వైకాపా ప్రభుత్వాన్ని కూలాదోసేందుకు ప్రజలు సిద్దం: తోట చంద్రశేఖర్ (More News, Photos And Vedios From BRS)

రేవంత్ రెడ్డి తెలంగాణ‌కు ప‌ట్టిన వ్యాధి : మంత్రి కేటీఆర్

గ‌త యాభై ఏండ్ల‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు య‌త్నిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నికార్స‌యిన తెలంగాణవాది కాదు.. తెలంగాణ‌కు ప‌ట్టిన వ్యాధి. ఉద్య‌మ‌కారుల‌పైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ ట‌వ‌ర్, న్యాక్ భ‌వ‌నం ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు.

కాంగ్రెసోళ్లు కూడా కేసీఆర్ మీద ఎగ‌బ‌డి ఎగ‌బ‌డి మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండ‌ని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారు. వీళ్ల‌కు ఒక్క‌సారి కాదు.. ప‌ది సార్లు అవ‌కాశం ఇవ్వ‌లేదా.? 50 ఏండ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ మ‌న‌ల్ని సతాయించ‌లేదా..? 50 ఏండ్ల పాటు అధికారంలో ఉండి తాగునీరు, సాగునీరు, క‌రెంట్ చ‌క్క‌గా ఇవ్వ‌లేదు. ఎరువులు, విత్త‌నాలు ఇవ్వ‌కుండా రైతుల‌ను ఇబ్బంది పెట్టారు. మ‌న ప‌ట్ట‌ణాల‌కు నిధులు ఇవ్వ‌కుండా సావ‌గొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా..? ఇవాళ వాళ్లే వ‌చ్చి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు.. ఆలోచించండి.

కేసీఆర్ ఈ రోడ్డు ఇట్ల ఎందుకుంది.. ఆ మోరి అట్ల ఎందుకుంది అని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యాభై ఏండ్లు ప‌రిపాలించినోడో, ఏ ప‌ని చేయ‌డానికి చేత‌కానోడో.. ఇవాళ మ‌న ముందుకొచ్చి కేసీఆర్‌ను తిడుతుంటే ప‌డుదామా? తెలంగాణ ఉద్య‌మంలో ఉద్య‌మ‌కారుల‌పైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి.. నికార్స‌యిన తెలంగాణ వాది అటా..? రేవంత్ రెడ్డి నీవు తెలంగాణవాది కాదు.. నువ్వు తెలంగాణ‌కు ప‌ట్టిన వ్యాధి. తెలంగాణ‌కు ప‌ట్టిన‌ జ‌బ్బు, ద‌రిద్రం కాంగ్రెస్ పార్టీ. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మాట‌ల‌ను న‌మ్మి ఆగం కావొద్దు అని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు సూచించారు.

వైకాపా ప్రభుత్వాన్ని కూలాదోసేందుకు ప్రజలు సిద్దం: తోట చంద్రశేఖర్

హైదరాబాద్: కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగోట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారని బిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. బుధవారం విజయవాడ కి చెందిన వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ మాజీ సభ్యులు పూజల సాయికృష్ణఆజాద్, పాలడుగు నగేష్, వెంకటేష్ సహ పలు జిల్లాకి చెందిన నాయకులు తోట సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.

ఈ సంధర్భంగా తోట మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని పాలకులు ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకే ప్రాధాన్యమివ్వడం దురదృష్టకరమన్నారు. ఎంతో విలువైన సహజ సంపదని దోచుకుంటూ వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిపడ్డారు.

సిఎం జగన్ ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించకుండా కేంద్రంలోని బిజెపి సర్కార్ కు సాగిలపడిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ వైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఎపిలో పాలకులు కులరాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళుతున్న బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు ఎపి ప్రజానీకం నీరాజనాలు పలుకుతున్నారని స్పష్టం చేశారు.

