हैदराबाद : तेलंगाना की राज्यपाल तमिलिसाई सौंदरराजन ने कहा कि तेलंगाना के गांवों में जीवन स्तर में सुधार हुआ है। इसके चलते तेलंगाना देश के लिए एक उदाहरण बन गया है। शुक्रवार को तेलंगाना बजट-2023 की बैठक शुरू हुआ। उन्होंने विधानसभा के दोनों सदनों को संबोधित किया।
राज्यपाल ने अपने भाषण की शुरुआत लोक कवि कलौजी की कविता से की। उन्होंने कहा कि सरकार तेलंगाना के विकास के लिए लगातार काम कर रही है। राज्यपाल ने आगे कहा कि सरकार ने कई चुनौतियों को सामना किया है। तेलंगाना में 24 घंटे बिजली दी जा रही है। बिजली की खपत रिकॉर्ड स्तर तक बढ़ी है।
तमिलिसाई ने कहा, “पहले पानी के लिए मारामारी होती थी। अब हम मिशन काकतीय के साथ तालाबों का जीर्णोद्धार किया गया है। हम मिशन भागीरथ के माध्यम से हर घर को अच्छा पानी उपलब्ध कर रहे हैं।र कालेश्वरम परियोजना को जल्द ही पूरा कर लिया जाएगा।”
राज्यपाल ने आगे कहा कि सरकार दलितों के विकास के लिए दलित बंधु लेकर आई है। अनुसूचित जनजाति का आरक्षण बढ़ाकर 10 प्रतिशत किया गया। थानों को पंचायतों में तब्दील किया गया। सरकार आसरा पेंशन के साथ गरीबों का सहायता कर रही है। हथकरघा बीमा योजना के माध्यम से जीवन बीमा प्रदान कर रही है। गांवों के कल्याण के लिए शराब की दुकानों में 15 प्रतिशत आरक्षण लागू किया जा रहा है।
उन्होंने कहा कि ताड़ और आईटीए के पेड़ों पर कर को रद्द किया है। कपड़े धोने के लिए 250 यूनिट तक मुफ्त बिजली प्रदान कर रही है। सैलून, सिविल पुलिस नौकरियों में महिलाओं के लिए 33 प्रतिशत आरक्षण लागू किया गया और इसके लिए वित्तीय सहायता दी जा रही। कल्याण लक्ष्मी और शादी मुबारक के तहत लड़कियों को 1,00,116 रुपये दिये जा रे हैं।
దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు.
ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు.
వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు.
పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు.
2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు. (ఏజెన్సీలు)