हैदराबाद: घरेलू बाजार में सोने-चांदी की कीमतें नई रिकॉर्ड ऊंचाई पर पहुंच गई हैं। अंतरराष्ट्रीय बाजार में खरीदारी में आई तेजी के चलते सोमवार को 10 ग्राम सोने का भाव 2,700 रुपये बढ़कर 1,23,300 रुपये के पार पहुंच गया। अखिल भारतीय सर्राफा संघ के अनुसार, दिल्ली सर्राफा बाजार में 99.9 प्रतिशत शुद्धता वाले 10 ग्राम सोने का भाव 2,700 रुपये उछलकर 1,23,300 रुपये पर पहुंच गया।
शुक्रवार को बंद भाव 1,20,600 रुपये रहा। 99.5 प्रतिशत शुद्धता वाले सोने का भाव भी 2,700 रुपये बढ़कर 1,22,700 रुपये पर पहुंच गया। चांदी की कीमतों में भी तेजी से बढ़ोतरी हुई। प्रति किलोग्राम भाव 7,400 रुपये बढ़कर 1,57,400 रुपये की नई ऊंचाई को छू गया। शुक्रवार को चांदी का भाव 1.50 लाख रुपये रहा। इस कैलेंडर वर्ष में चांदी की कीमतों में 75.47 प्रतिशत की वृद्धि हुई है। 31 दिसंबर 2024 को एक किलोग्राम चांदी की कीमत 89,700 रुपये थी। इस पर बात करते हुए, एचडीएफसी सिक्योरिटीज के सौमिल गांधी ने कहा कि इन रिकॉर्ड कीमतों पर भी निवेशक बुलियन की ओर रुख कर रहे हैं।
गांधी ने आगे बताया कि अमेरिकी सरकार के शटडाउन होने से आर्थिक प्रदर्शन पर पड़ने वाले असर को लेकर चिंताओं के कारण सुरक्षित निवेश के तौर पर सोने की मांग बढ़ रही है। अंतरराष्ट्रीय बाजार में हाजिर सोने का भाव करीब 2 फीसदी बढ़कर 3,949.58 डॉलर प्रति औंस (28.3 ग्राम) के रिकॉर्ड स्तर पर पहुंच गया। चांदी का भाव एक फीसदी से ज्यादा बढ़कर 48.75 डॉलर प्रति औंस के उच्चतम स्तर पर पहुंच गया। अमेरिका में शटडाउन छठे दिन में प्रवेश कर गया। कोटक सिक्योरिटीज की कायनात चैनवाला ने कहा कि इन परिस्थितियों में हाजिर सोने का भाव 3,940 डॉलर के स्तर को पार कर गया है। घरेलू वायदा बाजार में भी सोने और चांदी की कीमतों ने नए रिकॉर्ड बनाए।
यह भी पढ़ें-
బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు
హైదరాబాద్ : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు బాగా పెరగడంతో సోమవారం ఒక్కరోజే 10 గ్రాముల పసిడి ధర రూ. 2,700 పెరిగి రూ. 1,23,300 మార్కును అధిగమించింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ప్రకారం.. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,700 జంప్ చేసి రూ. 1,23,300 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది.
శుక్రవారం ముగింపు ధర రూ. 1,20,600 ఉంది. 99.5 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు కూడా రూ. 2,700 పెరిగి రూ. 1,22,700 వద్దకు చేరుకుంది. వెండి ధరలూ భారీగా పెరిగాయి. కిలో ధర రూ. 7,400 పెరిగి, రూ. 1,57,400 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. శుక్రవారం వెండి ధర రూ. 1.50 లక్షలు ఉంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వెండి ధర ఏకంగా 75.47 శాతం పెరిగింది. 2024 డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ. 89,700 వద్ద ఉంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన సౌమిల్ గాంధీ ఈ విషయమై మాట్లాడుతూ, ఈ రికార్డు ధరల వద్ద కూడా పెట్టుబడిదారులు బులియన్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కావడంతో ఆర్థిక పనితీరుపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు సేఫ్ హెవెన్ అయిన బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయని గాంధీ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు 2 శాతం పెరిగి, ఔన్స్‌కు (28.3 గ్రాములు) రికార్డు స్థాయిలో 3,949.58 డాలర్లను తాకింది. వెండి ధర ఒకశాతానికిపైగా పెరిగి ఔన్స్‌కు 48.75 డాలర్ల వద్ద గరిష్టాన్ని చేరుకుంది. అమెరికాలో షట్‌డౌన్ ఆరో రోజుకు చేరింది. ఈ పరిస్థితుల్లో స్పాట్ గోల్డ్ ధర 3,940 డాలర్ల మార్కును అధిగమించినట్లు కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన కైనత్ చైన్వాలా తెలిపారు. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. (ఏజెన్సీలు)
