హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. మాదాపూర్ SOT పోలీసు, RGI పోలీసులు సంయుక్తంగా వాహ నాల తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన పత్రాలే లేకుండా 34.78 కిలల బంగారు నగలు, 43.60 కిలో వెండి పట్టుకున్నారు. అనంతరం RGI పోలీస్ స్టేషన్ కు తరలిం చారు.
పట్టుకున్న బంగారం, వెండి విలువ రూ. 23 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. విచారణలో భాగంగా బంగారం, వెండి ఆభరణాలను FST టీంకు అప్పగించారు. ఈ కేసులో ఇన్ కమ్ టాక్స్ అధికారులు వారి కోణంలో విచారణ చేపట్టారు.
ఈ బంగారం, వెండి ఆభరణాలను GMR Domestic AiR Cargo ద్వారా ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణ లో తేలింది. Naplog Logistic, Marudhar Express & Maa Bhavaani Logistic services ద్వారా ఈ బంగారం, వెండి ఆభరణాలను అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణ లో తేలింది.
నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా సీజ్
హైదరాబాద్ : ఘట్ కేసర్, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని సీజ్ చేశారని ఓ మహిళ రాచకొండ సీపీకి కంప్లయింట్ చేసింది. అన్నోజిగూడకు చెందిన మహిళ అండాలు గురువారం మధ్యాహ్నం ఘట్ కేసర్ లో తన నగలను తాకట్టుపెట్టి అప్పు పైసలు చెల్లించగా.. మిగతా రూ.3.99 లక్షల నగదు తీసుకుని వెళ్తుంది. ఘట్ కేసర్ ఎస్ఐ శ్రీకాంత్ ఆమెను ఆపి డబ్బులు సీజ్ చేశాడు.
నగలు తాకట్టు పెట్టిన రసీదులు చూపినా పట్టించుకో కుండా పోలీసులు డబ్బులు సీజ్ చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. డబ్బులు పట్టుకుని సీజ్ చేయటంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. లోక్ సభ ఎన్నికల రూల్ పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేయకుండా చర్యలు తీసుకోవాలని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె కోరింది. ఏజెన్సీలు)
हैदराबाद में 23 करोड़ रुपये का सोना-चांदी जब्त
हैदराबाद : हैदराबाद शहर में चुनाव के मद्देनजर की जा रही जांच के दौरान भारी मात्रा में सोना और चांदी जब्त किया गया। माधापुर एसओटी पुलिस और आरजीआई पुलिस संयुक्त वाहनों का निरीक्षण कर रही थी और बिना उचित दस्तावेजों के 34.78 किलोग्राम सोने के आभूषण और 43.60 किलोग्राम चांदी जब्त की। बाद में उन्हें आरजीआई पुलिस स्टेशन ले गये।
पुलिस ने कहा कि जब्त किए गए सोने और चांदी की कीमत 23 करोड़ रुपये होगा। जांच के तहत सोने और चांदी के आभूषण एफएसटी टीम को सौंप दिए गए। इस मामले में आयकर अधिकारियों ने अपने दृष्टिकोण से जांच शुरू कर दी है।