————-

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…

పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి శ్రీనివాస్ గత కొద్ధి రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి భార్య అంబటి రమాదేవి కి, వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుధగాని రమేష్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో మరణించగా వారి భార్య సుధగాని సోమ లక్ష్మి లకు బిఆర్ఎస్ పార్టీ నుండి మంజూరు అయిన జీవిత బీమా రెండు లక్షలు రూపాయలు చెక్కులను రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందచేసి వారి కుటుంబాలకు అండగా వుంటానని భరోసా కల్పించారు.
—————————-

గృహలక్ష్మీ పథకం నిరంతర ప్రక్రియ

దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఆహార భద్రత కార్డు ఉన్న వారందరు అర్హులే..తెల్ల కాగితంపై దరఖాస్తు చేసుకోవచ్చు

గ్రామీణ ప్రాంతాల వారు తహశీల్దార్ కు, పట్టణ ప్రాంతాల ప్రజలు మునిసిపల్ కార్యాలయాల్లో ధరఖాస్తులు అందించాలి

తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది సిఎం కెసిఆర్ ధ్యేయం

ఆగష్టు 15 లోపు బీసీ కులవృత్తుల చేయూత చెక్కుల పంపిణీ

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గృహలక్ష్మి పథకం కింద 10వేల 500 మంజూరు

రెండవ విడత దళితబందు, గొర్రెల పంపిణీ పథకాల ప్రక్రియ వేగవంతం చేయాలి

ఆగష్టు 15 న సాయంత్రం తీగల వంతెనపై సాంస్కృతిక కార్యక్రమాలు

బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

ఇప్పటికే నిరుపేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్న కెసిఆర్ సర్కారు… సొంత జాగ ఉండి… ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మీ పథకం కింద 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనుందన్నన్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మీ… దళితబంధు… బీసీ కులవృత్తులకు చేయూత… సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాల పై కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల అమలు, అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలును యుద్దప్రతిపాదికన చేపట్టి లబ్దిదారులకు అందించాలని సూచించారు. ఇందుకోసం తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. దరఖాస్తు కూడా సులభతరంగానే ఉంటుందన్న మంత్రి గంగుల… స్లాబ్ ఇల్లు ఉన్నవారు…. జిఓ 59కింద లబ్దిపొందిన వారు ఈ పథకానికి అనర్హులన్నారు. గృహలక్ష్మీ కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్ తో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. మీరు తెల్లకాగితం పై రాత పూర్వకంగా దరఖాస్తు రాసి… ఆహార భద్రత కార్డు… అధార్ కార్డు… ఓటర్ ఐడికార్డుతో కలిపి… మీ తహసీల్దార్ కు అందిస్తే… వారు కలెక్టర్ కు అందిస్తారని చెప్పారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు.

లబ్దిదారుల ఎంపికను జిల్లా మంత్రి… కలెక్టర్ రూపోందిస్తారన్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన దరఖాస్తు దారులు… మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గృహలక్ష్మీ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్… ప్రతి మండలానికి ఒక స్పెషల్ వెరిఫికేషన్ అధికారిని నియమించామని చెప్పారు. 3 లక్షల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామని అందులో బెస్ మెంట్ పూర్తికాగానే మొదటి విడతగా లక్ష రూపాయలు… రూఫ్ పూర్తి కాగానే 2వ విడతగా మరో లక్ష రూపాయలు… నిర్మాణం పూర్తి అయిన తర్వాత 3వ విడతలో చివరి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గృహలక్ష్మీ లబ్దిదారులు ఇలాగే ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ఎలాంటి నిబంధన పెట్టలేదని… ఎవరికి నచ్చిన విధంగా వారు ఇల్లు నిర్మించుకోవచ్చాన్నారు.

గృహలక్ష్మీ పథకం కింద ఈ నెల 10వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరించి… 20వ తేదీలోగా లబ్దిదారుల వెరిఫికేషన్ పూర్తిచేస్తామన్నారు. 25వ తేదీన మొదటి విడత లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. లబ్దిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీలు 50 శాతం… వికలాంగులు 5 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. గృహలక్ష్మీ పథకం… మహిళ పేరుతో అందజేయడం జరుగుతుందని… స్థలం మహిళ పేరుతో ఉండాల్సిన అవసరం లేదన్నారు. పథకం కోసం మహిళ పేరిట నూతన బ్యాంకు అకౌంట్ తీయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం కింద మొదటి విడతగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10 వేల 5 వందలు మంజూరు అయ్యాయని..ఇందులో కరీంనగర్ నియోజకవర్గానికి 3 వేల మందికి, చొప్పదండి నియోజకవర్గానికి 1650 మంది, మనకొండుర్ నియోజకవర్గానికి 2వేల మంది, హుజూరాబాద్ కు 2600 మంది, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా పరిధిలో మండలాలకు 1250 మంది లబ్ధిదారులకు అందించనున్నమని తెలిపారు.

