రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా 16న గ్రామీణ భారత్ బంద్‌కు జరుగుతుంది. పంజాబ్ నుండి పాదయాత్ర చేస్తున్న వందలాది మంది రైతులను అంబాలా సమీపంలో హర్యానాతో రాష్ట్ర సరిహద్దు వద్ద నిలిపివేసినప్పుడు కూడా భారత్ బంద్ కు పిలుపు వచ్చింది. రైతులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తలవంచటానికి గ్రామీణ భారత్ బంద్ పిలుపునిచ్చారు. ఢిల్లీ చుట్టూ హై అలర్ట్ ఉంది. అలాగే కర్ణాటక వ్యాప్తంగా రైతు సంఘాలు బంద్ కు మద్దతు తెలుపారు. తెలంగాణలో కూడ అనేక సంఘాలు భారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నారు.
కేంద్ర కార్మిక సంఘాలతో పాటు The Samyukta Kisan Morcha (SKM) తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచాలని కోరుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన గ్రామీణ భారత్ బంద్‌లో భావసారూప్యత కలిగిన రైతు సంఘాలన్నీ ఏకమై పాల్గొనాలని కోరింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోజంతా నిరసనలు చేపట్టారు.
ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో అంబాలా సమీపంలో హర్యానాతో రాష్ట్ర సరిహద్దు వద్ద పంజాబ్ నుండి కవాతు చేస్తున్న వందలాది మంది రైతులను అడ్డుకున్నప్పటికీ భారత్ బంద్ పిలుపు వచ్చింది. వారిని చెదరగొట్టేందుకు హర్యానా భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులు ముందుకొస్తే దేశ రాజధానిలోకి ప్రవేశించకూడదని ఢిల్లీ పోలీసు నిర్ణయించారు.
ఈ బంద్ దేనిని ప్రభావితం చేస్తుంది?
రైతు సంఘాల దేశవ్యాప్త సమ్మె కారణంగా రవాణా, వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) గ్రామీణ పనులు, ప్రైవేట్ కార్యాలయాలు, గ్రామ దుకాణాలు మరియు గ్రామీణ పారిశ్రామిక మరియు సేవా రంగ సంస్థలు మూసివేయబడతాయి. అయినప్పటికీ, అంబులెన్స్ ఆపరేషన్లు, వార్తాపత్రికల పంపిణీ, వివాహాలు, మెడికల్ షాపులు, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు మొదలైన అత్యవసర సేవలు బంద్ నుంచి మినహాయించారు.
రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లేదా Minimum Support Price (MSP) హామీ ఇచ్చే చట్టం కోసం తమ డిమాండ్ చేస్తున్నారు. రైతులు Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS) ను బలోపేతం చేయాలని, Old Pension Scheme విధానాన్ని పునరుద్ధరించాలని, అధికారిక మరియు అనధికారిక రంగాలలోని కార్మికులందరికీ పెన్షన్ మరియు సామాజిక భద్రత (social security) కల్పించాలని కోరుతున్నారు.
Swaminathan Formula of C2 50 (మూలధన వ్యయం 50 శాతం), సేకరణకు చట్టబద్ధమైన హామీ, రుణమాఫీ, విద్యుత్ టారిఫ్‌ల పెంపుదల, స్మార్ట్ మీటర్లు ఉండకూడదని డిమాండ్ చేస్తూ SKM ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. గృహావసరాలకు, దుకాణాలకు వ్యవసాయానికి ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్, సమగ్ర పంటల బీమా, పింఛన్లను నెలకు Rs.10,000 కి పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ బంద్ కు ఎవరి మద్దతు వుంది?
గ్రామీణ భారత్ బంద్‌కు కార్మికులు, రైతులు సంయుక్తంగా ఇచ్చిన పిలుపునకు మద్దతుగా పలువురు ప్రజా మేధావులు, కళాకారులు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మొత్తం 34 మంది ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు, ఇది రైతులు మరియు కార్మికుల “ఈ ముఖ్యమైన చర్యకు అన్ని వర్గాల ప్రజల మద్దతును అందించాలని” ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
వారి జీవితాలు మరియు జీవనోపాధిపై ప్రభుత్వం మరింత దూకుడుగా చేస్తున్న దాడిని మరియు ఏ ఐక్య పోరాటానికి అంతరాయం కలిగించే విషపూరిత మత ప్రచారాన్ని సవాలు చేయడానికి మరింత శక్తివంతమైన శక్తిని సృష్టించేందుకు రైతులు మరియు కార్మికులు చేతులు కలిపారని ప్రకటన పేర్కొంది. దేశంలోని సుదూర ప్రాంతాలకు ప్రచారాన్ని తీసుకెళ్తున్నందున ఈ శక్తి మరింత ఊపందుకుంటుందని ప్రకటన పేర్కొంది.
