హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు నాయకులు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా మనమంతా ఒక్కటే అని యాదవ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు, నేతలకు సూచించారు. మనది రాజకీయాలకు అతీతమైన బంధమని చెప్పారు.
ఇది కూడ చదవండి-
ఇదిలా ఉంటే అఖిలేష్ యాదవ్ ఈరోజు రాత్రికి హోటల్ తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. రేపు ప్రైవేటు మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకు యూపీకి తిరుగు ప్రయాణం అవుతారు. అఖిలేష్ యాదవ్ పర్యటనకు సంబంధించి నగరంలో యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. (ఏజెన్సీలు)