తెలంగాణ ఆవిర్బావం అనంతరం రాష్ట్రం నీళ్లు, పచ్చదనంతో కళకలలాడేలా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్బుతంగా నిర్మించుకున్న తీగల వంతెనకు మరింత పర్యాటక శోభను సంతరించేలా అగస్టు 15 సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఇకపై ప్రతి శని, ఆదివారాలలో సండె ఫండే పేరుతో కేబుల్ బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను రద్దు చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

బీసీ కులవృత్తుల చేయూత పథకం చెక్కుల ఈ నెల 15వ తేదీలోగానే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనార్టీ బంధు విధివిధానాలు త్వరితగతిన ఖరారు చేసి… మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. 2వ విడత దళిత బంధు కింద నియోజకవర్గానికి 11 వందల యూనిట్లను మంజూరు చేస్తున్నామని… మొదటి విడుతలో పెండింగ్ లో ఉన్న యూనిట్లను పూర్తిస్థాయి గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు యుద్దప్రతిపాదికన చర్యలు తీసుకోవాలన్నారు. గొర్రెల పథకం మొదటి విడుతలో మంజూరు అయిన వారికి యూనిట్లు త్వరగా అందించాలని సూచించారు.. 2వ విడతగా జిల్లాకు 10 వేల 236 యూనిట్లను కెటాయించారని… దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాకు 540 మంది విఆర్ఎ ల కెటాయించారని… వీరిని ఆయా శాఖాల్లో నియమిస్తూ రేపటి నుండి ఆర్డర్లు జారీ చేస్తామన్నారు. విఆర్ఏల్లో 60 ఏళ్ళ లోపు 439 మంది ఉంటే… 60 ఏళ్ళు దాటిన వారు 107 మంది ఉన్నారని… 61 ఎళ్ళు ఉన్న వారి కుటుంబ సభ్యుల విద్యార్హతను బట్టి… ఉద్యోగ నియమాకాలు చేపడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ చొప్పదండి మరియు హుస్నాబాద్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ సుంకె రవిశంకర్, సంతోష్ కుమార్ లు, జిల్లా కలెక్టర్ డాః బి. గోపి, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, డిసిసి చైర్మన్ కొడూరి రవీందర్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ గౌడ్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గోన్నారు.