Prabhath Patnaik, ఆర్థికవేత్త; Irfan Habib, చరిత్రకారుడు; Nasir Tyabji, ఆర్థిక చరిత్రకారుడు; Anil Chandra, సాంస్కృతిక కార్యకర్త; మరియు P. Sainath, జర్నలిస్ట్, ఈ ప్రకటనపై సంతకం చేసిన వారిలో కొందరు ప్రముఖులు ఉన్నారు.
Central Trade Unions (CTUs) మరియు Samyukta Kisan Morcha (SKM) Industrial/Sectorial stike మరియు గ్రామీణ భారత్ బంద్‌కు ఐక్యంగా పిలుపునిచ్చాయి. ఐక్య మరియు సమన్వయ పోరాటాలను ప్రారంభించేందుకు మరియు అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి వారు సంఘటితమయ్యారు. BJP నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాల దాడిని తీవ్రంగా ఎదుర్కుంటున్నారు.
ప్రభుత్వ స్పందన ఎలా వుంది?
తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు పంజాబ్‌కు చెందిన రైతులు పంజాబ్ మరియు హర్యానాలోని Shambhu and Khanauri సరిహద్దుల్లో ఢిల్లీ వైపు పాదయాత్ర చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పోలీసులు 30,000 కంటే ఎక్కువ tear gas shellsకు ఆర్డర్లు ఇచ్చారని, వారి ‘డిల్లీ చలో’ నిరసనలో పంజాబ్ రైతులను దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి బలగాలు సిద్ధంగా ఉన్నారు.
2020 సంవత్సరంలో రైతుల నిరసన
2020 సంవత్సరంలో రైతుల వారి నిరసన సందర్భంగా, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, ప్రధానంగా Punjab, Haryana and Uttar Pradesh లు Singhu, Ghazipur and Tikri సరిహద్దుల వద్ద ధర్నాకు దిగారు. వారు ఆగస్టు 2020 నుండి డిసెంబర్ 2021 వరకు అక్కడే కూర్చున్నారు. ట్రాక్టర్ల ఊరేగింపులో తరలిస్తున్న రైతుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి పోలీసులు లాజిస్టిక్‌లను వుపయోగించి పరుగెత్తవలసి వచ్చింది.
మార్చ్ 2024 లో తిరిగి బంద్ ఏమిటి?
INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF మరియు UTUCలతో కూడిన ట్రేడ్ యూనియన్ల సంయుక్త ఫోరమ్, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మరియు దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మార్చి 28,29 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను నిర్వహించాలని నిర్ణయించింది. కార్మికులు, రైతులు, ప్రజల వంటి చిన్నతరహా కార్మికులను ప్రభావితం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా; ఇంధన ధరలు పెరగడం మరియు Employees Provident Fund Organisation (EPFO) వడ్డీ రేటు తగ్గడం కూడా కారణాలలో ఉన్నాయి.
బంద్ ప్రభావం ఢిల్లీలో ఎలా వుంది?
ఆందోళనకారుల కదలికలను నిరోధించేందుకు Haryana మరియు Punjab సరిహద్దులను పోలీసు అధికారులు సీల్ చేయడంతో రైతులు భారీ నిరసనలు చేపట్టారు. Section 144 విధించబడింది, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడడాన్ని నిషేధించారు. నిరసనల కారణంగా పంజాబ్‌లోని రాష్ట్ర, జాతీయ రహదారులను శుక్రవారం నాలుగు గంటల పాటు మూసి ఉంచారు. గ్రామీణ భారత్ బంద్ కారణంగా కొన్ని కోట్ల నష్టము జరగనుంది.
– Dr Sheik Mohammad