद : शुक्रवार को तेलंगाना और आंध्र प्रदेश में तीन दिनों तक भारी से अति भारी बारिश होने की संभावना है। मौसम विभाग की चेतावनी के चलते अधिकारियों ने जन सामान्य से जरूरत रहने पर ही मकानों से बाहर आने का सुझाव दिया है। हैदराबाद के साथ तेलंगाना के अनेक जिलों में बारिश हो रही है।इसके चलते लोगों को सतर्क रहने का निर्देश जारी किया है।

मौसम विभाग की चेतावनी के चलते तेलंगाना के सात जिलों में आरेंज और चार जिलों रेड अलर्ट जारी किया है। शनिवार को भी छह जिलों में भारी से अति भारी बारिश की चेतावनी दी है। इस समय तेलंगाना के अनेक जिलों में भारी बारिश हो रही है। अभिभावकों ने भारी बारिश की चेतावनी के चलते स्कूलों को छुट्टी घोषित करने का आग्रह किया है।

दूसरी ओर आंध्र प्रदेश भारी बारिश हो रही है। इसके चलते मुख्यमंत्री चंद्रबाबू नायुडू ने भारी बारिश की चेतावनी के चलते आधी रात को अधिकारियों के साथ आपातकालीन समीक्षा बैठक की है। उन्होंने भारी बारिश की चेतावनी के चलते अधिकारियों से सतर्क रहने और आवश्यक कदम उठाने का निर्देश दिया है। साथ ही तटीय लोगों को सुरक्षित जगहों पर स्थानांतरित करने और राहत शिविर स्थापित करने का सुझाव दिया।

इसी क्रम में भारी बारिश के चलते अल्लूरी सीताराम, विशाखापट्टणम, अनकापल्ली जिले में आज स्कूलों को छुट्टी घोषित की गई है। साथ ही एलुरू जिले के पांच मंडलों में स्कूलों को भी छुट्टी घोषित की गई है। भारी बारिश के चलते आंध्र प्रदेश में जनजीवन अस्त-व्यस्त हो गया है।

संबंधित खबर-

తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, ములుగు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించిన వెదర్ డిపార్ట్మెంట్. మహబూబాబాద్, ములుగు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. GWMC ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.  వరద ముంపు, వర్షపు నీళ్ల ఆగడం తదితర సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. 

భారీ వర్షాల నేపథ్యంలో టోల్ ఫ్రీ నంబరు 1800 425 1980, సెల్ నంబరు 97019 99645 సంప్రదించాలని కోరిన GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు.  ప్రజారోగ్యం, డీఆర్ఎఫ్ టీం అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరోవైపు ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజ్ కు ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారులు  మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న  ముళ్లకట్ట , రామ్మన్నగూడెం , మంగపేట పుష్కర్ ఘాట్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

పశ్చిమ బంగాళఖాతంలో ఏర్పడిని అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 12 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో అప్రమత్తమైన జిల్లాకలెక్టర్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న విశాఖ, అనకాపల్లి జల్లాలకు ఇవాళ ఒక్కరోజు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏలూరు జిల్లాలోని పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. అల్పపీడనం కారణంగా గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X