హైదరాబాద్ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కు వచ్చిన ఆయన జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయన్ను కలిశారు. దాదాపు గంటపాటు భేటీ అయిన చవాన్.. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భారత్ జోడో యాత్ర అంశాలపై చర్చించారు.
దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చవాన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్రలో భారత్ జోడో జరిగిన తీరు, ఇరు రాష్ట్రాల్లో జోడో యాత్ర ప్రభావంపై భేటీలో చర్చించారు. ఈ భేటీలో మాజీ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
సిఎల్పీ కార్యాలయంలో ధరణి, భూ సమస్యలపై కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం
హాజరైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జాతీయ నాయకులు కొప్పుల రాజు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఈరవత్రి అనిల్, హార్కర వేణుగోపాల్, ప్రీతం తదితరులు.
