దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధ కృష్ణన్ కు నివాళులు
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత విశిష్టమైనది. సమున్నతమైనది. గౌరవప్రదం అయినది. అటువంటి గురువులను అరదించుకునే రోజే సెప్టెంబర్ 5. తల్లి తండ్రుల తరువాత స్థానం గురువులది. ఒక వ్యక్తి,సమాజం, జాతి నడవడికకు, నడతకు, పురోగతికి శ్రేయస్సుకు మార్గదర్శనం ముమ్మాటికీ గురువే. అటువంటి విశిష్టత కలిగిన సెప్టెంబర్ 5 న గురుపూజోత్సవం జరుపుకుంటున్న ఉపాధ్యాయ బంధు వర్గానికి శుభాభినందనలు. వ్యక్తిత్వ వికాసానికైనా, దేశ సంగ్రతకైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం.
అటువంటి గురువుల ఆశీర్వాదాలతోటే నేను నేడు మీ ముందు ఉన్నత స్థానంలో ఉన్నానని తెలియ జెప్పేందుకు గర్వపడుతున్న. అటువంటి గురువులను పూజించేందుకు ఉద్దేశించ బడిన రోజు దివంగత భారత తొలి ఉప రాష్ట్రపతి, మలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన శుభసందర్బాన్నీ పురస్కరించుకుని టీచర్స్ డే ను నిర్వహించు కోవడం యావత్ భారతదేశానికి తలమానికం. చైనా, పాకిస్తాన్ లతో జరిగిన యుద్ధ సమయంలో నాటి ప్రధానులకు మార్గదర్శనం చేసిన మహోన్నతుడు.
Also Read-
ఉపాధ్యాయుడిగా మొదలు పెట్టిన జీవితం ఆంద్రా, బనారస్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ నుండి సోవియట్ కు రెండో రాయబారిగా బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్ జన్మదినాన్ని బావి తరాలకు గుర్తుండి పోయేలా గురుపూజోత్సవం జరుపుకుంటున్న ఉపాధ్యాయ బందువర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియ జేసుకుంటున్నాను.
నాకు వ్యక్తిగతంగా విద్యను బోధించిన గురువుల యాదిలో…
మీ
ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామంత్రి
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు.
జాతి గర్వించదగ్గ అధ్యాపకులు, ఉపాధ్యాయ వృత్తికి తలమానికంగా నిలిచిన భారత మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మనకందరికీ గర్వకారణం.
రేపటి పౌరులను మేధావులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, జాతి నడిపే సమున్నత స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత గురుతర బాధ్యతను పోషిస్తున్న అధ్యాపకులకు ఏమిచ్చినా రుణం తీరదు.
సమున్నతమైన జాతి నిర్మాణంలో గురుతరమైన బాధ్యతను పోషిస్తున్న అధ్యాపకులను ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుంది. వారి సేవలకు సముచితమైన గౌరవాన్ని అందిస్తుంది.
అందులో భాగంగానే దశాబ్దమున్నర కాలంగా పెండింగ్ లో ఉన్న అధ్యాపకుల ప్రమోషన్లు, బదిలీల సమస్యను ప్రజా ప్రభుత్వం పరిష్కరించింది. అంతేకాక ఖాళీగా ఉన్న టీచర్లు పోస్టుల భర్తీ కొరకు మెగా నోటిఫికేషన్ ని కూడా ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది.
విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తి జాతి సమైక్యత భావాలను పెంపొందించేలా కృషి చేస్తున్న అధ్యాపకులు అందరికీ మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు.
మీ భట్టి విక్రమార్క
ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ ర్రాష్ట్రం