————————————–

మంత్రి సత్యవతి రాథోడ్

..ఆదివాసీ ,గిరిజనులు అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
…ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగింది
…ఆదివాసీలకు తెలంగాణ వచ్చాకే మేలు జరిగింది
…రేవంత్ రెడ్డి అసహనం తో మాట్లాడుతున్నారు
…ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ ని బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్ కు అలవాటు
…రేవంత్ రెడ్డి యే కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయం
…రేవంత్ రెడ్డి తెలంగాణ వాదిని అని పదే పదే చెప్పుకుంటున్నారు
…రేవంత్ తెలంగాణ కోసం చేసిన ఓ గొప్ప పని ఏమిటో చెప్పగలరా
…రేవంత్ చేతిలో 2018 కన్నా ఘోరమైన పరిస్థితి 2023 లో కాంగ్రెస్ కు రాబోతోంది
…రేవంత్ బతుకేందో అందరికీ తెలుసు
…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు
…నిక్కర్ లిక్కర్ పార్టీ ఒక్కటి అయ్యాయి అంటున్నవ్ ..నీది చీటర్స్ పార్టీ యా
…గద్దర్ గౌరవాన్ని రేవంత్ తగ్గిస్తున్నారు
…గద్దర్ కు శాసనసభ లో సభ్యుడు కాకున్నా సంతాపం తెలిపాం ..కౌన్సిల్ లో కూడా తెలిపాం
…మంత్రి ktr ghmc అధికారుల కు గద్దర్ అంత్యక్రియల ఫై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు
..అధికారికంగా అంత్యక్రియలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు
..గద్దర్ కాంగ్రెస్ పార్టీ యా ..ఆయన అందరి మనిషి
..గద్దర్ కాంగ్రెస్ పార్టీ అయితే కే ఏ పాల్ పార్టీ లోకి ఎందుకు వెళ్లారు
…గద్దర్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇస్తే ..కొత్త పార్టీ కోసం ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు
…గద్దర్ మరణాన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తానంటే కుదరదు
…రేవంత్ ఇకనైనా భాష మార్చుకోవాలి
…కాంగ్రెస్ కు పది నియోజక వర్గాల్లో అభ్యర్థులను దించలేని పరిస్థితి రేవంత్ ది
…ఎన్నికల దాకా కాంగ్రెస్ నేతలను కలిసి నడిపించు రేవంత్ దమ్ముంటే
..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయం
..రాష్త్రం లో కాంగ్రెస్ కు ఆదివాసీలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం
…ఆదివాసీలను అన్నింటా వెనకబడేసింది కాంగ్రెస్ పార్టీ
…గిరిజన ఆదివాసీలు వెనక బడటం లో ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ

————————

గాంధీజీకి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర

బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు.

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి బుధవారం రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, బోర్లకుంట వెంకటేష్ నేతకానిలతో కలిసి పుష్పాంజలి ఘటించారు.

————————

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

..కరెంటు మీద తన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడం తో పీసీసీ అధ్యక్షుడు అసహనం తో మాట్లాడుతున్నారు
…ఇష్టారీతిన మాట్లాడితే హీరో అవుతాను అనుకుంటున్నాడు
…ఆయన భాషను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు
…కేసీఆర్ ను పొరుగు రాష్ట్రం ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు
…వీర తెలంగాణ వాదిని తానే అని పీసీసీ అధ్యక్షుడు తనకు తాను చెప్పుకుంటున్నారు
…కేసీఆర్ పై సిద్ధాంతాల మీద పోరాడాలి ..వ్యక్తిగత ద్వేషం తో కాదు
…రెండు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చిన చంద్రబాబు వెంట నడిచిన రేవంత్ తెలంగాణ న్యాయాన్ని సమర్ధించలేదు
…రేవంత్ తన సవాళ్ల పై గతం లో వెనక్కి పోయారు ..ఇపుడు ఆయన తాజాగా విసిరే సవాళ్లకు అర్థం లేదు
…కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్న రేవంత్ మాట ఎందుకు తప్పారు
…అలాంటి రేవంత్ ను ఎవరు నమ్ముతారు
…అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ కు బతికున్నపుడే పిండం పెట్టింది రేవంతే ..ఇంకా వేరే వాళ్లకు పిండం పెట్టడం గురించి దేవుడెఱుగు
…టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ గురించి పోరాడ లేదని విచిత్రంగా మాట్లాడుతున్నారు
…తెలంగాణ లో ఈ రోజు విద్యుత్ డిమాండ్ గత సంవత్సరం ఇదే రోజు కన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువ ..ఇది కేసీఆర్ చేసిన అభివృద్ధి కాదా
…ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు గా ఉన్న వాడికి సంయమనం ఉండాలి
..ఏదీ మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే కుదరదు
..ఒక్కో సారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేనికైనా దారి తీయవచ్చు ..జాగ్రత్త
…కేసీఆర్ ఎంత సంయమనం పాటిస్తే తెలంగాణ వచ్చేదా
…మీ తిట్ల ట్రాప్ లో పడే అంతటి అమాయకులం కాదు
…గీత దాటుతున్నపుడు హెచ్చరించడం మా భాద్యత …తెలంగాణ సమాజం గుర్తెరిగి తీర్పు ఇవ్వాలి
….ప్రభుత్వ చీఫ్ విప్ టి .భానుప్రసాద్ …
…రాజకీయాల్లో చిల్లర పనులు చేస్తూ వార్తల్లో ఉండేందుకు తపించే వ్యక్తి రేవంత్
..ఇలాంటి నాయకులు సుదీర్ఘంగా రాజకీయాలు చేయలేరు
…రేవంత్ ఎక్కడ …కేసీఆర్ ఎక్కడ
…సినిమాల్లో కొంత సేపు వినోదాన్ని పండించే క్యాటగిరి కి రేవంత్ చెందుతారు
…హీరో పాత్రకు రేవంత్ సరి తూగరు
…కర్ణాటక లో కాంగ్రెస్ ఏవో చెప్పి అధికారం లోకి వచ్చారు ..ఇప్పుడు కొట్టుకుంటున్నారు
…ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకో రేవంత్ ..
…హద్దు ల్లో ఉండి మాట్లాడు ..లేక పోతే బీ ఆర్ ఎస్ శ్రేణులు ఉఫ్ అంటే గాల్లో కొట్టుకు పోతావ్
…ప్రజా సమస్యల పై ముందు అవగాహన పెంచుకో
……విప్ గువ్వల బాలరాజు …
…రేవంత్ లాంటి బఫున్ పీసీసీ అధ్యక్షుడు ఎలా అయ్యాడో అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు
…గతం లో సోనియాను బలి దేవత అన్నాడు ..కాంగ్రెస్ ను స్కాం ల పార్టీ అన్నాడు
…పనికి రాని పార్టీ కి పనికి రాని అధ్యక్షుడు రేవంత్
…చంద్రబాబు ఏజెంట్, బ్రోకర్ గా రేవంత్ పని చేస్తున్నాడు ..అందుకే కాంగ్రెస్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు
…రేవంత్ భాష మార్చుకోక పోతే గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదు

