हैदराबाद: आंध्र प्रदेश के गुंटूर जिले में शनिवार को एक सभा में भगदड़ मचने से तीन महिलाओं की मौत हो गयी और 13 अन्य घायल हो गये। घायलों का जीजीएच अस्पताल में इलाज चल रहा है। पुलिस ने मामला दर्ज कर घटना की जांच शुरू कर दी है।
హైదరాబాద్ : గుంటూరు (ఆంధ్ర ప్రదేశ్) జిల్లాలో నిన్న జరిగిన సభలో తొక్కిసలాట వల్ల ముగ్గురు మహిళలు చనిపోవడం, 13 మంది గాయపడటం అందర్నీ కలచివేసింది. గాయపడిన వారికి GGH ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సభ నిర్వాహకులపై కేసు నమోదు చేసి బాధితులు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు సాగుతుందని తెలిపారు. తొక్కిసలాట జరగడం, బారికేడ్లు అడ్డుగా ఉండటం వల్ల ఇలా జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు పోలీసులు.
మరోవైపు మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనకు ఉయ్యూరు ఫౌండేషన్ దే పూర్తి బాధ్యత అన్నరు. దీనిపై రాజకీయాలు వద్దు అన్నారు. అటు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అర్థిక సాయం ప్రకటించారు.
ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. (Agencies)