‘వినాస్త్రీయా జననం నాస్తి.. వినాస్త్రీయా గమనం నాస్తి..వినాస్త్రీయా సృష్టి యేవ నాస్తి’.. అన్న ఓ కవి మాటలను గుర్తు చేస్తూ మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన.. ఆదర్శవంతమైన స్త్రీ మూర్తులకు హృదయ పూర్వక నమస్సుమాంజలు
ఇది కూడ చదవండి-
ఉక్కుమహిళ ఇందిరా గాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తోంది.
మహిళా దినోత్సవం శుభ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకి పెద్ద పీట వేస్తూ ఇందిరా మహిళా శక్తి పథకాలను ప్రకటించడం మహిళలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతకు నిదర్శనం.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద బ్యాంకు రుణాలతో ప్రతి మండల మహిళా సంఘానికి ఒక్కో బస్సు చొప్పున మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకి ఇచ్చేలా చర్యలు చేపట్టంది.
ఉచిత బస్సు ప్రయాణం పొందుతున్న మహిళలే మరోవైపు బస్సుల యజమానులుగా మారి రెండు వైపులా ప్రయోజనం పొందేలా గొప్ప నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు మహిళా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.