हैदराबाद: तेलंगाना की राज्यपाल तमिलीसाई सौंदरराजन ने कहा कि वह भले ही तमिलनाडु की बेटी हैं, लेकिन तेलंगाना के लोगों की बहन हैं। राज्यपाल तमिलिसाई भद्राचलम के आदिवासियों के साथ रूबरू हुई। इस अवसर पर आंध्र प्रदेश में विलय किये गये पांच ग्राम पंचायत के जनजातीय लोगों ने राज्यपाल से अपनी समस्याओं से अवगत कराया। आदिवासियों ने राज्यपाल से आंध्र प्रदेश में विलय की गई पांच ग्राम पंचायतों को तेलंगाना में विलय करने का आग्रह किया।
इस अवसर पर बोलते हुए राज्यपाल ने कहा कि वह यहां की समस्याओं को समझते हैं और जल्द से जल्द आदिवासियों के मुद्दों को केंद्र सरकार के ध्यान में लाएंगे। आदिवासियों ने समस्या के समाधान का वादा किया, जिसे हल करने की जिम्मेदारी उन्हें सौंपी गई है।
राज्यपाल तमिलीसाई बुधवार सुबह सिकंदराबाद से ट्रेन से कोत्तागुडेम पहुंचीं। उन्होंने बुर्गमपडु मंडल में सारपका आईटीसी गेस्ट हाउस में पुलिस की सलामी ली। बाद में भगवान श्रीराम के दर्शन किए। मंदिर प्रशासन ने उनका गर्मजोशी से स्वागत किया।
నేను తమిళనాడు బిడ్డనైనా… తెలంగాణకు సోదరిని: గవర్నర్
హైదరాబాద్: తాను తమిళనాడు ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు సోదరినని గవర్నర్ తమిళి సై అన్నారు. భద్రాచలం ఆదివాసీలతో గవర్నర్ తమిళిసై ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తో ఆదివాసీ ప్రజలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యల గురించి విన్నవించారు. ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని గవర్నర్ ను కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ ఇక్కడి సమస్యలను తాను అర్థం చేసుకున్నానని గిరిజన సమస్యలను వీలైనంత త్వరగా తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారని తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవాళ ఉదయం సికింద్రాబాద్ నుండి రైలు మార్గాన కొత్తగూడెం చేరుకున్న గవర్నర్ తమిళి సై. బూర్గంపాడు మండలంలోని సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. (ఏజెన్సీలు)