కరంటు మీద చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడంతో రేవంత్ ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు

అంశాలవారీగా సైద్దాంతిక ప్రాతిపదికన ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. సందర్భోచితంగా సహేతుకమైన విమర్శలు చేయవచ్చు

ప్రజలు, సమాజం విజ్ఞత కలిగి ఉంటారన్న విషయం గుర్తెరగాలి

రెండో సారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దుర్భాషలాడడం సహేతుకం కాదు .. రేవంత్ వ్యాఖ్యలను వాళ్ల పార్టీ వారే పార్టీని పెంచడానికా ? తుంచడానికి ? అని ఆలోచిస్తున్నారు

కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన రేవంత్ పెద్దవాడు అయిపోడు. అడ్డగోలుగా మాట్లాడితే ఏదో అయిపోతానని ఆపోహా ఉన్నట్లుంది

ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చంద్రబాబు చర్యలలో నీ పాత్ర అబద్దమా ? టీవీలలో పట్టుబడింది నిజమే కదా ? నీ చర్యలను నీ పార్టీ శ్రేణులే హర్షించడం లేదు

పరిమితులకు లోబడి హుందాగా మాట్లాడితే అర్ధవతంగా ఉంటుంది

ప్రభుత్వం ఎంచుకున్న పనులలో ప్రాధాన్యతా క్రమంలో కొన్ని మిస్ అవుతాయి. వాటిని చేసినట్లు మేము చెప్పుకోవడం లేదు. సమయాన్ని బట్టి వాటిని పూర్తిచేస్తాం

అభూత కల్పనలతో కూడిన ఆధారం లేని ఆరోపణలు తాత్కాలికంగా సంచలనం కావచ్చు కానీ కాలక్రమంలో అవి నిలబడవు

సచివాలయం కడితే అందులో నేలమాళిగలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఎదుటివారిని నోటికొచ్చినట్లు దూషించడం పద్దతి కాదు. భాష మార్చు కోవాలని హెచ్చరిస్తున్నాం

86 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు .. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా ? వ్యక్తులను తూలనాడడం ఇదేం పద్దతి ? ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది

రేవంత్ తన చర్యలు, నోటి దురుసు ద్వారా అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి బతికుండగానే పిండం పెడుతున్నాడు

ఆ పార్టీని బతికించుకోవాలి అని ఆ పార్టీ కోసం నిలబడే వాళ్లు గమనించుకోవాలి. ఆలోచించాలి

కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఆయనను సన్యాసం చేయమని ఎవరన్నా అడిగారా ? నువ్వే చెప్పావు. నువ్వే పాటించలేదు. నీవు మాట్లాడిన మాట మీద నువ్వు నిలబడలేదు. అందుకే నీ మాటలకు విలువలేదు. నీ సవాళ్లకే నీవు నిలువలేదు. అటువంటి నీతో చర్చకు రావాల్సిన అవసరం లేదు
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలకు మా ప్రభుత్వంలోని ఎవరూ పాల్పడలేదు. ఒక పద్దతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నాం

మీ స్థాయికి దిగజారి విమర్శించేంత దుస్థితిలో మేము లేము. విచక్షణతో మంచి, చెడ్డలు బేరీజు వేసుకుంటున్నాం

మీ మాయలో పడి అభివృద్ది, సంక్షేమం పక్కకుపెట్టి మిగతా అంశాలను ముందేసుకునే పరిస్థితిలో లేము.

ఇటువంటి వారి అసంధర్భ, దుర్మార్గపు వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారు బుద్దిచెబుతారు

బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, తాతా మధు తదితరులు.

—————-

మంత్రి జి .జగదీశ్ రెడ్డి

..పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్ ,టీడీపీ లదే
..యేళ్ళ కేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తోంది
..రేవంత్ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ ,కాంగ్రెస్ లకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నారు ..కేసీఆర్ కు పిండం తద్దినం పెట్టడం గురించి రేవంత్ మాట్లాడుతున్నాడు
..కేసీఆర్ కు ఎందుకు పిండం పెడుతావ్ ..పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకా
..ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టినందుకు కేసీఆర్ కు పిండం పెడతావా
..తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ కు ప్రాణం పోసినందుకు కేసీఆర్ కు పిండం పెట్టాలనుకుంటున్నావా
..రేవంత్ పిండం పెట్టాలనుకుంటున్నది కేసీఆర్ కు కాదు ..తెలంగాణకు
..రేవంత్ ఇంకా తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉన్నారు
..ప్రజలు ఊహించిన దాని కన్నా గొప్పగా పాలిస్తున్నందుకు కేసీఆర్ కు పిండం పెడతావా
…రాష్ట్రం నుంచి ఆకలి ని పారదోలినందుకా కేసీఆర్ కు పిండం పెట్టేది
…పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతావా
..మాకు రావా మాటలు ..మాట్లాడలేమా
…మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు కు సరైన అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీ కి రేవంత్ అధ్యక్షుడు
…ఎక్కడా దిక్కు లేక రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ అధిష్టానం
…చీమలు పెట్టిన పుట్టలో పాముగా చేరాడు రేవంత్
…రేవంత్ మాట్లాడే భాషను కనీసం వాళ్ళ ఇంట్లో నైనా ఒప్పుకుంటారా
…50 లక్షల లంచం డబ్బుతో దొరికి టీడీపీ కి తద్దినం పెట్టినవ్
…కరెంటు తో పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు తద్దినం పెట్టినావు
…కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే రేవంత్ వాడుతున్న భాష కు రోడ్ల మీద తిరిగేవాడా
..రేపటి రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదు
…మాది కల్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు భాష ,మీది పిండాల భాష
…ప్రజలను చంపడం సంపాదించుకొవడమే మీకు అలవాటు
…ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సరిగా మాట్లాడటం నేర్చుకో
..నీ మాటలు కోట్లాది మందిని గాయపరుస్తున్నాయి
..చరిత్రను నిర్మించిన కేసీఆర్ ను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతావా
…ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కేసీఆర్ గురించి ఏం మాట్లాడారో తెలుసుకో
…కేసీఆర్ గురించి రేవంత్ లాంటి క్షుద్ర రాజకీయాలు చేసే వారికి ఏం తెలుస్తుంది
…కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణ చెబితే మంచిది
..క్షమాపణ చెప్పకపోతే ఏం చేయాలో తెలంగాణ సమాజానికి తెలుసు
…రేవంత్ లాంటి నేతలకు ఎంతో మందికి గతం లో పిండాలు తద్దినాలు పెట్టారు
…రాహుల్ వాడిన చిన్న మాటకే కోర్టు శిక్ష వేసింది
..అంత కన్నా ఎన్నో రెట్లు పరుష పదజాలం వాడుతున్న రేవంత్ పదవి పోవడానికి నిమిషం సమయం చాలు
…కేసీఆర్ ఎవరి మీద కక్ష గట్టరు కనుక రేవంత్ కు రాహుల్ లా శిక్ష పడటం లేదు
…జగన్ కే కాదు చంద్రబాబుకు కూడా ప్రగతి భవన్ లో ఆతిధ్యం ఇచ్చాము
..తెలంగాణ వచ్చాక మాకు ఎవరితో శత్రుత్వం లేదు
..గద్దర్ గురించి అజ్ఞాని రేవంత్ కు ఏం తెలుసు
..గద్దర్ జీవితం ఎవరికి వ్యతిరేకంగా మొదలైంది తెలుసా
…గద్దర్ చరిత్ర తీద్దామా
..గద్ధర్ కు ఫలానా వారే నివాళుర్పించాలని ఎక్కడైనా ఉందా
…గద్దర్ మాతో కలిసి పని చేశారు
…గద్దర్ ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేస్తోంది వాళ్ళే మేము కాదు
…గద్దర్ గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది
…గద్దర్ ఆశయాలను చాలా నెరవేర్చాం ..పూర్తిగా సాకారం చేస్తాం
…గద్దర్ గురించి రేవంత్ మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది
..రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే
..రేవంత్ అహంకారం అతి తెలివి తో కాంగ్రెస్ ను కూడా మొత్తం ఖతం చేస్తార

