హైదరాబాద్: చోటుప్పల్ పట్టణంలో సాయి మంచికంటి డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, చోటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతు సెట్, బి ఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు యామ దయాకర్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు కూడా పాల్గొన్నారు.
అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ…
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య. మోడీ ప్రభుత్వం, తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుంది. గతంలో నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం. మరోసారి ఇబ్బందులు పెట్టె పనులు చేస్తోంది.
అసలు 2000 నోట్లను ఎందుకు ఉపసంహరణ చేశారో సమాధానం చెప్పాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వ రహస్య ఎజెండా ఉంది. మోడీ ఆయన సన్నిహితులకు లాభం చేకూర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. బిజెపి ప్రభుత్వంపైన ప్రజలకు విశ్వాసం లేదు. మోడీజీ ప్రధాన మంత్రిగా ప్రజల కోసం కాకుండ కేవలం కార్పొరేట్ దోస్తుల కోసం పని చేస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీ రామ రక్ష.