అధికారులు అప్రమత్తంగా ఉండండి
అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్లొద్దు
ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలి
నీటి పారుదల శాఖాధికారులు ఎవ్వరూ సెలవులు పెట్టోద్దు
ఎప్పటికప్పుడు రిజర్వాయర్లను,చెరువులను మానిటరింగ్ చెయ్యాలి
నీటి స్థాయిలను పర్య వేక్షించండి
ఓవర్ ఫ్లో నిరోదించ డానికి గేట్లు,స్పిల్ వేలను పరిశీలించాలి
డ్యామ్ లు,కట్టలు,కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలి
ప్రమాదం సంభవిస్తుందన్న కుంటున్న ప్రాంతంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
రైల్వే ఎఫెక్టెడ్ చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి
అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా స్పందించాలి
విపత్తులు గుర్తించి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోండి
-నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ నుండీ అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖాధికారులను రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత ప్రభుత్వ వాతావరణ శాఖా రెడ్ ఏలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఈ సమయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను విడిచి పోవద్దని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని ఆయన సూచించారు. రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన నేపద్యంలో ఎవ్వరూ సెలవులు పెట్టొద్దని ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేస్తుండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలన్నారు. మరీ ముఖ్యంగా ఓవర్ ఫ్లో ను నిరోధించడానికి గేట్లు,స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలంచాలన్నారు.
ఇది కూడ చదవండి-
ఎప్పటికప్పుడు డ్యామ్ లు కట్టలు,కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రమాదం పొంచి ఉందన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు మించి రైల్వే ఎఫెక్టెడ్ చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితిలలో నీటిపారుదల శాఖా ఇంజినీర్లు వేగవంతంగా స్పందించాలన్నారు. విపత్తులు సంభవిస్తే స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఖమ్మం, మధిర లో భారీ వర్షాలు, పొంగుతున్న వాగులు
హైదరాబాద్ : కరీంనగర్ పర్యటన రద్దు చేసుకొని హుటాహుటిన ఖమ్మం బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి
వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఉప ముఖ్యమంత్రి
ఖమ్మం కలెక్టర్, కమిషనర్ తో పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖమ్మం, మధిరలో భారీ వర్షాల నేపథ్యంలో.. ఒక్కసారిగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయన్న సమాచారం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కరీంనగర్, చెన్నూరు పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హుటాహుటిన నేరుగా శనివారం రాత్రి ఖమ్మం బయలుదేరారు.
మార్గమధ్యంలో ఖమ్మం కలెక్టర్, కమిషనర్, మధిర రెవిన్యూ, మునిసిపల్ అధికారులతో పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేసిన ఉప ముఖ్యమంత్రి.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి.
వాగులు, వంకలు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన ఉపముఖ్యమంత్రి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను క్యాంపులకు తరలించాలని.. అక్కడ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
మృతుల సంఖ్య ఐదుకు చేరింది
హైదరాబాద్ : విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చెందారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరికొంతమందికి ఆస్పత్రిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు.
కాగా విజయవాడ (ఆంధ్ర ప్రదేశ్) లో కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడ్డాయి. దీంతో ఇళ్లలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఓ యువకుడు మిస్సింగ్ పట్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కొండచరియలు పడిన సమయంలో ఆ యువకుడి ఆచూకీ లేదు. అయితే అక్కడే అతని సెల్ ఫోన్ సిగ్నల్ చూపిస్తున్నాయి. దీంతో అధికారులు శిథిలాలు తొలగిస్తున్నారు.