————

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ

దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

హైదరాబాద్: “గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ గారికి ధరఖాస్తులు పంపించవచ్చు.

ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారు. ప్రతి పక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం.”

వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి

—————

నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు

శాసన సభ మరియు శాసన మండలి సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగాయి. సభలో వివిధ బిల్లులను పాస్ చేయడం జరిగింది.

RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయం.ఉభయ సభలో ఆమోదించి RTC కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని RTC ని ప్రభుత్వం లో కలిపారు.RTC కార్మికుల సంక్షేమం కోసం కెసిఆర్ గారు విశేషంగా కృషి చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఉద్యమ సమయంలో కన్నా కలలు అన్ని సాకారం చేస్తున్నారు .

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ గారిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదు.ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యనికి ప్రమాదం.

పాపం కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు. వాళ్లకు 50 ఏళ్ళు అవకాశం ఇస్తే ఎం చేశారు.

విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు . కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది.కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పగటి కలలుగానే మిగిలిపోతాయి.

కేంద్రం ఒక్క మంచి పని కూడా చేయలేదు. తెలంగాణ పై విషం చిమ్మారు.
తెలంగాణలో ఓట్లడిగే హక్కు బీజేపీ పార్టీకి లేదు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.
అందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని నమ్మలేదు. ఇక నమ్మరు కూడా.

మాకు అందరికి కేసీఆర్ గారే స్ఫూర్తి. కేసీఆర్ గారు ఇచ్చిన స్పూర్తితో నే ఉద్యమంలో పాల్గొన్నాము.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నాడు .నిర్లజ్జగా,అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్ కు పరి పాటుగా మారింది.కేసీఆర్ గారిపైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ పై ప్రేమ లేదు.ఆయనది కపట ప్రేమ మాత్రమే.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారు.

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది

చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వాల్మీకి భవనానికి, ముదిరాజ్ సంఘ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం వెలగొండ, కొప్పునూర్, గ్రామాలకు చెందిన 40 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్, పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని, పల్లెల అభివృద్దే లక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట రమణమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్, సింగిల్ విండో చైర్మన్ నరసింహా రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధు, మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మద్దిలేటి, గ్రామ సర్పంచ్ శివమ్మ, మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, శ్రీధర్ రెడ్డి, గూడెం వెంకట్ రెడ్డి, గోపి నాయుడు, మహిళ సమైఖ్య మండల అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ నాయకులు శరత్ రెడ్డి, మధన్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇతర గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X