హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ఎంతో లాభదాయకంగా ఉందని తెలుసుకున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో భాగంగా ఆ పథకం యొక్క పనితీరు మరియు వాటిని పొందుకున్న లబ్ధిదారుల యొక్క కుటుంబాల ఆదాయ స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర పశు సం. శాఖ అధికారులను గొర్రెలు మరియు ఉన్ని అభివృద్ధి బోర్డు జే. డి డా. నీత్వాల్ ఆర్ఎస్ గారు, షీప్& గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్ గారు, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ సక్సేన గార్లను తెలంగాణకు పంపించడం జరిగింది.
గతంలో కర్ణాటక, మహారాష్ట్ర అధికారిక బృందం గొర్రెల పంపిణి పై అద్యయనం కోసం తెలంగాణ కు వచ్చారని నేడు ఉత్తరాఖండ్ బృందం రావటం సీయం కెసీఆర్ గారి విజినరీ లీడర్ షిప్ లో నేను పనిచేయటం సంతోషం కలిగిస్తూందని చైర్మన్ డా. దూదిమెట్ల పేర్కోన్నారు. గొర్రెల మాసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఉత్తరాఖండ్ అధికారుల బృందం ప్రశంసించారు.
గొర్రెల పంపిణీ పథకం వల్ల గొల్ల, కురుమ సోదరులకు ప్రజలకు నాణ్యమైన మాంసం సరసమైన ధరలకు అందించడంపై అధికారుల ఆర! సీఎం కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అద్భుతం అని అధికారుల ప్రశంస. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం దేశంలోనే అద్భుతమైన పథకం అని ఫెడరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఈ భేటీలో ఉత్తరాఖండ్ గొర్రెలు మరియు ఉన్ని అభివృద్ధి బోర్డు జే.డి డా.నీత్వాల్ ఆర్.ఎస్ గారు పేర్కొన్నారు
మసబ్ ట్యాంక్ గొర్రెల,మేకల అభివృద్ధి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉత్తరాఖండ్ గొర్రెలు మరియు ఉన్ని అభివృద్ధి బోర్డు జెడి డా.నిత్వాల్ R.S గారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం గురించి చర్చించారు. ఒకే సామాజిక వర్గానికి గొల్ల,కురుమలందరికి ఈ పథకాన్ని పెట్టడం వలన కేసీఆర్ పై అభినందనలు తెలిపారు.గొల్ల,కురుమలకు సహకారం అందిస్తున్న మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో రెండు విడుతలలో కలిపి 12 వేల కోట్లు ఖర్చు చేశారు.మొదటి విడుత 3,60,098 మందికి గొర్రెల యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారు . రెండో విడతలో మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ జరుగుంతందని తెలియచేశారు. ఈ పథకంలో భాగంగా 75 శాతం సబ్సిడీతో గొర్రెలను అందిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 8710 గ్రామ పంచాయతీల్లో 7846 సొసైటీల్లో 7,18,069 మంది (18 ఏళ్లు నిండిన వారు) సభ్యులుగా చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంచార పశువైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలియజేశారు.
వీటి ద్వారా మంద వద్దకే ఔషధాలు పంపుతారు. క్రమం తప్పకుండా నట్టల మందు, టీకాలు వేస్తారు. ప్రతీ జిల్లాకు 4 టన్నుల స్టైలో గడ్డి విత్తనాలను సరఫరా చేయనున్నారు. ప్రతి గొర్రెకు ప్రభుత్వ ప్రీమియంతో భీమా సౌకర్యం కూడా కల్పించిన విషయం తెలియజేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు అంబులెన్స్ ఎలా ఉందో మూగజీవాలకు కూడ అలాగే అంబులెన్స్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1962 పెట్టినా విషయాన్ని కూడా గుర్తు చేశారు. గొల్ల,కురుమల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ద్వారా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మాంసం దిగుమతినీ తగ్గించడం జరిగింది.
ఆ రాష్ట్ర జేడీ డా.నిత్వాల్ R.S గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి గారు గారు మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి సౌరబ్ బహుగుణ గారు ఈ పథకం గురించి పూర్తి సమాచారం కొరకు పంపించారన్న విషయాన్ని తెలియజేశారు NCDC ద్వారా రుణాలు తీసుకొని మేము కూడా త్వరలో మా రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి గారి ఆధ్వర్యంలో ఈ పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ఈ పథకం అమలు చేస్తామని తెలియజేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో గుజరాత్ మరియు రాజస్థాన్ నుండి మాంసం దిగుమతి చేసుకుంటున్నాం విషయాన్ని తెలిపారు ఈ పథకం ఏర్పాటు చేయడం ద్వారా మేమే మాంసం ఉత్పత్తి పెంచడం జరుగుతుంది మీడియా ద్వారా తెలియజేశారు.
ఈ భేటీలో పాల్గొన్నవారు ఉత్తరాఖండ్ షీప్& గొట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్ గారు,షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ సక్సేన గారు,తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఎండి డాక్టర్ యస్.రామచందర్ గారు, ADలు డాక్టర్లు సత్యనారాయణ,వెంకటయ్య గౌడ్, డా. సాయిరాజ్ గారు, డా.మనోజ్, ఎంకే రాజు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.